కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువతో జిల్లాలో క్రీడాభివృద్ధి శరవేగంగా కొనసాగిందని వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూలు స్పెషల్ ఆఫీసర్ ఎం.రామచంద్రారెడ్డి అన్నారు. నగరంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో నాన్ మెడలిస్ట్ ఓపెన్ డబల్స్ మెన్ టోర్నమెంటును ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూలు, వైఎస్సార్ ఇండోర్ స్టేడియం నిర్మించడంతో ప్రస్తుతం జిల్లాలో క్రీడాకారులకు క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరిగిందన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చక్కటి పనితీరుతో ముందుకు వెళుతుండడం అభినందనీయమని కొనియాడారు. త్వరలోనే జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నామని, ఈ పోటీలు విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఇన్‌చార్జి డీఎస్‌డీఓ రమేష్‌బాబు మాట్లాడుతూ రానున్న జాతీయ పోటీలకు అధికారులు తమవంతు సహకారం అందిస్తామనడం చెప్పడం సంతోషదాయకమని తెలిపారు. జిల్లా బ్యాడ్మిం టన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జిలానీబాషా మాట్లాడుతూ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయన్నారు. అతి థులు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, అధ్యక్షుడు మనోహర్, అసోసియేషన్ సభ్యుడు మాలె శ్రీనివాసులురెడ్డి, చీఫ్ ప్యాట్రన్ బాషాఖాన్, రెడ్డి ప్రసాద్, సంజయ్ పాల్గొన్నారు.
‘వైఎస్ చలువతోనే జిల్లాలో క్రీడాభివృద్ధి’
Published Mon, Oct 14 2013 1:11 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement