పుణేకు షాక్; పీటర్సన్ ఇంటికి | Kevin Pietersen out of Indian Premier League with calf tear | Sakshi
Sakshi News home page

పుణేకు షాక్; పీటర్సన్ ఇంటికి

Published Sun, Apr 24 2016 9:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

పుణేకు షాక్; పీటర్సన్ ఇంటికి

పుణేకు షాక్; పీటర్సన్ ఇంటికి

పుణే: ఎంఎస్ ధోని నేతృత్వంలోని పుణే సూపర్ జెయింట్స్ కు షాక్ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్ మాజీ స్టార్ బ్యాట్సమన్ కెవిన్ పీటర్సన్ జట్టుకు దూరమయ్యాడు. కాలిపిక్క గాయంతో అతడు ఐపీఎల్ 9 నుంచి వైదొలగాల్సి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో అతడు గాయపడ్డాడు. ఒక్క బంతి ఆడాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

గాయానికి చికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్లిపోయాడు. గాయంతో ఐపీఎల్ కు దూరం కావడం పట్ల సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాళ్లను మిస్సవుతున్నానని, నవంబర్ వరకు తనకు సెలవులు దొరికాయని వ్యాఖ్యానించాడు. పీటర్సన్ త్వరగా కోలుకోవాలని పుణే సూపర్ జెయింట్స్ ట్వీట్ చేసింది. దీనికి అతడు థ్యాంక్స్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement