వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల ఫలితాలు విడుదల | sport school results release | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల ఫలితాలు విడుదల

Published Fri, Sep 9 2016 7:57 PM | Last Updated on Tue, May 29 2018 6:13 PM

వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల ఫలితాలు విడుదల - Sakshi

వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల ఫలితాలు విడుదల

కడప స్పోర్ట్స్‌:

వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ఎంపికల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం కడప నగరంలోని కొత్త కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, క్రీడాపాఠశాల చైర్మన్‌ కేవీ సత్యనారాయణ, క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌ సాహెబ్‌లు ఫలితాల జాబితాను విడుదల చేశారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 20లోపు క్రీడాపాఠశాలకు హాజరై ప్రవేశాలు పొందాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అన్ని జిల్లాల డీఎస్‌డీఓలకు పంపినట్లు ప్రత్యేకాధికారి తెలిపారు. 20 మంది బాలికలు, 20 మంది బాలురును 4వ తరగతిలో ప్రవేశానికి ఎంపికచేసినట్లు తెలిపారు.
ఎంపికైన బాలికలు :
 ఎం. హిమబిందు (కడప), కె. రాజ్యలక్ష్మి (కడప), టి.శ్రీవిద్య (కడప), కె. వెన్నెల (కడప), బి. జయలక్ష్మి (కడప), కె. దీపిక (కడప), ఎస్‌. సరస్వతి (కడప), ఎన్‌. శివనందిని (కడప), కె. లావణ్య (ప్రకాశం), ఆర్‌. నాగవేణి (ప్రకాశం), పి. రామలక్ష్మి (విశాఖపట్టణం), కంచిపాటి దేవి (విశాఖపట్టణం), పి. హిమవర్షిణి (విశాఖపట్టణం), టి.సాయిలత (శైలజ) (విశాఖపట్టణం), పి.రమ్య (విశాఖపట్టణం), ఎస్‌. రేష్మ (విశాఖపట్టణం), రంగోలి గాయత్రి (విజయనగరం), వి. శాంతి (విజయనగరం), గండి తనూజ (విజయనగరం), సీహెచ్‌ పూజిత (ప్రకాశం).
ఎంపికైన బాలురు :
 సి.శేషాద్రి (చిత్తూరు), జి.గౌతమ్‌కిశోర్‌ (కడప), నాగిరెడ్డి పృధ్వీనాథ్‌రెడ్డి (కడప), సి.మౌలీంద్రనాథ్‌రెడ్డి (కడప), డి. కిశోర్‌కుమార్‌రెడ్డి (కడప), ఎ.పృధ్వీ (కడప), డి. భానుతేజ (కడప), డి. నాగచైతన్య (కడప), బి.జనార్ధన్‌ (కడప), మాడా శ్రీనివాస్‌ (కడప), పి. అభిషేక్‌నాయక్‌ (కర్నూలు), కరపాటి చైతన్య (నెల్లూరు), కె.చైతన్యారెడ్డి (ప్రకాశం), వై.మధుకిశోర్‌ (ప్రకాశం), కె.వి.మాధవరావు (ప్రకాశం), ఎస్‌వీఎస్‌ సంతోష్‌ (ప్రకాశం), పి. రామునాయుడు (విశాఖపట్టణం), వై. గంగునాయుడు (విశాఖపట్టణం), గండిచందు (విజయనగరం), సీహెచ్‌ రాజేష్‌ (విజయనగరం).
ఎంపికైన అభ్యర్థులు తీసుకురావాల్సిన జాబితా..
ఎంపికైన అభ్యర్థులు బర్త్‌ సర్టిఫికెట్‌ (మీసేవ/మున్సిపాలిటీ ద్వారా పొందినది), టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డ్‌ జిరాక్స్, 20 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రూ.1000 (కాసిన్‌ డిపాజిట్టు), మెడికల్‌ సర్టిఫికెట్‌ (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌), పర్సనల్‌ స్పోర్ట్స్‌ కిట్, డిక్లరేషన్‌ బాండ్‌పేపర్లు (రూ.10 విలువచేసే రెండు స్టాంపుపేపర్లు), ఆదాయ ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement