రూ. 2 లక్షల కోట్లకు చేరువలో ఫేస్‌బుక్ జకర్‌బర్గ్ సంపద
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్ రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించడం ఆ కంపెనీ సీఈవో మార్క్ జకర్‌బర్గ్‌కి మరింతగా లాభించింది. కంపెనీ షేర్లు గురువారం కొత్త గరిష్టస్థాయికి ఎగియడంతో జకర్‌బర్గ్ సంపద విలువ కూడా మరో 160 కోట్ల డాలర్లు పెరిగి 3,330 కోట్ల డాలర్లకు(రూ.1,98,000 కోట్లు) చేరింది. దీంతో సంపదలో గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్.. అమెజాన్‌డాట్‌కామ్ సీఈవో జెఫ్ బెజోస్‌ని కూడా జకర్‌బర్గ్ అధిగమించినట్లయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో ఆయన 16వ స్థానంలో నిల్చారు. జకర్‌బర్గ్ వయసు 30 ఏళ్లే. గూగుల్ వ్యవస్థాపకులు వరుసగా 17,18 స్థానాల్లో ఉండగా.. బెజోస్ 20వ ర్యాంకులో ఉన్నారు. 8,470 కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో ఉన్నారు.