మరో కుట్రకు తెరతీసిన టీడీపీ నేతలు | TDP Leaders conspiracy on ysr park at south jail road in visakhapatnam | Sakshi
Sakshi News home page

మరో కుట్రకు తెరతీసిన టీడీపీ నేతలు

Published Fri, Jul 17 2015 1:24 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

TDP Leaders conspiracy on ysr park at south jail road in visakhapatnam

విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలో అధికార టీడీపీ నేతలు మరో కుట్రకు తెరతీశారు. సౌత్జైలు రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ పేరును తొలగించేందుకు సదరు నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైఎస్ఆర్ పార్కును వుడా సెంటర్ పార్క్గా మార్చేందుకు అధికారులతో కలసి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు.

ఆ విషయం బయటకు పొక్కడంతో టీడీపీ నేతల వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు వైఎస్ అభిమానులు శుక్రవారం  ఆందోళనకు దిగారు. అందుకు నిరసనగా సౌత్ జైలు రోడ్డు వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంఛార్జ్ కోల గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement