విశాఖపట్నం, న్యూస్‌లైన్ : నాలుగు దేశాల క్వాడ్రేంగులర్ అండర్ 19 సిరీస్‌లో భారత్ భారీ తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించగా, ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయాన్నందుకుంది. విశాఖ వేదికగా సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో జింబాబ్వేపై టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ హర్వాద్కర్(14బంతుల్లో 8) జోంగ్వే బౌలింగ్‌లో వికెట్ల వెనుక హందీరిషికి దొరికిపోయాడు.
కెప్టెన్ విజయ్ జోల్ (36బంతుల్లో17) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగినా వికెట్ కీపర్ అంకుష్ బైన్స్(62బంతుల్లో49,7ఫోర్లు,1సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. శ్రేయాస్ అయ్యర్ 26 బంతుల్లోనే 28 పరుగులు చేసి గేల్‌కే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. స్థానిక ఆటగాడు రికీబుయ్ (38బంతుల్లో 19)బెల్‌కే క్యాచ్ ఇవ్వడంతో 142 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్(55బంతుల్లో 55, 4ఫోర్లు,1సిక్స్) అర్ధసెంచరీ చేయగా, దీపక్ హుడా ఐదుఫోర్లు, ఐదు సిక్సర్లలతో చెలరేగి 55 బంతుల్లోనే 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీపక్ ఆరో వికెట్‌కు ఖాన్‌తో కలిసి 77పరుగులు జోడించగా, అమీర్ ఘని(15బంతుల్లో 14నాటౌట్)తో ఏడో వికెట్‌కు 72 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ జూనియర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 291 పరుగులు సాధించింది. ప్రతిగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను కుల్‌దీప్ యాదవ్ బెంబెలెత్తించాడు. 34 పరుగులిచ్చి నలుగుర్ని పెవిలియన్‌కు పంపగా ఘని, ఖాన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. హుడా రెండు వికెట్లు కూల్చాడు. దీంతో జింబాబ్వే 41.2 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది.
బౌలర్ల సత్తా : ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగిపోయారు. ఇరుజట్ల లోనూ కనీ సం ఏ ఆటగాడు అర్ధ సెంచరీ చేయలేకపోయా డు. ఆస్ట్రేలియా నిలకడగా రాణించినా చివర్లో చేతులెత్తేయడంతో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాపై టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటి ంగ్ చేసి 44 ఓవర్లలోనే 179 పరుగులకు ఆలౌటైంది.
భారత్ శుభారంభం
Published Tue, Sep 24 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement