ఇర్ఫాన్ పఠాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన | Irfan Pathan is calling the shots at Syed Mushtaq Ali Trophy | Sakshi
Sakshi News home page

ఇర్ఫాన్ పఠాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన

Published Thu, Jan 7 2016 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

ఇర్ఫాన్ పఠాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన

ఇర్ఫాన్ పఠాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన

 గోవాపై బరోడా ఘనవిజయం  ముస్తాక్ అలీ టి20 టోర్నీ
 వడోదర: ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగడంతో ముస్తాక్ అలీ టి20 టోర్నీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో బరోడా 72 పరుగుల తేడాతో గోవాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
 
  ఇర్ఫాన్ పఠాన్ (29 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుకు తోడు కేదార్ దేవధర్ (31 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (34 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం గోవా 15.4 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. దీప్‌రాజ్ గావ్‌కర్ (42 బంతుల్లో 48; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషి అరోథే, హార్దిక్ పాండ్యా, ఇర్ఫాన్ పఠాన్ తలా 2 వికెట్లు తీశారు.
 
 అస్సాం 44 ఆలౌట్
 ఇక్కడే జరిగిన మరో గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్లతో అస్సాంను చిత్తు చేసింది. ముందుగా అస్సాం 12.1 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మీడియం పేసర్ సుబోథ్ భాటి (4/9) బౌలింగ్‌లో చెలరేగగా, శివమ్ శర్మ 3, సాంగ్వాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 9.1 ఓవర్లలో 2 వికెట్లకు 50 పరుగులు చేసింది. ఉన్ముక్త్ చంద్ (28 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు.
 
 హైదరాబాద్ విజయం
 నాగపూర్: గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్ 35 పరుగులతో హరియాణాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విహారి (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షత్ రెడ్డి (30 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడగా, తొలి మ్యాచ్ ఆడుతున్న ఎ.ఆకాశ్ (18 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత హరియాణా 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితిన్ సైని (25 బంతుల్లో 30; 5 ఫోర్లు) టాప్‌స్కోరర్. కెప్టెన్ సెహ్వాగ్ (9) విఫలమయ్యాడు. విహారి, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement