మనిషి మరణించినా.. ఫేస్బుక్లో సజీవంగా | Now dead will come alive on Facebook | Sakshi
Sakshi News home page

మనిషి మరణించినా.. ఫేస్బుక్లో సజీవంగా

Published Sun, Feb 23 2014 3:04 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

మనిషి మరణించినా.. ఫేస్బుక్లో సజీవంగా - Sakshi

మనిషి మరణించినా.. ఫేస్బుక్లో సజీవంగా

న్యూయార్క్: మనిషి మరణాంతరం కూడా అతని జ్ఞాపకాలను సజీవంగా చూసుకోవచ్చు. సోషియల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎవరైనా బతికున్నప్పుడు ఫేస్బుక్లో ఉన్న వారి ప్రొఫైల్ను మరణించాక కూడా అదే సెట్టింగ్స్తో ఉంచాలని నిర్ణయించారు. ఇంతకుముందు ఫేస్బుక్ ఖాతాదారుల మరణాంతరం వారి స్నేహితులకు (ఫేస్బుక్) మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇకనుంచి ఎవరైనా కూడా చనిపోయిన వారి ప్రొఫైల్స్ను చూసే అవకాశం కల్పించినట్టు ఫేస్బుక్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరిక మేరకు ఈ మార్పులు చేసినట్టు వివరించారు. కుటుంబ సభ్యులు తమ వారి వీడియోలను కూడా ఇందులో పొందుపరచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement