► ముంబై, పుణేల సొంత వేదిక
► మే 8, 10, 13, 15, 17, 21 తేదీల్లో మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: ఐపీఎల్-9 సీజన్‌లో అనూహ్యంగా ఆరు మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం విశాఖపట్నం దక్కించుకుంది. నీటి ఎద్దడి కారణంగా మే 2 తర్వాతి నుంచి మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో రాష్ట్రానికి తరలించాల్సి రావడంతో ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లకు సంయుక్తంగా ‘సొంత వేదిక’గా విశాఖ ఉంటుంది.
ఇరు జట్లకు చెందిన చెరో మూడు మ్యాచ్‌లు కలిపి మొత్తం ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఇక్కడి డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నిర్వహిస్తారు. తాజా మార్పు అనంతరం ఐపీఎల్ షెడ్యూల్‌లో కూడా కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ల వేదికను మార్చారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ బదులుగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం ఈ రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది.
వైజాగ్‌లో ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లు
Published Sat, Apr 30 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM
Advertisement