సిడ్నీ: భారత్తో జరుగతున్న చివరి, ఐదో వన్డేలో టాస్ ఓడిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఫించ్, డెవిడ్ వార్నర్లు బ్యాటింగ్ కు దిగారు.
ఇప్పటికే 4-0తో సిరీస్లో వెనకంజలో ఉన్న భారత్ శనివారం జరిగే వన్డేలోనైనా విజయం సాధించాలని చూస్తోంది. ఇక ఇప్పటికే సిరిస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ఈ రోజు అక్కడ భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా కాకపోయినా కొంత వరకు మ్యాచ్కు అంతరాయం కలగవచ్చు. వాతావరణం బాగా లేకపోవడంతో శుక్రవారం భారత్ ప్రాక్టీస్ రద్దయిన విషయం తెలిసిందే.
బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా
Published Sat, Jan 23 2016 8:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM
Advertisement
Advertisement