న్యూఢిల్లీ : క్రికెట్ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చిన ఈ మ్యాచ్ ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. కోహ్లి మాత్రం నిబంధనల జోలికి పోకుండా ఇరు జట్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఇరు జట్లు అద్బుత పోరాటాన్ని కనబర్చాయి. ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు’ అంటూ సాధాసీధాగా ట్వీట్ చేశాడు.
ఈ ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై కావడంతో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌండరీల నిబంధనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గంభీర్‌లు ఈ నిబంధనను తప్పుబట్టగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ తరహా నిబంధనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
Great show by both the teams in the #CWC19Finals yesterday. Congratulations @englandcricket. 👍🏼
— Virat Kohli (@imVkohli) July 15, 2019
I don’t agree with that rule ! But rules are rules congratulations to England on finally winning the World Cup , my heart goes out for the kiwis they fought till the end 😥. Great game an epic final !!!! #CWC19Final
— yuvraj singh (@YUVSTRONG12) July 14, 2019
Comments
Please login to add a commentAdd a comment