
యువరాజ్ సింగ్ రికార్డ్
బెంగళూరు: టీమ్ ఇండియా ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్... ఐపీఎల్-9 టైటిల్ దక్కించుకోవడంలో తనవంతు పాత్ర పోషించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన ఫైనల్లో యువరాజ్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. తమ జట్టుకు ఐపీఎల్ టైటిల్ దక్కడంతో యువీకి అరుదైన రికార్డ్ సొంతమైంది.
వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ, అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్ టైటిల్స్ దక్కించుకున్న టీమ్స్ లో సభ్యుడిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శనతో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా సత్తా చాటాడు.