state level selections
-
రెండో రోజూ..
కడప స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియకు సంబంధించిన అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం గురువారం కొనసాగింది. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో గురువారం రూ.30లక్షలకు పైగా విలువచేసే స్పోర్ట్స్ విజన్ టెస్ట్ మిషన్‌ను తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించారు. ఈ పరికరం ద్వారా విద్యార్థి ఫిట్నెస్తో సంబంధం లేకుండా విద్యార్థుల హ్యాండ్–ఐ కోఆర్డినేషన్, ఏకాగ్రత, రియాక్షన్ టైం తదితర అంశాలను పరిశీలించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ పరికరాన్ని వినియోగిస్తున్నట్లు కెనెడియన్ అకాడమీ సభ్యులు అమిత్, నీరజ్‌లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఫ్యాట్ టెస్ట్ నిర్వహించారు. కాగా ఈ అసెస్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని కెనెడియన్ అకాడమీ సభ్యులు సోథీ, పంకజ్, కపిల్, క్రీడాపాఠశాల కోచ్‌లు పర్యవేక్షించారు. -
రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియ షురూ
కడప స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే క్రీడా ఎంపికల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల నుంచి 103 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 127 మంది అభ్యర్థులకు గాను బుధవారం 103 మంది విద్యార్థులు హాజరై పేర్లను నమోదు చేసుకున్నారు. క్రీడాపాఠశాల సిబ్బంది హాజరైన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు రెసిడెన్షియల్ విధానంలో మూడురోజుల పాటు అసెస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అసెస్మెంట్ శిక్షణలో ఏమి నేర్పనున్నారంటే... గతానికి భిన్నంగా ఈ ఏడాది మూడురోజుల పాటు కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చిన తర్వాత రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించేందుకు శాప్ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాస్థాయిలో ఎంపికై రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు 7 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడాకారుల ఫిజికల్ అసెస్మెంట్ను ఫిజియోథెరపిస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. – స్పోర్ట్స్ విజన్‌లో భాగంగా రూ.30 లక్షలతో దేశంలోనే తొలిసారిగా స్పోర్ట్స్ విజన్ టెస్ట్ నిర్వహించేందుకు రంగం సిద్ధం ఏశారు. ఈ పరికరం ద్వారా క్రీడాకారుల రియాక్షన్ టైం, హ్యాండ్–ఐ కో–ఆర్డినేటర్, ఏకాగ్రత తదితర అంశాలను పరీక్షించనున్నారు. – ఫిట్నెస్ టెస్ట్‌ల్లో భాగంగా 6 X 10 షటిల్ రన్, 30 మీటర్స్ స్పింట్, ‘టీ’ (ఇంగ్లీషు లెటర్ టీ) షేప్ మూమెంట్ స్కిల్స్, సర్కూట్ టెస్ట్ ఫార్ ఫండమెంటల్ మూమెంట్ స్కిల్స్ పరిశీలిస్తారు. అదే విధంగా ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌లో భాగంగా సిట్ అండ్ రీచ్, షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ విభాగాల్లో క్రీడాకారుల సహజ ప్రతిభను పరీక్షిస్తారు. పైన తెలిపిన అంశాల్లో మూడురోజుల పాటు శిక్షణ ఇచ్చి ఈనెల 6న రాష్ట్రస్థాయి ఎంపికలు చేపట్టనున్నారు. పర్యవేక్షించిన కెనెడియన్ అకాడమీ సభ్యులు... ఈ అసెస్మెంట్ ట్రైనింగ్‌ను పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన కెనెడియన్ అకాడమీ క్రీడాప్రతినిధులు అమిత్, పంకజ్, సోథి, కపిల్, నీరజ్‌లు విచ్చేశారు. వీరు విద్యార్థులకు సంబంధించిన పలు పరీక్షలను పరిశీలించారు. విద్యార్థుల పాదాలు, మోకాలు, వెన్నెముకకు సంబంధించి శాస్త్రీయ విధానాల ద్వారా పరిశీలించారు. ఎంపికల ప్రక్రియను క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ పరిశీలించారు. ఎంపికల పర్యవేక్షణకు శాప్ బృందం... రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికల ప్రక్రియను పరిశీలించేందుకు శాప్ బృందం రానుంది. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, వీసీ ఎండీ జి. రేఖారాణితో పాటు సభ్యులు సత్తిగీత, హనుమంతరావు, షకీల్‌షఫీ, రవీంద్రబాబు, జయచంద్ర రానున్నారు. -
క్రీడాకారుల జాబితా విడుదల
కడప స్పోర్ట్స్: డా.వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల జాబితాను శనివారం ప్రకటించారు. జూలై 25, 26 తేదీల్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన జాబితాను ఈనెల 26న డీఎస్డీఓ ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విద్యార్థుల ప్రగతిని పరిశీలించిన వైఎస్ఆర్ క్రీడాపాఠశాల అధికారులు స్క్రూటినీ చేపట్టి జిల్లాల వారీగా ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాలను ఆయా డీఎస్‌డీఓలకు పంపారు. దీంతో శనివారం డీఎస్డీఓ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థుల జాబితాను ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారులకు ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో కోచ్‌ల పర్యవేక్షణలో అసెస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం ఆగష్టు 6 న ఎంపికలను నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ లక్ష్మినారాయణ శర్మ తెలిపారు. ఎంపికైన క్రీడాకారుల జాబితా: ఎస్. ఉమేష్‌రిషి (రైల్వేకోడూరు), సి.మౌలీంద్రనాథ్‌రెడ్డి (ప్రొద్దుటూరు), ఎం.హిమబిందు (కడప), టి.శ్రీవిద్య (బయనపల్లె, సీకేదిన్నె), కె.రాజ్యలక్ష్మి (బుగ్గలపల్లి, సీకేదిన్నె), కె. వెన్నెల (దిరసవంచ, బి.మఠం), టి. పావని (బయనపల్లె, సీకే దిన్నె), డి.కల్యాణి (ప్రొద్దుటూరు). -
వైఎస్ఆర్ క్రీడాపాఠశాల రాష్ట్రస్థాయి ఎంపికలు వాయిదా
కడప స్పోర్ట్స్ : డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడాఎంపికలను వాయిదా వేసినట్లు వైఎస్ఆర్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు. కెనెడియన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించాలని శాప్ నుంచి ఉత్తర్వులు రావడంతో ఈ ఎంపికలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి నిర్వహించాల్సిన ఈ ఎంపికలను ఆగస్టు మొదటివారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులకు అసెస్మెంట్ ట్రైనింగ్ (రెసిడెన్షియల్) ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం 6వ తేదీ రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించి ప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. క్రీడాపాఠశాల లోగోకు కాంపిటీషన్స్ డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాలకు లోగో (చిహ్నం) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి లోగోను రూపొందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తాము రూపొందించిన లోగోలను ఆగస్టు 1వ తేదీలోపు వైఎస్ఆర్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి కార్యాలయానికి చేరేలా చూడాలన్నారు. ఎంపికైన తొలి మూడు లోగోలు రూపొందించిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. -
29 నుంచి బ్యాడ్మింటన్ టోర్నీ
ఆటోనగర్ : ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి త్రిమూర్తి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అండర్–13, 15, 17, 19 విభాగాల్లో ఈ టోర్నీ నిర్వహిస్తామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి టోర్నీకి పంపిస్తామని చెప్పారు. ఒక్కో క్రీడాకారుడు మూడు విభాగాల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందన్నారు. విజయవాడలోని ఫన్‌టైమ్స్, ఆఫీసర్స్ క్లబ్లో ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఫన్‌టైమ్స్ క్లబ్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఫన్‌టైమ్స్ అధ్యక్షుడు రామినేని రామ్మోహన్, జేఎన్ శంకరగుప్తా, సాంబశివరావు, విజయ్‌బాబు పాల్గొన్నారు.