టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి పదేళ్ల పాటు కలిసి ఆడారు. ఆర్‌సీబీ టైటిల్ కొట్టడంలో విఫలమైనప్పటికి ఈ జోడి మాత్రం తమ ఆటతో అభిమానులను అలరించారు. డివిలియర్స్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆర్‌సీబీని మాత్రం వదల్లేదు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతీసారి ఆర్‌సీబీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక సందేశాన్ని విడుదల చేయడం మిస్టర్ 360కి అలవాటు. పదేళ్ల పాటు ఒకే జట్టుకు కలిసి ఆడిన కోహ్లి, డివిలియర్స్‌లు మంచి మిత్రులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో(కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్) సెంచరీతో మెరిసిన కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకడని అతను అన్నాడు. గెలవాలనే కసి.. ప్రతిసారి స్కోర్ చేయాలనే ఆకలి గొప్ప ఆటగాళ్లలో కనిపించే లక్షణాలని.. అవన్నీ విరాట్‌లో పుష్కలంగా ఉన్నాయని డివిలియర్స్ తెలిపాడు.
''గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, ఫుట్‌బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్.. వీళ్లంతా గెలవాలనే కసితో ఆడతారు. వీళ్లలో పోరాట స్ఫూర్తి అమోఘం. పోటీ ఏదైనా ప్రతిసారి చాంపియన్ అవ్వాలనుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా అచ్చం వీళ్లలానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు అతడి హృదయం చాలా అందమైనది'' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
పదేళ్లు ఒకే జట్టుకు
మిస్టర్ 360 క్రికెటర్‌గా డివిలియర్స్ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించాడు.
చదవండి: ICC T20 WC 2024: టి20 ప్రపంచకప్ 2024కు పపువా న్యూ గినియా అర్హత
Kuldeep Yadav: సంచలన స్పెల్! కానీ నీకే ఎందుకిలా? కుల్దీప్ యాదవ్ కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment