రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియ షురూ | state level selections start in sport school | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియ షురూ

Published Wed, Aug 3 2016 7:47 PM | Last Updated on Tue, May 29 2018 6:13 PM

రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియ షురూ - Sakshi

రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియ షురూ

కడప స్పోర్ట్స్‌:
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే క్రీడా ఎంపికల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల నుంచి 103 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 127 మంది అభ్యర్థులకు గాను బుధవారం 103 మంది విద్యార్థులు హాజరై పేర్లను నమోదు చేసుకున్నారు. క్రీడాపాఠశాల సిబ్బంది హాజరైన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు రెసిడెన్షియల్‌ విధానంలో మూడురోజుల పాటు అసెస్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు.
అసెస్‌మెంట్‌ శిక్షణలో ఏమి నేర్పనున్నారంటే...
గతానికి భిన్నంగా ఈ ఏడాది మూడురోజుల పాటు కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చిన తర్వాత రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించేందుకు శాప్‌ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాస్థాయిలో ఎంపికై రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు 7 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడాకారుల ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ను ఫిజియోథెరపిస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
– స్పోర్ట్స్‌ విజన్‌లో భాగంగా రూ.30 లక్షలతో దేశంలోనే తొలిసారిగా స్పోర్ట్స్‌ విజన్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధం ఏశారు. ఈ పరికరం ద్వారా క్రీడాకారుల రియాక్షన్‌ టైం, హ్యాండ్‌–ఐ కో–ఆర్డినేటర్, ఏకాగ్రత తదితర అంశాలను పరీక్షించనున్నారు.  
–  ఫిట్‌నెస్‌ టెస్ట్‌ల్లో భాగంగా 6 X 10 షటిల్‌ రన్, 30 మీటర్స్‌ స్పింట్, ‘టీ’ (ఇంగ్లీషు లెటర్‌ టీ) షేప్‌ మూమెంట్‌ స్కిల్స్, సర్కూట్‌ టెస్ట్‌ ఫార్‌ ఫండమెంటల్‌ మూమెంట్‌ స్కిల్స్‌ పరిశీలిస్తారు. అదే విధంగా ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌లో భాగంగా సిట్‌ అండ్‌ రీచ్, షోల్డర్‌ ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్‌ విభాగాల్లో క్రీడాకారుల సహజ ప్రతిభను పరీక్షిస్తారు. పైన తెలిపిన అంశాల్లో మూడురోజుల పాటు శిక్షణ ఇచ్చి ఈనెల 6న రాష్ట్రస్థాయి ఎంపికలు చేపట్టనున్నారు.
పర్యవేక్షించిన కెనెడియన్‌ అకాడమీ సభ్యులు...
 ఈ అసెస్‌మెంట్‌ ట్రైనింగ్‌ను పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన కెనెడియన్‌ అకాడమీ క్రీడాప్రతినిధులు అమిత్, పంకజ్, సోథి, కపిల్, నీరజ్‌లు విచ్చేశారు. వీరు విద్యార్థులకు సంబంధించిన పలు పరీక్షలను పరిశీలించారు. విద్యార్థుల పాదాలు, మోకాలు, వెన్నెముకకు సంబంధించి శాస్త్రీయ విధానాల ద్వారా పరిశీలించారు.  ఎంపికల ప్రక్రియను క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్‌ పరిశీలించారు.  
ఎంపికల పర్యవేక్షణకు శాప్‌ బృందం...
రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియను పరిశీలించేందుకు శాప్‌ బృందం రానుంది. శాప్‌ చైర్మన్‌ పీఆర్‌ మోహన్, వీసీ ఎండీ జి. రేఖారాణితో పాటు సభ్యులు సత్తిగీత, హనుమంతరావు, షకీల్‌షఫీ, రవీంద్రబాబు, జయచంద్ర  రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement