కోహ్లి ప్రియురాలిని కాపాడిన డివిలియర్స్!
బెంగళూరు: ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్-9 తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై ట్విటర్ లో పుంఖాను పుంఖాలుగా సరదా కామెంట్లు వచ్చాయి. పంచ్ లు విసిరారు, సలహాలు ఇచ్చారు. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ట్వీట్లు వదిలారు.
కోహ్లి సేనను కంగారు పెట్టిన ధవళ్ కులకుర్ణి పుట్టినరోజు మంగళవారమే(మే 24) అన్న విషయాన్ని ఒకరు గుర్తు చేయగా, అతడు గల్లీ క్రికెట్ కూడా ఇన్ని వికెట్లు తీసుండడని మరొకరు కామెంట్ చేశారు. షార్ట్ బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్న లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనాకు వజ్ ఇట్ వెరీ షాట్? అంటూ ప్రశ్న సంధించారు. లయన్స్ నుంచి ఏబీడీ మ్యాచ్ ను లాగేసుకున్నాడని ప్రీతి జింతా ట్వీట్ చేసింది.
సున్నాకే అవుటై కోహ్లి మిషన్ కాదు మనిషినని రుజువు చేసుకున్నాడని ఇంకొరు వ్యాఖ్యానించారు. బెంగళూరు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ షేర్లు కన్నా వేగంగా ఆర్సీబీ వికెట్లు పతనమయ్యాయని పంచ్ విసిరారు. మ్యాచ్ గెలిపించి కోహ్లి ప్రియురాలు అనుష్క శర్మ విమర్శల బారిన పడకుండా డివిలియర్స్ రక్షించాడని మరొకరు కామెంట్ చేశారు. కోహ్లి-డివిలియర్స్ అనుబంధం గురించి చెబుతూ వీరిద్దరి లవ్ స్టోరీ 'టైటానిక్'ను మించిపోయిందని ఇంకొరు పేర్కొన్నారు. గుజరాత్ లయన్స్ తమ థిమ్ సాంగ్ లోని మొదటి పదాలు 'గేమ్ మారీ చె' మార్చుకోవాలని సలహాయిచ్చారు.
AB de Villiers Just Saved Anushka From Trending Worldwide. ;)#RCBvGL #IPL2016 #IPL #IPL9
— Sir Ravindra Jadeja (@SirJadeja) 24 May 2016
RCB wickets falling faster than Kingfisher Airlines shares.
— Trendulkar (@Trendulkar) 24 May 2016
What a game between #RCBvGL tonight#ABD stole the game away & won it in style. Feel sad for Raina but it was #AB's night #Iqbal #VIVOIPL
— Preity zinta (@realpreityzinta) 24 May 2016