కోహ్లికి సచిన్ సహకారం
ముంబై: బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి ప్రస్తుతం మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ చెంత చేరాడు. ‘ఈ పరిస్థితిని అధిగమించేందుకు సాయం చేయి’ అని ఢిల్లీ బ్యాట్స్‌మన్ పంపిన ఎస్‌ఓఎస్‌కు స్పందించిన మాస్టర్ అతనికి బ్యాటింగ్‌లో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముంబై క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్‌లో కోహ్లి బ్యాటింగ్‌ను రెండు గంటలపాటు నిశితంగా పరిశీలించిన సచిన్... విరాట్ తప్పులను సరిదిద్దుతున్నాడు.