![ఫేస్‌బుక్‌లో ‘సెటైర్’ ట్యాగ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71408307906_625x300.jpg.webp?itok=DP_h0RRj)
ఫేస్‌బుక్‌లో ‘సెటైర్’ ట్యాగ్
న్యూయార్క్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో ఇకపై ‘ద ఆనియన్’ వెబ్‌సైట్‌కు చెందిన వ్యంగ్య వార్తలు, వ్యాసాలకు కొత్తగా ‘సెటైర్’ ట్యాగ్ జతకానుంది. స్నేహితులు పోస్టు చేసిన ఆనియన్ ఆర్టికల్ లింకుపై క్లిక్ చేసినా లేదా ఆనియన్ ఆర్టికల్‌ను స్వయంగా పోస్టు చేసినా.. ఫేస్‌బుక్ పేజీలో ఇకపై ఆ ఆర్టికల్ శీర్షికకు ముందు బ్రాకెట్లో సెటైర్ అనే పదం ఆటోమేటిక్‌గా చేరిపోతుంది. ఆనియన్ వ్యంగ్య వార్తలు, వ్యాసాలకు ప్రత్యేక ట్యాగింగ్‌ను జోడించాలంటూ ఫేస్‌బుక్ యూజర్ల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చినందున, వారికి మరింత సరదాను అందించేందుకు ఫేస్‌బుక్ ఈ ట్యాగ్‌ను ప్రవేశపెట్టినట్లు ‘ఆర్స్ టెక్నికా’ వెబ్‌సైట్ పేర్కొంది.