England bowlers
-
సఫారీల భరతం పట్టిన ఇంగ్లండ్ బౌలర్లు.. రెండో వన్డేలో బట్లర్ సేన ఘన విజయం
పర్యాటక దక్షిణాఫ్రికా చేతిలో తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సామ్ కర్రన్ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్ కేశవ్ మహారాజ్ (1/29)లు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఆదిల్ రషీద్ (3/29), మొయిన్ అలీ (2/22), రీస్ టాప్లే (2/17), డేవిడ్ విల్లే (1/9), సామ్ కర్రన్ (1/5) సఫారీల భరతం పట్టారు. వీరి ధాటికి సఫారీల ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ (40 బంతుల్లో 33), డేవిడ్ మిల్లర్ (12), ప్రిటోరియస్ (17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే హెడింగ్లే వేదికగా జులై 24న జరుగనుంది. చదవండి: Ind Vs WI: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! -
అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్
లీడ్స్: టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్‌లో అతిధ్య ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ సారధి జో రూట్ తమ బౌలర్లను ఆకాశానికెత్తాడు. ఈ విజయం కచ్చితంగా బౌలర్లదేనని కొనియాడాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, వరుస మెయిడిన్లతో టీమిండియా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారని అన్నాడు. వికెట్లు తీసే అవకాశం కోసం ఎదురు చూసామని, అదును చూసి కనికరం లేకుండా విరుచుకుపడ్డామని పేర్కొన్నాడు. నాలుగో రోజు కొత్త బంతితో తమ బౌలర్లు చెలరేగుతారని ముందే ఊహించామని తెలిపాడు. తొలి రోజు అండర్సన్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాపై పైచేయి సాధించేలా చేశాడని, అతనికి రాబిన్సన్ మద్దతు తోడవ్వడంతో ప్రత్యర్ధిని కోలుకోలేని దెబ్బ తీసామని అన్నాడు. లేటు వయసులో అండర్సన్ యువ బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని, అందుకే అతడిని టెస్టు క్రికెట్లో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' అని అభివర్ణిస్తారని కొనియాడాడు. ఇక బ్యాటింగ్‌లో రాణించిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హమీద్‌తో పాటు డేవిడ్ మలన్‌పై కూడా రూట్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన హోమ్ గ్రౌండ్లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం గొప్పగా ఉందని రూట్ పేర్కొన్నాడు. కాగా, లీడ్స్‌లో విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: క్రీడలను అలవాటుగా మార్చుకోండి.. సచిన్ సందేశం -
కుప్పకూలిన పాకిస్తాన్
మాంచెస్టర్: ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి రెండో టెస్టులో పాకిస్తాన్ జట్టు 63.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. పేసర్ క్రిస్ వోక్స్ (4/67)కు తోడు మొయిన్ అలీ, స్టోక్స్ రెండేసి వికెట్లతో రాణించడంతో పాక్ కోలుకోలేకపోయింది. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో మిస్బా (52) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అనంతరం పాక్‌ను ఫాలోఆన్ ఆడించకుండా ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. వీరి బ్యాటింగ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించగా మూడో రోజు ముగిసే సమయానికి 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 489 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
తొలి టెస్టు ఇంగ్లండ్‌దే
బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ షో లార్డ్స్: ‘డ్రా’ ఫలితం ఖాయమనుకున్న లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చివరిరోజు బంతితో అద్భుతం చేశారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన బెన్ స్టోక్స్ (3/38)తో పాటు బ్రాడ్ (3/50)కూడా బంతితో పవర్ చూపడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 124 పరుగుల తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ చివరిరోజు 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. కోరె అండర్సన్ (87 బంతుల్లో 67; 13 ఫోర్లు; 1 సిక్స్), వాట్లింగ్ (143 బంతుల్లో 59; 9 ఫోర్లు) మాత్రమే ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోగలిగారు. సున్నా పరుగులకే రెండు వికెట్లు తీసిన ఇంగ్లండ్ ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత స్టోక్స్ వరుస బంతుల్లో విలియమ్సన్, మెకల్లమ్ వికెట్లను తీసి చావుదెబ్బ కొట్టాడు. 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో కివీస్‌ను అండర్సన్, వాట్లింగ్ జోడి ఆరో వికెట్‌కు 107 పరుగులు జత చేసి ఆదుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ అవుటవ్వడంతో కివీస్ ఓటమి ఖాయమైంది. అండర్సన్, అలీ, రూట్, వుడ్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. కుక్ (162; 17 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు తొమ్మిది పరుగులు మాత్రమే జత చేశాడు. బౌల్ట్‌కు ఐదు వికెట్లు, సౌతీ, హెన్రీలకు రెండేసి వికెట్లు దక్కాయి. రెండో టెస్టు ఈనెల 29న లీడ్స్‌లో మొదలవుతుంది.