'రాంగ్ టైమ్ లో అవుటయ్యా' | RCB had a good game plan up their sleeve: De Kock | Sakshi
Sakshi News home page

'రాంగ్ టైమ్ లో అవుటయ్యా'

Published Mon, May 23 2016 1:31 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

'రాంగ్ టైమ్ లో అవుటయ్యా'

'రాంగ్ టైమ్ లో అవుటయ్యా'

రాయ్ పూర్: మంచి గేమ్ ప్లాన్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయం సాధించిందని ఢిల్లీ డేర్ డెవిల్స్ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ అన్నాడు. ఒత్తిడిలో మ్యాచ్ ఓడిపోయామని చెప్పాడు. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీని బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్-9 ప్లేఆఫ్ కు అర్హత సాధించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత డీకాక్ మాట్లాడుతూ.. బెంగళూరు స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురయ్యామని, మంచి భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయామని చెప్పాడు. బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ చేసిన మార్పులు ఆ జట్టుకు లాభించాయని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయామని, తాను కూడా రాంగ్ టైమ్ లో అవుటయ్యానని తెలిపాడు. మరో 20 పరుగులు చేసివుంటే ఆర్సీబీకి గట్టిపోటీ ఇచ్చేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.

తన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి ఐపీఎల్ దోహద పడిందని, స్పిన్ బౌలింగ్ ఆడడం నేర్చుకున్నానని తెలిపాడు. అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై డీకాక్ ప్రశంసలు కురిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement