వాట్ ఏ ఫెర్ఫార్మెన్స్... | virat kohli praises AB deVilliers performance | Sakshi
Sakshi News home page

వాట్ ఏ ఫెర్ఫార్మెన్స్...

Published Wed, May 25 2016 8:20 AM | Last Updated on Fri, May 25 2018 2:34 PM

వాట్ ఏ ఫెర్ఫార్మెన్స్... - Sakshi

వాట్ ఏ ఫెర్ఫార్మెన్స్...

బెంగళూరు: ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించిన విధ్వంసకర బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. డివిలియర్స్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చాడని పేర్కొన్నాడు. అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడని మెచ్చుకున్నాడు. హోరాహోరీగా జరిగిన కీలక మ్యాచ్ లో డివిలియర్స్ గొప్పగా పోరాడాడని, ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ ఆటగాడని ఆకాశానికెత్తాడు. అతడిలా మరొకరు ఆడలేరని ట్విటర్ పోస్ట్ చేశాడు కోహ్లి.

ఐపీఎల్-9 భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ లయన్స్ తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బెంగళూరు జట్టును డివిలియర్స్ అసమాన పోరాటంతో విజయ తీరాలకు చేర్చాడు. అతడి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో (47 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) బెంగళూరు ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement