29 నుంచి బ్యాడ్మింటన్ టోర్నీ
Published Sun, Jul 24 2016 7:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
ఆటోనగర్ :
ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి త్రిమూర్తి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అండర్–13, 15, 17, 19 విభాగాల్లో ఈ టోర్నీ నిర్వహిస్తామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి టోర్నీకి పంపిస్తామని చెప్పారు. ఒక్కో క్రీడాకారుడు మూడు విభాగాల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందన్నారు. విజయవాడలోని ఫన్‌టైమ్స్, ఆఫీసర్స్ క్లబ్‌లో ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఫన్‌టైమ్స్ క్లబ్‌లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఫన్‌టైమ్స్ అధ్యక్షుడు రామినేని రామ్మోహన్, జేఎన్ శంకరగుప్తా, సాంబశివరావు, విజయ్‌బాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement