cheer leaders
-
కిమ్ తరపున ప్రత్యేక దూతలు
ప్యాంగ్యాంగ్ : దక్షిణ కొరియాలో జరగబోయే వింటర్ ఒలంపిక్స్ ఈసారి హాట్ హాట్‌గా సాగనున్నాయి. దశాబ్దాల తర్వాత ఉత్తర కొరియా ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. పొరుగు దేశంతో శాంతి చర్చలకు తెరలేపిన నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరితోపాటు ఛీర్‌లీడర్స్‌ను కూడా పంపేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఆర్మీ ఆఫ్ బ్యూటీ పేరుతో 18-20 ఏళ్లలోపు ఉన్న అమ్మాయిలను(300 మంది) అధికారులు ఎంపిక చేశారు. ఈ బృందానికి కిమ్ సతీమణి రి సోల్-జూ ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘‘ఉత్తర కొరియా అంటే ప్రపంచం దృష్టిలో కరుడుగట్టిన దేశంగా అభిప్రాయం ఉంది. కానీ, ఇక్కడ అందగత్తెలకు లోటు లేదు. అది నిరూపించేందుకే ఈ ప్రయత్నం’’ అని రి సోల్ ఓ ప్రకటనలో తెలిపారు. 2005 ఇన్చియాన్ ఏషియన్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆమె ఛీర్ గాళ్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా, 2002 బుసన్ ఏషియన్ గేమ్స్ లో ఉత్తర కొరియా తరపున ఛీర్ లీడర్స్ సందడి చేశారు. కొరియన్ వార్ తర్వాత 1953 నుంచి ఇరు దేశాల మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ఈ నెల 9న ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగ్గా.. వింటర్ ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొరియా దేశాల మధ్య మైత్రి నెలకొనేందుకు వింటర్ ఒలంపిక్స్ 'మంచి అవకాశం'గా ఉపయోగపడుతుందని ఇరు దేశాల ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. -
'అమ్మాయిలకు ఎప్పుడూ అలా చెప్పలేదు'
ముంబై: ఐపీఎల్ ప్లేఆఫ్ లో తమ జట్టు ఓటమిపై కోల్ కతా నైట్ రైడర్స్(కేకేఆర్) యజమాని, బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ విచారం వ్యక్తం చేశాడు. శుక్రవారం జరగనున్న రెండో క్వాలిఫయిర్ లో హైదరాబాద్ విజయం సాధించాలని ఆకాంక్షించాడు. 'ఎలిమినేటర్ మ్యాచ్ లో కేకేఆర్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఈ మ్యాచ్ లో సరిగా ఆడలేకపోయాం. ఒక్కోసారి మనం ఎంత బాగా ఆడినా సరిపోదు. ఆల్ ద బెస్ట్ ఎస్ ఆర్ హెచ్' అంటూ షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశాడు. తమ టీమ్ ఓటమిని తట్టుకోలేక కేకేఆర్ చీర్ గాల్స్ కన్నీళ్లు పెట్టుకోవడంపైనా ట్విటర్ లో ఆయన స్పందించాడు. 'కేకేఆర్ ఆటగాళ్లు బాగా ఆడాలని ఎప్పుడూ కోరుకునేవాణ్ని. బాగా అలరించాలని ఎప్పుడూ చీర్స్ గాల్స్ కు చెప్పలేదు. లవ్ యూ గాల్స్ అండ్ థ్యాంక్యూ' అంటూ ట్వీట్ చేశాడు. ఐపీఎల్-9 ప్లేఆఫ్ లో భాగంగా బుధవారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ 22 పరుగులతో ఓడిపోయింది. Can’t deny,feeling very sad we didn’t get it right. Ami KKR till next year now.Sumtimes our best is just not good enuff. All the best SRH. — Shah Rukh Khan (@iamsrk) 25 May 2016 Always wish my KKR boys the best and never said anything to the girls who bring so much cheer. Lov u girls & thanx pic.twitter.com/sxkNxqgrrg — Shah Rukh Khan (@iamsrk) 25 May 2016