retain
-
మధురలో హేమ మాలినికి ముళ్లబాట?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఎన్నికల పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన హేమ మాలినికి గట్టిపోటీ ఎదురుకానున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. నటి హేమ మాలిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఇమేజ్‌పై ఆధారపడి ముందుకు సాగుతున్నారనే మాట వినిపిస్తుంటుంది. హిందుత్వ వాదం కూడా ఆమెకు కలిసివచ్చే ఫ్యాక్టర్ అని చెబుతుంటారు. ఒకవైపు హేమమాలిని ఇండియా అలయన్స్ నుండి ఒలింపియన్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో తలపడనుండగా, మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాజీ ఐఆర్ఎస్ అధికారి సురేష్ సింగ్ ఆమెకు పోటీనిస్తున్నారు. దీంతో హేమ మాలినికి మధుర లోక్‌సభ ఎన్నికలు ముళ్ల బాటను తలపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జాట్ల ఓట్ల శాతం అధికం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర భార్య అయిన హేమ మాలిని తనకు జాట్ కమ్యూనిటీ మద్దతు ఉందని గతంలో ప్రకటించారు. బాక్సర్ విజేందర్ సింగ్ హర్యానాలోని భివానీకి చెందిన ఆటగాడు. ఇప్పుడు మధురకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు. బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన సురేష్ సింగ్ పదవీ విరమణ చేశాక మధురలోని ఒక విద్యా సంస్థకు అధిపతిగా ఉంటున్నారు. ఆయన పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు. హేమ మాలిని మధుర, బృందావన్‌లలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆమె శ్రీ కృష్ణ భక్తురాలిగా పేరొందారు. అయితే యమునా నది శుద్దీకరణ, పారిశ్రామిక అభివృద్ధి తదితర స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఆమె విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తుంటారు. కాగా 2014లో హేమమాలిని చేతిలో ఓడిపోయిన ఆర్ఎల్డీకి నేత జయంత్ చౌదరి ఇప్పుడు ఎన్డీఏతో పొత్తు కారణంగా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశలో ఓటింగ్ జరగనుంది. -
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!
Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్ దిగ్గజం గూగుల్ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్ పరిశ్రమలో లేఆఫ్‌ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్ సెర్చ్ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్‌ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్‌ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్‌కు చాలా తెలుసు" అని ఓ యూజర్ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్ హైక్ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్ సూచించారు. "The moment he told them he's going to join us, they quadrupled his offer" - Perplexity CEO @AravSrinivas on recruiting from Google (k, here's the video) pic.twitter.com/HRhrLNPrHJ — Alex Kantrowitz (@Kantrowitz) February 16, 2024 -
ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు బంపరాఫర్. భారత్‌లో దేశీయ బ్యాంకుల నుంచి అంతర్జాతీయ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థల వరకు మహిళా ఉద్యోగుల్ని ఆకర్షిస్తూ, వారిని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. భారత్‌లోని హెచ్ఎస్బీసీ సంస్థలో ఆరేళ్లకు మించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా బోనస్‌లు అందిస్తుంది. గర్భిణీ సిబ్బంది క్యాబ్ రైడ్లకు అయ్యే ఖర్చును మోర్గాన్ స్టాన్లీ భరిస్తుంది. సిటీ గ్రూప్ సంస్థ కొత్తగా తల్లైన మహిళ ఉద్యోగుల మెటర్నిటీ లీవులు పూర్తయితే మరో ఏడాది పాటు ఇంటి వద్ద నుంచి పనిచేసేలా వెసలు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక నియామకం వరల్డ్ బ్యాంక్ జెండర్ డేటా పోర్టల్ ప్రకారం, భారత్ ఇప్పటికే పూర్తి వేతనంతో మహిళ ఉద్యోగులకు కనీసం 26 వారాల ప్రసూతి సెలవును తప్పనిసరి చేసింది. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే సదరు బ్యాంకులు మహిళలకు డేకేర్ (0-5 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల సంరక్షణ చూసుకునే బాధ్యత) సౌకర్యాల్ని కల్పించేలా చట్టాల్ని తెచ్చింది.రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ప్రతిభావంతులైన మహిళల్ని ఎంపిక చేసుకోవడం, ఇప్పటికే బ్యాంకుల్లో పనిచేస్తున్న వారి నిర్ధిష్ట అవసరాల్ని హెచ్ఎస్బీసీ తీరుస్తుంది. దీంతో పాటు మహిళా ఉద్యోగుల 0 నుంచి 6 వయస్సున్న పిల్లల సంరక్షణ కోసం నెలావారీ 216 డాలర్లను అందిస్తుంది. మెటర్నిటీ లీవులు పూర్తయితే మోర్గాన్ స్టాన్లీ ముంబై, బెంగుళూరులలో గర్భిణీ ఉద్యోగులు డెలివరీ ముందు చివరి మూడునెలల్లో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆ కారణంతో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఇండియా హెచ్ఆర్ హెడ్ రజత్ మాథుర్ అన్నారు. కాబట్టే మెటర్నిటీ లీవులు పూర్తయిన మహిళా ఉద్యోగులు తిరిగి సంస్థల్లో పనిచేసేలా కోచింగ్‌తో పాటు శిక్షణ ఇస్తుంది. తండ్రులకు కనీసం 16 వారాల వరకు సెలవులను అందిస్తుంది. భారతీయ చట్టం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ సెలవుల్ని అందిస్తుంది. అయితే ప్రైవేట్ రంగానికి కనీస నిబంధనలు లేవు. అమెరికాలో అంతంతమాతమ్రే ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో మాత్రం నిబంధనలు అందుకు విరుద్దంగా ఉన్నాయి. మహిళ ఉద్యోగులు సెలవుల్లో ఉంటే వారికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలనే చట్టపరమైన నిబంధనలు లేవు. కాబట్టే జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్లు తల్లదండ్రులిద్దరికి 16 వారాల సెలవును అందిస్తుంది. గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ తల్లిదండ్రులకు 20 వారాల మెటర్నిటీ లీవ్‌ల్ని అందిస్తుంది. -
IPL 2022 Auction: ఆర్సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్
Virat Kohli, Glenn Maxwell Likely To Retain By RCB Ahead IPL 2022 Auction.. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ప్రస్తుతం ఆయా జట్లలో రిటైన్ల పర్వం కొనసాగుతుంది. వచ్చే సీజన్ కోసం జరగనున్న ఆటగాళ్ల వేలానికి ముందు ఆయా జట్లు తమ జాబితాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది.నవంబర్ 30వ తేదీలోగా 8 ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను నిలుపుకోవాలనుకుంటున్నాయనే వివరాలను వెల్లడించాలి. ఇప్పటికే ప్రధానంగా ముంబై ఇండియన్స్, సీఎస్కే లాంటి జట్లు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నామనే దానిపై సమాచారం ఇచ్చింది. చదవండి: IPl 2022 Auction: శిఖర్ ధావన్‌కు బిగ్ షాక్.. ఇక ఆ జట్టులో నో ఛాన్స్! తాజాగా ఆర్సీబీ కూడా రిటైన్ ఆటగాళ్ల లిస్టును విడుదల చేసింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లితో పాటు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు ఆర్సీబీలోనే ఉండనున్నారు. గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను రిటేన్ చేసుకోవడానికి ప్రతీ జట్టుకు అవకాశం ఉంటుంది. తమ వద్దే నిలుపుకున్న వారిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉండవచ్చు. రిటెన్షన్ విధానం ముగిసిన తర్వాత.. ఆటగాళ్ల వేలానికి ముందు.. కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్‌లు.. ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఇద్దరు స్వదేశీ ప్లేయర్లు.. ఒక విదేశీ ప్లేయర్ ఉంటారు. చదవండి: IPL 2022 Auction- KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..! -
లిన్, ఉనాద్కట్, మిల్లర్లకు గుడ్‌బై
ముంబై: ఐపీఎల్–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. డిసెంబర్ 19న కోల్‌కతాలో వేలం జరగనుండగా ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది. మొత్తం 71 మంది ఆటగాళ్లను జట్లు విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికిన క్రిస్ లిన్ (రూ. 9.6 కోట్లు), జైదేవ్ ఉనాద్కట్ (రూ. 8.4 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8.4 కోట్లు), ఆండ్రూ టై (రూ. 7.2 కోట్లు), స్యామ్ కరన్ (రూ. 7.2 కోట్లు), ఉతప్ప (రూ. 6.4 కోట్లు)లను ఫ్రాంచైజీలు వద్దనుకోవడం విశేషం. ఫ్రాంచైజీలు విడుదల చేసిన కొందరు గుర్తింపు ఉన్న ఆటగాళ్లను చూస్తే... చెన్నై: స్యామ్ బిల్లింగ్స్, మోహిత్ శర్మ. ఢిల్లీ: మోరిస్, మున్రో, ఇంగ్రామ్, విహారి. పంజాబ్: మిల్లర్, టై, స్యామ్ కరన్, వరుణ్ చక్రవర్తి. కోల్‌కతా: లిన్, ఉతప్ప, చావ్లా, బ్రాత్‌వైట్. ముంబై: యువరాజ్, అల్జారి జోసెఫ్, ఎవిన్ లూయిస్. రాజస్తాన్: ఉనాద్కట్, బిన్నీ. బెంగళూరు: గ్రాండ్‌హోమ్, స్టెయిన్, స్టొయినిస్, కూల్టర్ నీల్, హెట్‌మైర్, సౌతీ. హైదరాబాద్: యూసుఫ్ పఠాన్, గప్టిల్, షకీబ్, రికీ భుయ్, దీపక్ హుడా. -
మనిషి మరణించినా.. ఫేస్బుక్లో సజీవంగా
న్యూయార్క్: మనిషి మరణాంతరం కూడా అతని జ్ఞాపకాలను సజీవంగా చూసుకోవచ్చు. సోషియల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎవరైనా బతికున్నప్పుడు ఫేస్బుక్లో ఉన్న వారి ప్రొఫైల్‌ను మరణించాక కూడా అదే సెట్టింగ్స్‌తో ఉంచాలని నిర్ణయించారు. ఇంతకుముందు ఫేస్బుక్ ఖాతాదారుల మరణాంతరం వారి స్నేహితులకు (ఫేస్బుక్) మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇకనుంచి ఎవరైనా కూడా చనిపోయిన వారి ప్రొఫైల్స్‌ను చూసే అవకాశం కల్పించినట్టు ఫేస్బుక్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరిక మేరకు ఈ మార్పులు చేసినట్టు వివరించారు. కుటుంబ సభ్యులు తమ వారి వీడియోలను కూడా ఇందులో పొందుపరచుకోవచ్చు. -
యాషెస్ సిరీస్ మూడో టెస్టు డ్రా
వరుసగా రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యం... ఇంటా బయటా విమర్శలు... ఇక యాషెస్ కోసం ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి... ఈ నేపథ్యంలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు జూలు విదిల్చింది. విజయం కోసం పోరాడింది. కానీ క్లార్క్సేనకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మిగిలిన రెండు టెస్టుల్లో ఆసీస్ గెలిచి సిరీస్ సమం చేసినా... టైటిల్ దక్కే అవకాశం లేదు. మాంచెస్టర్: వరుసగా రెండు పరాజయాల అనంతరం ఎలాగైనా యాషెస్ మూడో టెస్టును గెలవాలని ప్రయత్నించిన ఆస్ట్రేలియా జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ టెస్టు చివరి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో పూర్తి ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంతో ఉండగా మిగిలిన రెండు టెస్టులు కోల్పోయినా డి ఫెండింగ్ చాంపియన్ హోదాలో యాషెస్‌ను తమ దగ్గరే ఉంచుకున్నట్టవుతుంది. అంతకుముందు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు ఆసీస్ 332 పరుగుల లక్ష్యాన్ని విధించింది.సోమవారం చివరి రోజు ఆట వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్... ఆట నిరవధికంగా ఆగే సమయానికి 20.3 ఓవర్లలో మూడు వికెట్లకు 37 పరుగులు చేసింది. ప్రారంభం నుంచే ఇంగ్లండ్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. మూడో ఓవర్లోనే కుక్‌ను హారిస్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో ట్రాట్ (11), పీటర్సన్ (8) అవుట్ అయ్యారు. లంచ్ విరామానంతరం మూడు బంతులు పడిన తర్వాత భారీ వర్షం కురిసింది. ఏమాత్రం తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో ఇక ఆసీస్ ఆశలు వదులుకుంది. అటు అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల అనంతరం ఇంగ్లండ్ యాషెస్‌ను నిలబెట్టుకోవడం 1928-29 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మైకేల్ క్లార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 9 నుంచి జరుగుతుంది.