టి20 కోసం నా బ్యాటింగ్‌ మార్చుకునేవాడిని | I Would Change My Batting Style For T20 Cricket Says Sourav Ganguly | Sakshi
Sakshi News home page

టి20 కోసం నా బ్యాటింగ్‌ మార్చుకునేవాడిని

Published Mon, Jul 6 2020 3:18 AM | Last Updated on Mon, Jul 6 2020 3:18 AM

I Would Change My Batting Style For T20 Cricket Says Sourav Ganguly - Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ టి20 క్రికెట్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ తరంలో తాను క్రికెట్‌ ఆడి ఉంటే టి20 ఫార్మాట్‌కు తగినట్లుగా తన క్రికెటింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేవాడినని అన్నాడు. పవర్‌ హిట్టింగ్‌కు ఈ ఫార్మాట్‌ లైసెన్స్‌గా పనిచేస్తుందని పేర్కొన్నాడు. ‘టి20 క్రికెట్‌ ఆడి ఉంటే ఆ ఫార్మాట్‌ను నేను ఆస్వాదించేవాడిని. ఐపీఎల్‌లో ఐదేళ్లు ఆ ఫార్మాట్‌లో  ఆడినప్పటికీ మరింతకాలం ఆడితే బావుండు అనిపిస్తోంది’ అని బీసీసీఐ ట్విట్టర్‌ ఖాతా వేదికగా గంగూలీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2002 నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌ సంబరాలను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ‘అవి గొప్ప క్షణాలు. అలాంటి మ్యాచ్‌ గెలుపొందితే చేసుకునే సంబరాలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. నేను ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో నాట్‌వెస్ట్‌ ఫైనల్‌ కూడా ఒకటి’ అని గంగూలీ నాటి మధుర స్మృతులను తలుచుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement