'అమ్మాయిలకు ఎప్పుడూ అలా చెప్పలేదు' | Shah Rukh Khan sad over Kolkata Knight Riders' loss | Sakshi
Sakshi News home page

'అమ్మాయిలకు ఎప్పుడూ అలా చెప్పలేదు'

Published Thu, May 26 2016 1:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

'అమ్మాయిలకు ఎప్పుడూ అలా చెప్పలేదు'

'అమ్మాయిలకు ఎప్పుడూ అలా చెప్పలేదు'

ముంబై: ఐపీఎల్ ప్లేఆఫ్ లో తమ జట్టు ఓటమిపై కోల్ కతా నైట్ రైడర్స్(కేకేఆర్) యజమాని, బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ విచారం వ్యక్తం చేశాడు. శుక్రవారం జరగనున్న రెండో క్వాలిఫయిర్ లో హైదరాబాద్ విజయం సాధించాలని ఆకాంక్షించాడు. 'ఎలిమినేటర్ మ్యాచ్ లో కేకేఆర్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఈ మ్యాచ్ లో సరిగా ఆడలేకపోయాం. ఒక్కోసారి మనం ఎంత బాగా ఆడినా సరిపోదు. ఆల్ ద బెస్ట్ ఎస్ ఆర్ హెచ్' అంటూ షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశాడు.

తమ టీమ్ ఓటమిని తట్టుకోలేక కేకేఆర్ చీర్ గాల్స్ కన్నీళ్లు పెట్టుకోవడంపైనా ట్విటర్ లో ఆయన స్పందించాడు. 'కేకేఆర్ ఆటగాళ్లు బాగా ఆడాలని ఎప్పుడూ కోరుకునేవాణ్ని. బాగా అలరించాలని ఎప్పుడూ చీర్స్ గాల్స్ కు చెప్పలేదు. లవ్ యూ గాల్స్ అండ్ థ్యాంక్యూ' అంటూ ట్వీట్ చేశాడు. ఐపీఎల్-9 ప్లేఆఫ్ లో భాగంగా బుధవారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్  22 పరుగులతో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement