financial results
-
ఐఐపీ, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ముంబై: కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, బాండ్లపై రాబడులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ బ్యాంకులు సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లడంతో గత వారంలో సూచీలు అరశాతం నష్టపోయాయి. ఫైనాన్సియల్, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 490 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘ అమెరికాతో పాటు బ్రిటన్, భారత్ దేశాల ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించవచ్చు. యూఎస్ పదేళ్ల బాండ్లపై రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 21,800 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే దిగువున 21,690 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,500 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు ఉంది. రికవరీ జరిగి అప్‌ట్రెండ్ మూమెంటమ్ కొనసాగితే ఎగువున 21,800 వద్ద నిరోధం చేధించాల్సి ఉంటుంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ దే తెలిపారు. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్‌తో పాటు బ్రిటన్ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. చివరి దశకు క్యూ3 ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ఘట్టం చివరి దశకు చేరింది. మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఐషర్ మోటార్స్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, మజగాన్ డాక్ షిప్‌యార్డ్స్, ఫోనిక్స్ మిల్స్‌తో సహా సుమారు 1000కి పైగా కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనుపమ్ రసాయన్, కోల్ ఇండియా, సెయిల్, సంర్ధన్ మదర్సన్, హిందాల్కో, ఐఆర్సీటీసీ, భెల్, గ్లాండ్ ఫార్మా, ముత్తూట్ ఫైన్సాన్లూ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. 4 లిస్టింగులు, 2 పబ్లిక్ ఇష్యూలు ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ షేర్లు నేడు(ఫిబ్రవరి 12న) లిస్టింగ్ కానున్నాయి. ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ (మంగళవారం) ముగిస్తుంది. రాశి పెరిఫెరల్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు (ఫిబ్రవరి 14న) బుధవారం లిస్టింగ్ కానున్నాయి. వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ గురువారం ముగియనుంది. డెట్ మార్కెట్లో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫిబ్రవరిలో ఇప్పటి వరకు (ఫిబ్రవరి 09 నాటికి) దేశీయ డెట్ మార్కెట్లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం పాటు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు జనవరిలో రూ.19వేల కోట్లుగా ఉన్నాయి. ఇక ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం నెల(జనవరి)లో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా ఈ ఫిబ్రవరి 09 నాటికి రూ.3,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు, భారతీయ ఈక్విటీ మార్కెట్ వాల్యూయేషన్లు పెరగడంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో భిన్న ట్రెండ్ దారితీసింది’’ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్‌వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవిత గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో.., ఈ వారం కొంత స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లను వచ్చే సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. దేశీయంగా కీలక కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి వాటిపై మళ్లనుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం(జూన్ 20న) ప్రారంభం కానున్నాయి. రుతు పవనాల పురోగతి వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ‘‘గరిష్ట స్థాయిల్లో స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వహిస్తూ కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి 19650 వద్ద నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 19770 వద్ద మరో కీలక నిరోధం ఎదురుకానుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువ స్థాయిలో 19300 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. కంపెనీల తొలి క్వార్టర్ ఫలితాలపై ఆశాశహ అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, టోకు ధరలు దిగిరావడం, మార్కెట్లో అస్థిరత తగ్గడం తదితర సానుకూలాంశాలతో వరుసగా మూడోవారమూ సూచీలు లాభాలను ఆర్జించగలిగాయి. ఐటీ, మెటల్, రియల్టీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 781 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అలాగే వారాంతాన సెన్సెక్స్ 66,160 వద్ద, నిఫ్టీ 19,595 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరుపై దృష్టి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి త్రైమాసిక ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అలాగే విలీన ప్రక్రియ పూర్తైన తర్వాత అర్హులైన హెచ్డీఎఫ్సీ వాటాదారులకు 311 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లు ఇప్పటికే వారు కలిగి ఉన్న షేర్లకు ప్రతి 25 షేర్లకు బదులుగా 42 హెచ్డీఎఫ్సీ షేర్లు అందనున్నాయి. కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. తాజాగా లిస్ట్ అవుతున్న షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఈక్విటీ షేర్లతో సమానంగా ఉంటాయని వెల్లడైంది. క్యూ1 ఆర్థిక ఫలితాలపై కన్ను కీలక కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారంలో ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ఆస్కారం ఉంది. ఇండెక్సుల్లోని హెచ్డీఎఫ్ఎసీ బ్యాంక్, ఎల్టీఐమైండ్టీ కంపెనీల క్యూ1 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ బుధవారం.., ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్ గురువారం.., హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఆ్రల్టాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు శుక్రవారం తమ జూన్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్, ఎల్అండ్టీ టెక్నాలజీ, టాటా కమ్యూనికేషన్స్, యూనిటెడ్ స్పిరిట్, కెన్‌ఫిన్ హోమ్స్, ఎంఫసిస్, టాటా ఎలాక్సీ, క్రిసిల్ కంపెనీలూ ఫలితాలను విడుదల చేసే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు చైనా కేంద్ర బ్యాంకు సోమవారం కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనుంది. అలాగే ఆ దేశ రెండో క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి కానుంది. అమెరికా జూన్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం విడుదల అవుతాయి. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా బుధవారం, మరుసటి రోజు గురువారం కరెంట్ ఖాతా గణాంకాలు.., జపాన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వెల్లడి కానున్నాయి. జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం విడుదల అవుతుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కొనసాగిన ఎఫ్ఐఐల కొనుగోళ్లు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం జూలై ప్రథమార్థంలో కొనసాగింది. ఈ నెల తొలి భాగంలో రూ.30,600 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీయ కార్పొరేట్ ఆదాయాలు, స్థూల ఆర్థిక డేటా మెరుగ్గా నమోదవడం ఇందుకు కారణమయ్యాయి. కాగా మే, జూన్ నెలల్లో వరుసగా రూ.43,838 కోట్లు, రూ.47,148 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ‘‘అంతర్జాతీయంగా డాలర్ క్షీణతతో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం జీవితకాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చైనాతో పోలిస్తే భారత ఈక్విటీల వ్యాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. కావున చైనాలో అమ్మకం, భారత్‌లో కొనుగోలు విధానం విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువకాలం కొనసాగించకపోవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలిపారు. -
సీఏ మిస్‌కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్‌కాల్‌లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్‌లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి. చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్ తెలిపింది. లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది. రుణ పరిస్థితుల్లో మెరుగు.. ‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్‌లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలకు ఇది క్రెడిట్ నెగెటివ్. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్‌ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే.. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది. -
కొత్త రికార్డుల దిశగా సాగొచ్చు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే.., ఈ వారం దేశీయ స్టాక్ సూచీలు తాజా జీవితకాల గరిష్టానికి చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ డేటా, అమెరికా మధ్యంతర ఎన్నికలు, విదేశీ పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు. చివరి దశకు చేరుకున్న కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదువడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ‘‘గతేడాది(2021) అక్టోబర్ 19న సెన్సెక్స్ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ వారాంతపు రోజున సెన్సెక్స్ జీవితకాల గరిష్టం ముగింపు(61,795) వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని(18,362) తాకింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే సూచీలు జీవితకాల గరిష్టాన్ని అందుకోవచ్చు. ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ 18,300 స్థాయిని నిలుపుకోలిగితే 18,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,000 –17,800, శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. ► ద్రవ్యోల్బణ డేటా దృష్టి అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడి తర్వాత మార్కెట్ వర్గాలు ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించాయి. డిసెంబర్ ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరికి మార్గదర్శకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 7.4%గా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ఏడుశాతంలోపే ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. . ► కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,400కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఓఎన్జీసీ, గ్రాసీం ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)తో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లిస్టయిన కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి పూర్తి అవుతుంది. వీటితో పాటు బయోకాన్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్సీటీసీ, స్పైస్‌జెట్‌లు, ఆర్తి ఇండస్ట్రీస్, అబాట్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హుడ్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జ్యోతి ల్యాబ్స్, లక్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ► ప్రపంచ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు యూరో పారిశ్రామికోత్పత్తి డేటా, బ్రిటన్ నిరుద్యోగ రేటు మంగళవారం విడుదల అవుతాయి. అదే రో జున యూరోజోన్, జపాన్ జీడీపీ అంచనాలు వెల్లడికానున్నాయి. ఎల్లుండి(బుధవారం)బ్రిటన్ అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. ఈ మరుసటి రోజు యూరో జోన్ ద్రవ్యోల్బణం, జపాన్ వా ణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ఆర్థి క స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఎఫ్ఐఐలు వైఖరి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానపరమైన ఆందోళనలు తగ్గుముఖంపట్టడంతో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారంలో రూ.6,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లు చేపడుతూ మార్కెట్‌కు అండగా నిలిచే సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ నవంబర్‌లో నికరంగా రూ.5600 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
Stock Market: కరెక్షన్ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా కరెక్షన్ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు(గురువారం) ముగింపుతో పాటు ఈ వారంలో సుమారు 700కి పైగా కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు. సూచీల గమనాన్ని ప్రపంచ పరిణామాలు నిర్ధేశిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా కేసుల నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు తదితర అంశాలూ ట్రేడింగ్ పై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 40,000 స్థాయిని అధిగమించింది. అనేక బ్యాంకులు ఈ వారంలో రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో కరెక్షన్(దిద్దుబాటు) కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పతనం కొనసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 18,050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువస్థాయిలో 18,300–18,350 శ్రేణిలో వద్ద బలమైన నిరోధం ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. వరుస నాలుగు రోజుల పతనంతో గతవారం సెన్సెక్స్ 483 పాయింట్లు నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి. క్యూ2 ఫలితాల జాబితా... సూచీలు ముందుగా గత శుక్రవారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, శనివారం వెల్లడైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలపై స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో నిఫ్టీ–50 ఇండెక్స్‌లోని షేర్లకు చెందిన 20 కంపెనీలతో సహా సుమారు 700కు పైగా కార్పొరేట్లు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ తదితర కంపెనీలున్నాయి. ఈ వారంలో రెండు ఐపీఓలు... బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్స్ ఈ వారం పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ) ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. ఫినోటెక్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 29న(శుక్రవారం) ప్రారంభమై.., నవంబర్ 2న ముగుస్తుంది. ధర శ్రేణిని కంపెనీ ఈ వారంలో ప్రకటించనుంది. ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్... గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు భిన్నంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ ఈక్విటీల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(అక్టోబర్ 24)ఎఫ్‌పీఐలు రూ. 3,825 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,331 కోట్ల షేర్లను అమ్మగా., డెట్ మార్కెట్లో రూ.1,494 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ షేర్ల పట్ల బేరిష్ వైఖరి కలిగి ఉన్నారు. బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ ఏడాది తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,406 కోట్ల ఐటీ షేర్లను విక్రయించారు. సాధ్యమైనంత తొందర్లో ట్యాపరింగ్ చర్యలను చేపట్టడంతో పాటు కీలక వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్ వ్యాఖ్యలతో విదేశీ ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. 28 నుంచి నైకా ఐపీవో షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125 సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 1న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 630 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 4,19,72,660 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. కార్యకలాపాల విస్తరణకు, కొత్త రిటైల్ స్టోర్లు.. గిడ్డంగుల ఏర్పాటు కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అలాగే కొంత రుణాన్ని తీర్చడం ద్వారా వడ్డీ వ్యయాలను తగ్గించుకుని, లాభదాయకతను మెరుగుపర్చుకోనుంది. -
కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కీలకం
ముంబై: కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ దిశా నిర్దేశం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ద్రవ్యోల్బణ లెక్కలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, డాలర్ మారకంలో రూపాయి విలువ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ కదలికలు తదితర అంశాలూ స్టాక్ సూచీల గమనాన్ని శాసించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా శుక్రవారం(15న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ‘‘నిఫ్టీకి 17450 స్థాయి వద్ద బలమైన మద్దతు లభించిన తర్వాత బౌన్స్‌బ్యాక్స్ అయ్యింది. ఈ సూచీ ఇప్పటికీ అధిక విలువతో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., సాంకేతికంగా దిద్దుబాటయ్యే సూచనలు సూచనలు కనిపించడం లేదు. ఈ వారంలో 18,000 స్థాయిని అధిగమించవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్స్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు. అధిక వెయిటేజీ దిగ్గజం రిలయన్స్‌తో పాటు ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,293 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 363 పాయింట్లు పెరిగింది. ఈ వారం స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే... కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలు... ఐటీ దిగ్గజం టీసీఎస్ గత శుక్రవారం క్యూ2 ఆర్థిక గణాంకాలను వెల్లడించి ఫలితాల సీజన్‌కు తెరతీసింది. ఆర్థిక ఫలితాల ప్రభావం సోమవారం (11న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశముంది. ఈ వారంలోనే ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్‌మార్ట్, డెల్టా కార్ప్, హెచ్ఎఫ్సీఎల్, సైయంట్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్‌తో సహా దాదాపు 50కి పైగా కంపెనీలు తమ రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు. ద్రవ్యోల్బణ లెక్కలపై దృష్టి ... కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ మంగళవారం(12న) ఆగస్ట్ నెల పారిశ్రామికోత్పత్తి, సెపె్టంబర్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను వెల్లడించనుంది. సెపె్టంబర్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) విడుదల కానుంది. సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 4.3శాతంగా, ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 11.2శాతంగా నమోదుకావచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. బాండ్ ఈల్డ్స్ భయాలు... భారత పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 18 నెలల గరిష్టస్థాయి 6.32 శాతానికి చేరుకుంది. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు మార్కెట్లో అధిక ద్రవ్యత లభ్యత ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఈల్డ్స్ మరింత పెరిగితే స్టాక్ మార్కెట్‌కు ప్రతికూలాంశంగా మారుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిస్టింగ్ నేడు.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిస్టింగ్ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. సెపె్టంబర్ 29 – అక్టోబర్ 1వ తేదిల మధ్య ఇష్యూ పూర్తి చేసుకున్న ఈ ఐపీఓ 5.25 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ధర శ్రేణిని రూ.712 గా నిర్ణయించి కంపెనీ మొత్తం రూ.2,768 కోట్లను సమీకరించింది. గ్రే మార్కెట్లో ఈ షేర్లు చాలా తక్కువ ప్రీమియం ధరతో ట్రేడ్ అవుతున్నందున ఫ్లాట్ లేదా డిస్కౌంట్లో లిస్టింగ్ ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. బుల్లిష్ వైఖరితో విదేశీ ఇన్వెస్టర్లు... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్లో ఈ అక్టోబర్‌లో ఇప్పటికి వరకు రూ.1,997 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1,530 కోట్ల షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.467 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లను కొనేందుకు ఆస్తకి చూపుతున్నారు. -
ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ సవాళ్లు విసిరినప్పటికీ భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ఎకానమీ ‘వీ’ (V) నమూనా వృద్ధి తీరును ఇది ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మూడవ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మహమ్మారి నియంత్రణ, నిర్వహణ యంత్రాంగాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. డెల్టా వేరియంట్ పెద్ద సవాళ్లని వస్తున్న వార్తలు తీవ్ర అప్రమత్తత పాటించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. పండుగల వాతావరణం కావడంతో ప్రజలు మాస్‌్కలు ధరించడం, భౌతిక దూరం పాటించడంసహా కోవిడ్–19 మార్గదర్శకాలను తు.చ.తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం చక్కటి పనితీరును పోషిస్తోంది. వర్షపాతంలో 9 శాతం లోటు ఉన్నప్పటికీ, ఖరీఫ్ సాగు సెపె్టంబర్ 3 నాటికి సాధారణ స్థాయిలో ఉంది. ► రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, ట్రాక్టర్ కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ రానున్న నెలల్లో పటిష్టం అవుతుందన్న సంకేతాలను ఇస్తోంది. ► ఇక పారిశ్రామిక రంగం కూడా స్థిరంగా పురోగమిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ విస్తృత ప్రాతిపదికన మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నాయి. ఉత్పత్తి విలువలు 2019 జూన్ స్థాయికి రికవరీ అవుతున్నాయి. జూలైలో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి రేటు 9.4 శాతం వృద్దిరేటును నమోదుచేసుకుంది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టులు మినహా అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థాయిని అధిగమించాయి. ► ద్యుత్ వినియోగం, రైల్వే రవాణా, రహదారుల టోల్ వసూళ్లు, ఈ–వే బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, విమాన ప్రయాణీకులు సంఖ్య, జీఎస్టీ వసూళ్లు ఇలా ప్రతి విభాగంలోనూ సానుకూల రికవరీ సంకేతాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన ఇండియా పీఎంఐ కాంపోజిట్ ఇండెక్స్ కూడా 55.4కు పెరగడం హర్షణీయ పరిణామం. -
అదరగొట్టిన రిలయన్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ. 13,101 కోట్లు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది రూ. 11,640 కోట్లు. తాజా మూడో త్రైమాసికంలో నికర లాభం సుమారు రూ. 11,420 కోట్లు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కంపెనీ ఆదాయంలో గణనీయ వాటా ఉండే రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారం తగ్గినప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు రాణించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఏడాది క్రితం దాకా కంపెనీ ఆదాయంలో 37 శాతంగా ఉన్న ఈ రెండు విభాగాల వాటా ప్రస్తుతం 51%కి పెరిగింది. పన్నులకు ముందస్తు లాభంలో దాదాపు 56 శాతం వాటా జియో, రిలయన్స్ రిటైల్‌దే ఉంది. సమీక్షాకాలంలో ఆర్ఐఎల్ ఆదాయం సుమారు 19% క్షీణించి రూ. 1,37,829 కోట్లకు పరిమితమైంది. చమురు, రసాయనాల వ్యాపారం (ఓ2సీ) త్రైమాసికాలవారీగా మెరుగుపడినప్పటికీ.. వార్షికంగా మాత్రం తగ్గింది. ఓ2సీ విభాగం పునర్వ్యవస్థీకరణ.. ‘ఓ2సీ (చమురు, రసాయనాలు తదితర విభాగాలు), రిటైల్ విభాగాలు కాస్త కోలుకోవడంతో పాటు డిజిటల్ సేవల విభాగం నిలకడగా వృద్ధి సాధిస్తుండటంతో మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పరిశుభ్రమైన, పర్యావరణహిత అభివృద్ధి సాధన దిశగా కొత్త ఇంధన, మెటీరియల్స్ వ్యాపారాలను విస్తరించేందుకు ఇది సరైన తరుణం. దీనికి అనుగుణంగానే ఓ2సీ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి కస్టమర్లకు మరింత చేరువలోకి తెస్తున్నాం. దేశ ఎకానమీలోని ప్రతీ రంగానికి అవసరమైన ఇంధన, మెటీరియల్స్ సొల్యూషన్స్‌ను దీని ద్వారా అందుబాటు ధరల్లో అందించవచ్చు‘ అని రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. ఓ2సీ ప్లాట్‌ఫామ్ పునర్వ్యవస్థీకరణతో ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ ఆదాయాలను ఒకే పద్దు కింద రిలయన్స్ చూపించింది. దీనితో రిఫైనింగ్ మార్జిన్లను ప్రత్యేకంగా ప్రకటించలేదు. జియో జోష్..: త్రైమాసికాలవారీగా చూస్తే.. డిజిటల్, టెలికం సేవలందించే జియో ప్లాట్‌ఫామ్స్ లాభం 15 శాతం వృద్ధితో రూ. 3,489 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 31 నాటికి జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 41 కోట్లుగా ఉంది. ప్రతీ యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 145 నుంచి రూ. 151కి పెరిగింది. రిటైల్‌కు ఫ్యాషన్ ఊతం..: ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ విభాగాలు గణనీయంగా కోలుకోవడంతో రిలయన్స్ రిటైల్ మెరుగైన పనితీరు కనపర్చింది. పన్నుకు ముందస్తు లాభం సుమారు 12 శాతం పెరిగి రూ. 3,102 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 2,736 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం రూ. 45,348 కోట్ల నుంచి దాదాపు 23 శాతం క్షీణించి రూ. 36,887 కోట్లకు పడిపోయింది. మరిన్ని విశేషాలు.. ► కరోనా మహమ్మారి, రేట్లు పడిపోవడం వంటి అంశాలు ఇంధన డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపడంతో ఓ2సీ వ్యాపారం ఆదాయం రూ. 1,19,121 కోట్ల నుంచి రూ. 83,838 కోట్లకు తగ్గింది. ► త్రైమాసికాల వారీగా చూస్తే వడ్డీ వ్యయాలు 29 శాతం తగ్గి రూ. 4,326 కోట్లకు పరిమితమయ్యాయి. ► జియోలో వాటాల విక్రయం ద్వారా రూ. 1,52,056 కోట్లు, రిటైల్‌లో వాటాల విక్రయంతో రూ. 47,265 కోట్లు రిలయన్స్ సమీకరించింది. ► స్థూల రుణ భారం డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 2,57,413 కోట్లకు తగ్గింది. 2020 మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 3,36,294 కోట్లు. ఇక చేతిలో ఉన్న నగదు రూ. 1,75,259 కోట్ల నుంచి రూ. 2,20,524 కోట్లకు పెరిగింది. కంపెనీ చేతిలో పుష్కలంగా నిధులు ఉండటంతో నికర రుణం మైనస్ రూ. 2,954 కోట్లుగా ఉంది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 2,050 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాయి. -
టీసీఎస్.. భేష్!
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కేక పెట్టించాయి. సాధారణంగా ఐటీ కంపెనీలకు డిసెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుంది. దీనికి తోడు కరోనా కల్లోలం ప్రభావం కొనసాగుతున్నా, టీసీఎస్ క్యూ3 ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించి పోయాయి. గత తొమ్మిదేళ్లలో ఇవే అత్యుత్తుమ క్యూ3 ఫలితాలని కంపెనీ పేర్కొంది. ఆధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించగలమని కంపెనీ పేర్కొంది. రూ.8,701 కోట్ల నికర లాభం.... టీసీఎస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో 7 శాతం వృద్ధితో రూ.8,701 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.8,118 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 16 శాతం వృద్ధి సాధించింది. ఇక ఆదాయం రూ.39,854 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.42,015 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన కూడా 5 శాతం వృద్ధిని సాధించింది. ఇక డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం సీక్వెన్షియల్‌గా 5 శాతం వృద్ధితో 57,020 డాలర్లకు పెరిగింది. రూ. 6 మధ్యంతర డివిడెండ్...: ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డ్ డేట్ ఈ నెల 16. వచ్చే నెల 3న చెల్లింపులు జరుగుతాయి. నిర్వహణ లాభం 6 శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.11,184 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో 26.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ3లో 26.6 శాతానికి పెరిగింది. ఉద్యోగులకు వేతనాలు పెంచినప్పటికీ, గత ఐదేళ్లలోనే అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్‌ను ఈ క్యూ3లోనే సాధించింది. నికర మార్జిన్ 20.7 శాతంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి కంపెనీ వద్ద రూ.65,000 కోట్ల నగదు నిల్వలున్నాయి. అన్ని విభాగాలూ జోరుగానే.... అన్ని విభాగాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 15,721 మందికి ఉద్యోగాలిచ్చామని, గత ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.69 లక్షలకు పెరిగిందన్నారు. ఆట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) జీవిత కాల కనిష్ట స్థాయి....7.6 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం 3.4 శాతం మంది మాత్రమే ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్లంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, రెండు నెలల పిదప వర్క్ ఫ్రమ్ హోమ్ విషయమై సమీక్ష జరుపుతారు. ఆల్‌టైమ్ హైకి టీసీఎస్... మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాలతో ఇటీవలి కాలంలో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఇంట్రాడేలో రూ.3,128 వద్ద ఆల్‌టైమ్ హైను తాకిన ఈ షేర్ చివరకు 3 శాతం లాభంతో రూ.3,120 వద్ద ముగిసింది. గత ఏడాది ఈ షేర్ 32 శాతం లాభపడింది. ఆశావహంగా కొత్త ఏడాదిలోకి సీజనల్ సమస్యలున్నా ఈ క్యూ3లో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు సాధించాం. కీలకమైన ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, గతంలో కుదుర్చుకున్న భారీ డీల్స్ సాకారం కావడం దీనికి ప్రధాన కారణాలు. కొత్త ఏడాదిలోకి ఆశావహంగా అడుగిడుతున్నాం. గతంలో కంటే మార్కెట్ స్థితి మరింతగా పటిష్టమయింది. డీల్స్, ఆర్డర్లు మరింతగా పెరగడంతో మా విశ్వాసం మరింతగా పెరిగింది. క్లౌడ్ సర్వీసెస్, అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్, కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్, ఐఓటీ, క్వాలిటీ ఇంజినీరింగ్అండ్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాట్ఫార్మ్ సర్వీసెస్ల కారణంగా మంచి వృద్ధిని సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, సీఈఓ, టీసీఎస్ -
యాక్సెంచర్ పుష్- ఐటీ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తాజాగా నవంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశావహ ఫలితాలు ప్రకటించింది. దీంతో దేశీయంగా లిస్టెడ్ దిగ్గజ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 2 శాతం ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సరికొత్త గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (కన్సాలిడేషన్ బాటలో- 47,000కు సెన్సెక్స్) యాక్సెంచర్ జోష్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తొలి త్రైమాసికంలో డాలర్ల రూపేణా 4 శాతం వృద్ధితో 11.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. ఇది అంచనాలకంటే అధికంకాగా.. నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 16.1 శాతానికి చేరాయి. ప్రయాణ వ్యయాలు తగ్గడం, పెరిగిన ఉత్పాదకత వంటి అంశాలు మార్జిన్లకు బలాన్నిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 25 శాతం వృద్ధితో 12.9 బిలియన్ డాలర్ల విలువైన తాజా డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. పూర్తి ఏడాదికి ఆదాయం 4-6 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజాగా అంచనా వేసింది. నిర్వహణ లాభం 7 శాతం పెరిగి 1.89 బిలియన్ డాలర్లను తాకింది. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు) షేర్ల జోరు యాక్సెంచర్ 4-6 శాతం వృద్ధితో ఆదాయ అంచనాలను ప్రకటించిన నేపథ్యంలో ఐటీ కౌంటర్లు జోరందుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ దాదాపు 3 శాతం ఎగసి రూ. 1,193 సమీపానికి చేరింది. ఇక టీసీఎస్ 2 శాతం బలపడి రూ. 2,894ను తాకింది. ఇవి ఇది సరికొత్త గరిష్టాలుకాగా.. హెచ్‌సీఎల్ టెక్ 2.5 శాతం లాభంతో రూ. 901 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో కోఫోర్జ్ 2.3 శాతం పుంజుకుని రూ. 2,569 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 1.6 శాతం బలపడి రూ. 3,359 వద్ద, ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,361 వద్ద కదులుతున్నాయి. విప్రొ 1.3 శాతం లాభంతో రూ. 362 వద్ద ట్రేడవుతోంది. -
ఎన్నికల ఫలితాలు, గణాంకాలు కీలకం
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా తగినంతగా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత పరిణామాలు కూడా కీలకమేనని విశ్లేషకులంటున్నారు. చివరి దశకు క్యూ2 ఫలితాలు.... మూడు దశల్లో జరిగిన బిహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న(మంగళవారం) వెలువడతాయి. ఇక గురువారం (ఈ నెల 12న) సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో మొత్తం 2,600 కంపెనీలు తమ తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ, హిందాల్కో, హిందుస్తాన్ కాపర్, ఐడీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆయిల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, గెయిల్ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు...! ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయని, ఇది మార్కెట్‌కు ప్రతికూలాంశమని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు హేమాంగ్ జని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ గెలవడం సానుకూలాంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ జోరుగా పెరిగితే ఈ వారంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఐదు రోజుల్లో రూ.8,381 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,381 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా రికవరీ అవుతాయనే అంచనాలు, డాలర్ బలహీనపడటం, కరోనా కేసులు తగ్గుతుండటం...ఈ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.6,564 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.1,817 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.22,033 కోట్లుగా ఉన్నాయి. అమెరికా ఎన్నికలు ముగిసినందున సెంటిమెంట్ మరింత స్థిరంగా ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఎమ్ఎస్సీఐ అంతర్జాతీయ సూచీల్లోని భారత షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల యాజమాన్య పరిమితుల పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. అక్టోబర్‌లో ఈక్విటీల నుంచి ఫండ్స్ భారీ ఉపసంహరణలు... వరుసగా ఐదోసారి ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేశాయి. అక్టోబర్ నెలలో రూ.14,344 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో కలిపి జూన్ నుంచి ఎంఎఫ్‌లు ఉపసంహరణ చేసిన మొత్తం రూ.37,498 కోట్లు. ఫండ్ మేనేజర్లు రెస్క్యూ స్టాక్స్‌ను విక్రయించడమే విత్‌డ్రాకు ప్రధాన కారణం. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య ఎంఎఫ్‌లు స్టాక్ మార్కెట్లో రూ.40 వేల కోట్ల పైనే పెట్టుబడులు పెట్టారని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డేటా వెల్లడించింది. అమెరికా ఎన్నికలపై ఆందోళన, మందగించిన దేశీయ ఆర్థ్ధిక వ్యవస్థ వంటి కారణాలతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నిరంతర ప్రవాహాన్ని గమనించామని ఫినాలజీ సీఈఓ ప్రంజల్ కమ్రా తెలిపారు. అయితే ఆర్థ్ధిక సంవత్సరం ముగియనుండటం, మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా మారుతుండటంతో ఇన్‌ఫ్లోలో పెరుగుదల కనబడుతోందని కమ్రా తెలిపారు. సెప్టెంబర్ త్రైరమాసికంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రూ.7,200 కోట్ల ఔట్‌ఫ్లో ఉందని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) నుంచి ఔట్‌ఫ్లో తగ్గిపోయిందని తెలిపారు. ‘ ‘ఇది అనిశ్చితి కాలంలో కనిపించే ఒక సాధారణ ప్రక్రియ. క్రాష్ తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పుడు, పెట్టుబడిదారులు బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నప్పుడు ఉపసంహరణ సహజమని’’ గ్రోవ్ కో–ఫౌండర్ అండ్ సీఓఓ హర్‡్ష జైన్ అన్నారు. వ్యక్తిగతంగా ఎంఎఫ్‌లు విత్‌డ్రా చేసిన మొత్తం నెలల వారీగా చూస్తే.. సెప్టెంబర్‌లో రూ.4,134 కోట్లు, ఆగస్టులో రూ.9,213 కోట్లు, జూలైలో రూ.9,195 కోట్లు, జూన్‌లో రూ.612 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మార్కెట్ పతనం తర్వాత ఎంఎఫ్ ఇన్వెస్టర్లు తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)లో గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఎన్ఏవీలు కోలుకున్న తర్వాత తమ పెట్టుబడుల నుంచి నిష్క్రమించడం వల్లే ఉపసంహరణ జరగిందని క్వాంటమ్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ నీలేష్ శెట్టి తెలిపారు. -
టీసీఎస్ మరో బంపర్ బైబ్యాక్
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. సుమారు రూ. 16,000 కోట్లతో 5.33 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 3,000 వెచ్చించనుంది. బుధవారం బీఎస్ఈలో షేరు ముగింపు ధర రూ. 2,737తో పోలిస్తే ఇది 9% అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టీసీఎస్ ఈ విషయం వెల్లడించింది. 2017, 2018లో కూడా టీసీఎస్ భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ చేసింది. 2018లో దాదాపు రూ. 16,000 కోట్లతో షేరు ఒక్కింటికి రూ. 2,100 రేటు చొప్పున 7.61 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. కంపెనీ వద్ద ప్రస్తుతం రూ. 58,500 కోట్ల మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ సంస్థ బైబ్యాక్ ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక, మరో ఐటీ సంస్థ విప్రో కూడా అక్టోబర్ 13న షేర్ల బైబ్యాక్‌ను పరిశీలించనున్నట్లు పేర్కొంది. మరోవైపు, క్యూ2లో టీసీఎస్ నికర లాభం రూ. 7,475 కోట్లుగా (కన్సాలిడేటెడ్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 8,042 కోట్లతో పోలిస్తే సుమారు 7% క్షీణించింది. తాజా క్యూ2లో అమెరికన్ సంస్థ ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌తో లీగల్ వివాదానికి సంబంధించి రూ. 1,218 కోట్లు కేటాయించాల్సి రావడంతో ఫలితాలపై ప్రభావం పడిందని టీసీఎస్ తెలిపింది. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 38,977 కోట్ల నుంచి 3% వృద్ధితో రూ. 40,135 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 4.7%, లాభం 6.7% పెరిగింది. షేరు ఒక్కింటికి రూ.12 చొప్పున టీసీఎస్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 15 కాగా నవంబర్ 3న చెల్లింపు జరుగుతుంది. ‘పటిష్టమైన ఆర్డర్ బుక్, మార్కెట్ షేరును పెంచుకుంటూ ఉండటం తదితర అంశాలతో కంపెనీ భవిష్యత్ అవకాశాలపై మరింత ధీమాగా ఉన్నాం‘ అని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. జీతాల పెంపు.. ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరుకి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,53,540గా ఉంది. ‘కష్టకాలంలో అసాధారణ స్థాయి లో పనిచేసిన టీసీఎస్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 1 నుంచి జీతాల పెంపును అమలు చేయబోతున్నాం‘ అని సంస్థ గ్లోబల్ హెడ్ (మానవ వనరుల విభాగం) మిలింద్ లాకడ్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం ప్రారంభించామని, సెప్టెంబర్ క్వార్టర్లో అంతర్జాతీయంగా రిక్రూట్మెంట్ పెంచామని వివరించారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఆల్‌టైమ్ కనిష్టమైన 8.9%గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర విశేషాలు... ► క్యూ2లో విభాగాల వారీగా చూస్తే బీఎఫ్ఎస్ఐ (6.2 శాతం), రిటైల్ (8.8 శాతం), లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ (6.9 శాతం), టెక్నాలజీ–సర్వీసెస్ (3.1 శాతం) తయారీ (1.4 శాతం) విభాగాలు వృద్ధి నమోదు చేశాయి. కమ్యూనికేషన్స్ మీడియా విభాగం 2.4 శాతం క్షీణించింది. ► సీక్వెన్షియల్‌గా ఉత్తర అమెరికా మార్కెట్ 3.6 శాతం, బ్రిటన్ 3.8 శాతం, యూరప్ 6.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన దేశాల్లో భారత మార్కెట్ 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ► సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదిరాయి. తాజాగా డీల్స్ కుదుర్చుకున్న సంస్థల్లో టీపీజీ టెలికం, టయోటా మోటార్స్ నార్త్ అమెరికా మొదలైనవి ఉన్నాయి. ► చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ 2021 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. మే 1 నుంచి ఆయన స్థానంలో సమీర్ సక్సారియా బాధ్యతలు చేపడతారు. 1999లో టీసీఎస్‌లో చేరిన సక్సారియా ప్రస్తుతం ఫైనాన్స్ విభాగం వైస్–ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ► బీఎస్ఈలో టీసీఎస్ షేరు బుధవారం 0.78 శాతం పెరిగి రూ. 2,737 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
టీసీఎస్ ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు కీలకం
ఐటీ కంపెనీ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నది. దీంతో పాటు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు విచారణ... తదనంతర పరిణామాలు, కరోనా కేసులు, వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకడం... ఆయన ఆరోగ్య స్థితిగతులు కూడా ఈ వారం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి. ఈ నెల 7న టీసీఎస్ ఫలితాలు.... మారటోరియం రుణాలపై, వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో నేడు(సోమవారం) విచారణ జరగనున్నది. ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు బ్యాంక్ రంగ షేర్లపై ప్రభావం చూపనున్నది. సోమవారం నాడే∙సేవల రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 7 (బుధవారం) టీసీఎస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది. గత వారం సెన్సెక్స్, నిఫ్టీలు బాగా పెరిగినందున ఈ వారం లాభాల స్వీకరణకు అవకాశముందని కొందరు నిపుణులంటున్నారు. మూడు నెలల తర్వాత ‘విదేశీ’ అమ్మకాలు.... విదేశీ ఇన్వెస్టర్ల మూడు నెలల కొనుగోళ్లకు సెప్టెంబర్‌లో బ్రేక్‌పడింది. కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం దీనికి కారణం. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.7,783 కోట్ల నికర అమ్మకాలు జరపగా, డెట్ సెగ్మెంట్లో రూ. 4,364 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.3,419 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, భారత మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని నిపుణులంటున్నారు. మెరుగుపడుతున్న వ్యాపార సెంటిమెంట్ సీఈవోలతో సీఐఐ సర్వే క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తూ.. వ్యాపార సంస్థల్లో సెంటిమెంట్ మెరుగుపడుతోంది. కంపెనీల పనితీరు కూడా క్రమేపీ మెరుగుపడగలదని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెటల్స్, మైనింగ్, తయారీ, ఆటో, ఫార్మా, ఇంధనం, ఇన్ఫ్రా, నిర్మాణ తదితర రంగ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సామర్థ్యాల వినియోగం 50 శాతానికి పైగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల కట్టడిలో లాక్డౌన్ల ప్రయోజనాలు తక్కువగా ఉంటాయని సర్వే అభిప్రాయపడింది. ఎకానమీని పూర్తిగా తెరిస్తేనే డిమాండ్ మెరుగుపడుతుందని, తద్వారా ఉత్పత్తికి ఊతం లభిస్తుందని పేర్కొంది. -
ధనాధన్ రిలయన్స్
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అదరగొట్టే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2020–21, క్యూ1)లో రూ. 13,248 కోట్ల రికార్డు స్థాయి కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభా న్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.10,141 కోట్లతో పోలిస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా జియో లాభాల మోత మోగించడం ఆర్ఐఎల్ మెరుగైన ఫలితాలకు దోహదం చేసింది. ఇంధన రిటైలింగ్ వెంచర్లో 49 శాతం వాటాను బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు విక్రయించడం ద్వారా క్యూ1లో రూ.4,966 కోట్ల అసాధారణ వన్‌టైమ్ రాబడి లభించిందని రిలయన్స్ వెల్లడించింది. ఇది కూడా రికార్డు లాభాలకు కారణమైంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా మందగించిన తరుణంలో క్యూ1లో కంపెనీ ఫలితాలపై ప్రభావం ఉండొచ్చన్న విశ్లేషకుల అంచనాలను మించి కంపెనీ మెరుగైన పనితీరును కనబరచడం గమనార్హం. కాగా, 2019–20 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రూ.11,640 కోట్ల నికర లాభం ఇప్పటిదాకా కంపెనీ అత్యధిక త్రైమాసిక లాభంగా రికార్డుల్లో నిలిచింది. దీన్ని ఇప్పుడు అధిగమించింది. కాగా, భారతీయ కంపెనీల్లో అత్యధిక త్రైమాసికం లాభం ఆర్జించిన రికార్డు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)దే. 2012–13 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో ఈ సంస్థ రూ.14,513 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. చమురు, పెట్రోకెమికల్ వ్యాపారాలపై ప్రభావం... క్యూ1లో కంపెనీ స్థూల లాభం(ఎబిటా) 11.8 శాతం క్షీణించి రూ.21,585 కోట్లకు తగ్గింది. పెట్రోలియం ఇంధనం, పాలిస్టర్ ఉత్పత్తుల డిమాండ్ తీవ్రంగా పడిపోవడంతో చమురు, పెట్రోకెమికల్ వ్యాపారాలు దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఎగుమతులు క్షీణించడం కూడా లాభదాయకతపై ప్రభావం చూపిందని తెలిపింది. ‘కరోనా వైరస్ కల్లోలంతో స్టోర్స్ మూసివేత, దేశవ్యాప్తంగా కార్యకలాపాలపై నియంత్రణల వల్ల రిటైల్ వ్యాపార ఎబిటా దిగజారింది. అయితే, డిజిటల్ సర్వీసుల వ్యాపారంలో మార్జిన్లు మెరుగుపడటం వల్ల ప్రతికూలతలను తట్టుకోగలిగాం’ అని కంపెనీ వెల్లడించింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► పెట్రోకెమికల్స్ వ్యాపార ఆదాయం క్యూ1లో 33 శాతం పడిపోయి రూ.25,192 కోట్లకు దిగజారింది. ► చమురు రిఫైనింగ్ ఆదాయం 54.1 శాతం తగ్గుదలతో రూ.46,642 కోట్లకు క్షీణించింది. ► క్యూ1లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్–జీఆర్ఎం) 6.3 డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 8.1 డాలర్లు కాగా, క్రితం క్వార్టర్(2019–20, క్యూ4)లో 8.9 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. ► చమురు–గ్యాస్ వ్యాపారం 45.2 శాతం క్షీణతతో రూ.506 కోట్లకు పరిమితమైంది. ► లాక్‌డౌన్‌తో 50 శాతం స్టోర్స్ పూర్తిగా మూసేయడం, 29% స్టోర్స్ పరిమిత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ రిలయన్స్ రిటైల్ వ్యాపారం మెరుగైన స్థాయిలో రూ. 31,633 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. రూ.1,083 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. ఆర్ఐఎల్ షేరు గురువారం బీఎస్ఈలో 0.61 శాతం లాభంతో రూ.2,109 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసిన తరవత కంపెనీ ఫలితాలను ప్రకటించింది. నిధుల సునామీ... జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 33 శాతం వాటాను ఫేస్బుక్, గూగుల్ ఇతరత్రా పలు ప్రపంచస్థాయి కంపెనీలకు విక్రయించడం ద్వారా రిలయన్స్ రూ.1,52,056 కోట్ల నిధులను సమీకరించింది. అదేవిధంగా రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు లభించాయి. ఇంధన రిటైలింగ్ వ్యాపారంలో 49 శాతం వాటాను బీపీకి అమ్మడం ద్వారా రూ.7,629 కోట్లను దక్కించుకుంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించింది. దుమ్మురేపిన జియో... ఆర్ఐఎల్ టెలికం అనుబంధ సంస్థ జియో లాభాల మోత మోగించింది. క్యూ1లో కంపెనీ నికర లాభం రూ.2,520 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.891 కోట్లతో పోలిస్తే 183 శాతం వృద్ధి నమోదైంది. ఇక జియో ఆదాయం కూడా 33.7 శాతం ఎగబాకి రూ.16,557 కోట్లకు చేరింది. నెలకు ఒక్కో యూజర్ నుంచి ఆదాయం(యావరేజ్ రెవెన్యూపర్ యూజర్–ఏఆర్పీయూ) క్యూ1లో రూ.140.3గా నమోదైంది. క్రితం క్వార్టర్(2019–20, క్యూ4)లో ఏఆర్పీయూ రూ.130.6గా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి జియో మొత్తం యూజర్ల సంఖ్య 38.75 కోట్లు కాగా, జూన్ చివరినాటికి ఈ సంఖ్య 39.83 కోట్లకు వృద్ధి చెందింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్స్ ప్రకటించడంతో హైడ్రోకార్బన్స్ వ్యాపారం డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అయితే, కార్యకలాపాల్లో వెసులుబాటు కారణంగా దాదాపు సాధారణ స్థాయిలోనే నిర్వహణ సాధ్యమైంది. దీంతో పరిశ్రమలోకెల్లా ధీటైన ఫలితాలను ప్రకటించగలిగాం. కరోనా లాక్డౌన్ కాలంలోనూ కంపెనీ క్యూ1లో రికార్డు స్థాయిలో నిధులను దక్కించుకుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద నిధుల సమీకరణను ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మేం పూర్తిచేశాం’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత -
ఆర్థిక ఫలితాల సమర్పణకు గడువు పొడిగింపు
కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి ప్రభావంతో కంపెనీల ఆర్థిక ఫలితాల సమర్పణ గడువును మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు సెబీ తెలిపింది. ఆయా కంపెనీలు తమ త్రైమాసిక, అర్థ, వార్షిక ఆర్థిక ఫలితాల గణాంకాలను సమర్పించేందుకు కాలపరిమితిని జూలై 31వరకు పొడగిస్తున్నట్లు మార్కెట్ రెగ్యూలేటరీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌తో నేపథ్యంలో గతంలో కంపెనీల ఫలితాలను జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గడువును జూన్ 31వరకు పొడిగిస్తున్నట్లు సెబీ పేర్కోంది. అనేక లిస్టెడ్ కంపెనీలు, ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆయా పరిశ్రమ సంస్థలు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్న సెబీ పేర్కోంది. ఆయా కంపెనీల అనుబంధ, భాగస్వామ్య సంస్థలు కంటెన్మెంట్ జోన్లలో ఉండటం వల్ల అడిట్ ప్రక్రియతో ఇతర నిర్వహణ సవాళ్లను దృష్ట్యా కంపెనీలకు ఈ వెసులుబాటును కలిగిస్తున్నట్లు సెబీ తెలిపింది. -
గణాంకాలు, ఫలితాలు కీలకం
ఈ వారం వెలువడే వివిధ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. కరోనా వైరస్ కేసుల తీవ్రత, ఈ వైరస్ వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం పరిణామాలు కూడా కీలకమేనని వారంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల గమనం, వివిధ దేశాల్లో లాక్డౌన్ సంబంధిత వార్తలు... ఇవన్నీ కూడా తగిన ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల 12న(మంగళవారం) మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. అదే రోజు ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. ఇక ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 14న (గురువారం) వస్తాయి. మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బంధన్ బ్యాంక్ తదితర మొత్తం 50కు పైగా కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు– ఈ రెండు అంశాలు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. రిలయన్స్ రైట్స్ ఇష్యూకి రికార్డు తేది మే14 ప్రతిపాదిత రైట్స్ ఇష్యూకి మే 14ను రికార్డు తేదీగా నిర్ణయించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇష్యూ ప్రారంభ, ముగింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. -
మెప్పించిన ఇన్ఫీ!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆశావహ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2019–20, క్యూ1) కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,612 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 13.9 శాతం ఎగబాకి రూ.19,128 కోట్ల నుంచి రూ.21,803 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు కంపెనీ క్యూ1లో రూ. 3,702 కోట్ల నికర లాభాన్ని, రూ.21,776 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. దీనికి మించి ఫలితాలు వెలువడ్డాయి. సీక్వెన్షియల్‌గా ఇలా... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) నికర లాభం రూ.4,078 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా కంపెనీ లాభంలో 6.8% తగ్గుదల నమోదైంది. ఆదాయం మాత్రం 1.2 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో రూ.21,539 కోట్లుగా ఉంది. గైడెన్స్ అప్... ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) ఇన్ఫీ పెంచింది. గడిచిన క్వార్టర్ ఫలితాల సందర్భంగా ఈ ఏడాది ఆదాయ వృద్ధి 7.5–9.5% ఉండొచ్చని అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 8.5–10 శాతానికి పెంచింది. ఇక నిర్వహణ మార్జిన్ గైడెన్స్ 21–23 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► డాలర్ల రూపంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన క్యూ1లో 534 మిలియన్ డాలర్ల నుంచి 546 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 2.83 బిలియన్ డాలర్ల నుంచి 3.13 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. 12.4 శాతం వృద్ధి సాధించింది. ► క్యూ1లో 2.7 బిలియన్ డాలర్ల విలువైన భారీస్థాయి కాంట్రాక్టులను ఇన్ఫీ దక్కించుకుంది. 100 మిలియన్ డాలర్ల కేటగిరీలో రెండు కాంట్రాక్టులు, 10 మిలియన్ డాలర్లకు మించిన విభాగంలో ఆరు కాంట్రాక్టులు లభించాయి. ► కంపెనీకి డిజిటల్ విభాగం నుంచి 1,119 మిలియన్ డాలర్ల ఆదాయం క్యూ1లో సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 41.9 శాతం ఎగసింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 35.7 శాతానికి చేరింది. ► ఇంధనం–యుటిలిటీస్ విభాగం ఆదాయం 4.7 శాతం(సీక్వెన్షియల్), కమ్యూనికేషన్ 4.6 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఇక ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా నుంచి ఆదాయం సీక్వెన్షియల్‌గా 3 శాతం వృద్ధి చెందింది. మిగత దేశాల నుంచి ఆదాయంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది. ► కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరినాటికి 2,29,029కి చేరింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి (2018–19, క్యూ4) ఈ సంఖ్య 2,28,123 మాత్రమే. దీనిప్రకారం చూస్తే నికరంగా 906 మంది ఉద్యోగులు మాత్రమే జతయ్యారు. ఇక ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ1లో 23.4 శాతానికి పెరిగింది. క్యూ4లో ఇది 20.4 శాతం మాత్రమే. ► డేటా ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ సేవల అనుబంధ సంస్థ ట్రైఫాక్టాలో అదనంగా 6 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మొత్తం పెట్టుబడి 10 మిలియన్ డాలర్లకు చేరుతుందని ఇన్ఫీ పేర్కొంది. ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1% లాభపడి రూ.727 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మగిశాక ఫలితాలను ప్రకటించింది. కాగా, అమెరికా నాస్డాక్ ఎక్సే్ఛంజ్‌లో ఇన్ఫీ షేరు(ఏడీఆర్) శుక్రవారం కడపటి సమాచారం మేరకు 6 శాతానికిపైగా లాభాలతో ట్రేడవుతోంది. ఇక లాభాల్లో 85% ఇన్వెస్టర్లకే.. ఇన్వెస్టర్లకు మరింత విలువ జోడించేందుకు తమ నిధుల కేటాయింపు ప్రణాళికను మారుస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లకుగాను కంపెనీ వార్షిక నికర లాభాల్లో (ఫ్రీ క్యాష్‌ఫ్లో) 85 శాతం వరకూ తిరిగి ఇన్వెస్టర్లకు పంచేయాలని నిర్ణయించినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నీలాంజన్ రాయ్ తెలిపారు. ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్నట్లే డివిడెండ్లు లేదా ప్రత్యేక డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల రూపంలో ఇది ఉంటుందన్నారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని, ఇప్పటికీ తమవద్ద 3.5 బిలియన్ డాలర్ల నగదు నిల్వలున్నాయని రాయ్ వివరించారు. ఇప్పటివరకూ ఏటా 70 శాతం వరకూ ఫ్రీ క్యాష్‌ను ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చే విధానాన్ని ఇన్ఫీ అనుసరిస్తోంది. కాగా, రూ.8,260 కోట్ల షేర్ల బైబ్యాక్ కొనసాగుతోందని ఇప్పటివరకూ రూ.5,934 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ బైబ్యాక్ కొనసాగింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. కాగా, తాజా బడ్జెట్లో 20 శాతం బైబ్యాక్ పన్ను విధించిన నేపథ్యంలో భవిష్యత్తులో కంపెనీల షేర్ల బైబ్యాక్‌లకు అడ్డుకట్ట పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు మరింతగా నగదు నిల్వలను పంచే ప్రణాళికను ఇన్ఫీ ప్రకటించడం గమనార్హం. ‘ఈ ఆర్థిక సంవత్సరాన్ని చాలా పటిష్టమైన ఫలితాలతో మేం బోణీ చేశాం. డాలర్ల రూపంలో ఆదాయం 12.4 శాతం ఎగబాకడం, ముఖ్యంగా డిజిటల్ విభాగం నుంచి 41.9 శాతం ఆదాయ వృద్ధి నమోదు కావడం శుభపరిణామం. క్లయింట్లతో మెరుగైన సంబంధాలు, వారిపై మరింత దృష్టిపెట్టడం, తదనుగుణంగా మేం చేస్తున్న పెట్టుబడులే మెరుగైన ఫలితాలకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌ను కూడా పెంచాం’. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ, ఎండీ -
ఆదాయం తగ్గుతుంది
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ కంపెనీ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, భారత్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం 15 శాతం తగ్గి 44.1 కోట్ల డాలర్లకు చేరింది.. గత ఏడాది ఇదే క్వార్టర్లో నికర లాభం 52 కోట్ల డాలర్లు వచ్చింది. ఆదాయం 5 శాతం ఎగసి 411 కోట్ల డాలర్లకు చేరింది. సగం తగ్గిన ఆదాయ అంచనాలు..: నిరాశకర ఫలితాలను ప్రకటించిన ఈ కంపెనీ పూర్తి ఏడాది ఆదాయం అంచనాలను సగానికి పైగా తగ్గించింది. ఈ ఏడాది ఆదాయం 7–9 శాతం రేంజ్లో వృద్ధి చెందగలదని ఒక నెల క్రితం ఈ కంపెనీ పేర్కొంది. తాజాగా ఈ అంచనాలను 3.6–5.1 శాతానికి తగ్గంచింది. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్ విభాగాల్లో వృద్ధి మందకొడిగా ఉండే అవకాశాలుండటంతో ఆదాయ అంచనాలను తగ్గించామని పేర్కొంది. ఈ ఏడాది రెండో క్వార్టర్ ఆదాయం అంచనాలు 3.9–4.9 శాతం రేంజ్లో ఉండగలవని వివరించింది. విఫలమయ్యాం..: మార్కెట్ అవకాశాలను సమర్థవంతగా అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యామని కంపెనీ సీఈఓ బ్రియాన్ హంఫ్రిస్ పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ డిసౌజా నుంచి ఏప్రిల్ 1 నుంచి సీఈఓ పగ్గాలను హంఫ్రిస్ తీసుకున్నారు. -
ప్రాఫిట్ 10 వేల కోట్లు!!
న్యూఢిల్లీ: దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలతో అదరగొట్టింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల ఊతంతో క్యూ3లో నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ.10,251 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో రూ. 10,000 కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ. 9,420 కోట్లు. అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో రిలయన్స్ ఆదాయం 56 శాతం ఎగిసి రూ. 1,71,336 కోట్లకు చేరింది. క్యూ3లో రిలయన్స్ నికర లాభం సుమారు దాదాపు రూ. 9,648 కోట్ల స్థాయిలో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ‘ఇటు దేశానికి అటు వాటాదారులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రిలయన్స్ నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక త్రైమాసికంలో ఏకంగా రూ. 10,000 కోట్ల లాభాల మైలురాయిని దాటిన తొలి దేశీ ప్రైవేట్ కంపెనీగా నిల్చింది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ గురువారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా చెప్పారు. చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ సవాళ్లు ఎదురైనప్పటికీ.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించగలిగామని ఆయన పేర్కొన్నారు. ‘రిటైల్, జియో వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ మొత్తం లాభదాయకత మెరుగుపడటంలో వీటి పాత్ర కూడా పెరుగుతోంది’ అని ఆయన చెప్పారు. క్యూ3లో రిలయన్స్ నగదు నిల్వలు స్వల్పంగా రూ. 76,740 కోట్ల నుంచి రూ. 77,933 కోట్లకు పెరిగాయి. భారీ పెట్టుబడి ప్రణాళిక పూర్తి కావడంతో 2018 డిసెంబర్ 31 నాటికి మొత్తం రుణ భారం రూ. 2,74,381 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి 31 నాటికి ఇది రూ. 2,18,763. రిఫైనింగ్ మార్జిన్ డౌన్ .. రిలయన్స్ పెట్రో కెమికల్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు లాభం 43% పెరిగి రూ. 8,221 కోట్లుగా నమోదైంది. అయితే, రిఫైనింగ్ విభాగం ఆదాయాలు వరుసగా మూడో త్రైమాసికంలో తగ్గాయి. మార్జిన్ల తగ్గుదల కారణంగా 18% క్షీణించి రూ.5,055 కోట్లుగా నమోదైంది. ముడి చమురును ఇంధనంగా మార్చే రిఫైనింగ్ ప్రక్రియకు సంబంధించిన స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎం) ప్రతి బ్యారెల్‌కు 8.8 డాలర్లుగా నమోదైంది. ఇది 15 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయి. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 9.5 డాలర్లుగా ఉండగా, 2017 క్యూ3లో ఇది 11.6 డాలర్లు. ఉత్పత్తి తగ్గుదల కొనసాగడం.. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు నష్టాలు రూ. 185 కోట్లకు తగ్గాయి. క్యూ2లో ఇవి రూ. 480 కోట్లు కాగా, 2017–18 మూడో త్రైమాసికంలో రూ. 291 కోట్లు. జియో లాభం 65 శాతం అప్.. టెలికం విభాగమైన రిలయన్స్ జియో లాభాలు మూడో త్రైమాసికంలో 65 శాతం ఎగిసి రూ. 831 కోట్లకు చేరాయి. నిర్వహణ ఆదాయం 50.9 శాతం పెరిగి రూ. 10,383 కోట్లకు పెరిగింది. అంతక్రితం త్రైమాసికంలో ఆదాయం రూ. 6,879 కోట్లు కాగా, లాభం రూ. 504 కోట్లు. సగటున యూజర్‌పై వచ్చే ఆదాయం 15.5 శాతం క్షీణించి రూ. 154 నుంచి రూ. 130కి తగ్గింది. అయితే, కస్టమర్ల సంఖ్య 16 కోట్ల నుంచి 28 కోట్లకు పెరగడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ’ప్రస్తుతం జియో కుటుంబ సభ్యుల సంఖ్య 28 కోట్లకు చేరింది. అందుబాటు ధరలో అత్యంత నాణ్య మైన సర్వీసులతో అందర్నీ అనుసంధానించాలన్న మా లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచం లోనే అతి పెద్ద మొబైల్ డేటా నెట్వర్క్ గా ఎదుగుతోంది. గృహాలు, కంపెనీల్లోనూ కనెక్టివిటీకి కొత్త తరం ఎఫ్‌టీటీఎక్స్ సర్వీసులనుపై కసరత్తు చేస్తున్నాం ’ అని అంబానీ చెప్పారు. క్యూ3లో డేటా వినియోగం 431 కోట్ల గిగా బైట్స్ నుంచి 864 కోట్ల గిగాబైట్స్కి చేరింది. సగటున ప్రతి యూజరు డేటా వినియోగం 9.6 జీబీ నుంచి 10.8 జీబీకి చేరింది. రిలయన్స్ రిటైల్ లాభం రూ. 1,680 కోట్లు.. పండుగ సీజన్ అమ్మకాలు, కొత్త స్టోర్స్ ప్రారంభం మొదలైన సానుకూల అంశాల ఊతంతో రిలయన్స్ రిటైల్ విభాగం పన్నుకు ముందస్తు లాభాలు రెట్టింపై రూ.1,680 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఈ లాభం రూ. 606 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం 89 శాతం పెరిగి రూ. 18,798 కోట్ల నుంచి రూ. 35,577 కోట్లకు పెరిగింది. రిలయన్స్ రిటైల్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,400 పైచిలుకు నగరాలు, పట్టణాల్లో 9,907 స్టోర్స్ ఉన్నాయి. క్యూ3లో 13.9 కోట్ల మంది రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌ను సందర్శించారని సంస్థ తెలిపింది. నిత్యావసరాలు విక్రయించే రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ విభాగాలు కూడా మెరుగైన పనితీరు కనపర్చాయని వివరించింది. ఇక ఫ్యాషన్.. లైఫ్‌స్టయిల్ విభాగంలో కొత్తగా 100 స్టోర్స్ ప్రారంభించామని, దీంతో కొత్తగా మరో 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించినట్లయిందని పేర్కొంది. రిలయన్స్ జ్యుయెల్స్ విభాగం 100 స్టోర్స్ మైలురాయి దాటింది. స్టోర్స్ సంఖ్య ప్రస్తుతం 57 నగరాల్లో 109కి చేరింది. ప్రైవేట్‌లో టాప్.. రూ.10 వేల కోట్ల లాభాల మైలురాయి దాటిన తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మాత్రమే ఒక క్వార్టర్లో రూ.10 వేల కోట్లకు మించి లాభాలు ప్రకటించింది. 2013 జనవరి–మార్చి త్రైమాసికంలో ఐవోసీ రూ.14,513 కోట్ల నికర లాభం నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ అంతా ఒకే క్వార్టర్లో అందుకోవడంతో అప్పట్లో ఐవోసీ ఈస్థాయి లాభాలు ప్రకటించడం సాధ్యపడింది. మిగతా క్వార్టర్స్‌లో నష్టాలు రావడంతో 2012–13 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఐవోసీ రూ. 5,005 కోట్ల లాభాలు నమోదు చేయగలిగింది. గురువారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు 0.30 పైసలు క్షీణించి రూ. 1,133.75 వద్ద క్లోజయ్యింది. -
రిలయన్స్ సామర్ధ్యంపై అంచనాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పూర్తిస్థాయిలో సామర్థ్యం కనబరిచే సమయం ఇంకా రాలేదని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలు ప్రకటించినా మున్ముందు ఆర్ఐఎల్ పూర్తిస్థాయిలో సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. జియో రాబడులు ఆశించిన మేర రాకున్నా కంపెనీ పెట్రోకెమికల్ సామర్థ్యం మెరుగ్గా ఉండటంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని హెచ్ఎస్బీసీ పేర్కొంది. గోల్డ్‌మాన్ శాక్స్.. పెట్రోకెమికల్ డివిజన్ నుంచే ఆర్ఐఎల్ సత్తా చాటిందని ప్రతి క్వార్టర్లో 10 శాతం వృద్ధి కనబరుస్తూ రిఫైనింగ్ రాబడిని మించి అతిపెద్ద రాబడి ఆర్జించే విభాగంగా పెట్రోకెమికల్ ఎదిగిందని గోల్డ్‌మాన్ శాక్స్ పేర్కొంది. రిటైల్ బిజినెస్ నుంచి మెరుగైన వృద్ధితో రిఫైనింగ్ మార్జిన్లపై అంచనాలు తప్పాయని పేర్కొంది. ఇక ప్రతి యూజర్‌పై సగటు రాబడి (ఏఆర్పీయూ) తగ్గినా సబ్‌స్ర్కైబర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో జియో రాబడి అంచనాలకు అనుగుణంగానే ఉందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ఆర్ఐఎల్ షేర్లు పెరుగుతున్నా ఇంతకుమించి పెరగవని ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్ఐఎల్ మెరుగైన ప్రదర్శన ఇంకా మొదలు కాలేదని పేర్కొంది. మోర్గాన్‌స్టాన్లీ.. ఆర్ఐఎల్ ఇంధన రాబడులు అంతర్జాతీయ కంపెనీలతో పోలిస్తే అత్యంత నిలకడగా ఉన్నాయి. వృద్ధి పరంపరను కొనసాగించే సంకేతాలు పంపుతున్నాయి. ఇక రిటైల్, టెలికాం విభాగాలు రాబడులను మెరుగుపరుస్తాయి. డేటా యూసేజ్ ఇతర యూజర్ల తరహాలోనే ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ఐఎల్ నాలుగో క్వార్టర్లో రిఫైనింగ్ రాబడులను (రూ 6400 కోట్లు) పెట్రోకెమికల్ బిజినెస్ రూ(7700 కోట్లు) అధిగమించింది. జియో కేవలం టెలికాం రంగానికే పరిమితం కాదని ఇది డిజిటల్ సేవల వ్యాపారంలో భాగమని ఆర్ఐఎల్ ప్రస్తావించడం గమనార్హం. రానున్న రోజుల్లో జియో దశల వారీగా ఫైబర్ టూ హోం సేవలను ప్రారంభించనుంది. కొటాక్ సెక్యూరిటీస్ జియో ఊపందుకునే వరకూ ఆర్ఐఎల్ వృద్ధి పరంపర మందగమనంలో ఉండే అవకాశం ఉంది. పెట్రోకెమికల్ ప్రాజెక్టులు పూర్తిస్ధాయిలో ఉపయోగంలోకి వచ్చిన అనంతరం మెరుగైన వృద్ధిని అంచనా వేయవచ్చు. డచ్ బ్యాంక్.. రాబోయే ఆరు నెలల్లో ఇంధన రంగంలో నూతన ప్రాజెక్టుల ఆరంభం, జియో నుంచి రాబడులతో ఆర్ఐఎల్ మెరుగైన సామర్థ్యం కనబరిచే అవకాశం ఉంది. 2018-20 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్ఐఎల్ రాబడులు 24 శాతం మేర వృద్ధి సాధించవచ్చు. -
జియోతో రిలయన్స్‌లో జోష్
సాక్షి,ముంబయి: రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 12.5 శాతం వృద్ధితో రూ 8109 కోట్లకు పెరిగింది. కంపెనీ రాబడి 23.9 శాతం పెరిగి రూ 1,01,169 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్లో రిలయన్స్ రిటైల్ జెనెసిస్ లగ్జరీ లిమిటెడ్‌లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ఐఎల్ బాలాజీ టెలిఫిల్మ్స్లో వాటా కొనుగోలు చేసింది. ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ సంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిందన్నారు. ఈ క్వార్టర్లో కంపెనీ అద్భుత సామర్ధ్యం కనబరిచిందని, రిలయన్స్ జియో తన తొలి క్వార్టర్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని అన్నారు. తమ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపార వృద్ధి కంపెనీ ఫలితాలపై సానుకూల ప్రభావం చూపిందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా వ్యాపార అవకాశాల విస్తృతి ఫలితాలు ఇవ్వడం మొదలైందని అన్నారు. రిటైల్ బిజినెస్ ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేస్తోందని చెప్పారు. డిజిటల్ మార్కెట్లో రిలయన్స్ జియో నూతన తరం డేటా విప్లవాన్ని అందిపుచ్చుకుంటుందని అన్నారు. 4జీ టెక్నాలజీలో భారీగా వెచ్చించడంతో పాటు సరైన వ్యాపార వ్యూహాలతో జియో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించగలిగిందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. -
ఆధార్ లింక్ చేయపోతే, అన్ని అకౌంట్స్ బ్లాక్!
న్యూఢిల్లీ : ఆధార్ విషయంపై బ్యాంకు, ఫైనాన్సియల్ అకౌంట్ హోల్డర్స్ కు ఆదాయపు పన్ను శాఖ మరోసారి గట్టి హెచ్చరికలు జారీచేసింది. 2014 జూలై 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్యలో బ్యాంకు అకౌంట్లు, ఇన్సూరెన్స్, స్టాక్ వంటి ఇతర అకౌంట్లు ప్రారంభించినవారు ఏప్రిల్ 30లోగా ఆధార్ ను తమ అకౌంట్లకు లింక్ చేసుకోవాలని సూచించింది. గడువులోగా అకౌంట్ హోల్డర్స్ వివరాలను అందించకపోతే, అకౌంట్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. బ్యాంకులకు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు ఆ అకౌంట్లను బ్లాక్ చేసే అధికారముంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఒక్కసారి వివరాలన్ని సమర్పించిన అనంతరం ఎప్పటిలాగే అకౌంట్లను ఆపరేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్( ఎఫ్ఏటీసీఏ) ప్రొవిజన్స్ కిందకు వచ్చే అకౌంట్ హోల్డర్స్ అందరూ తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయాలని ఐటీ శాఖ ఆదేశించింది. ఎఫ్ఏటీసీఏ చట్టం కింద అమెరికా, భారత్ రెండు దేశాలు పన్నులకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి వీలుంటుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆర్థిక సమాచారం పంచుకునేలా ఈ రెండు దేశాలు 2015 జూలైలో ఈ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నాయి. ''2017 ఏప్రిల్ 30 వరకు సెల్ఫీ సర్టిఫికేషన్ సమర్పించండి. లేకపోతే అకౌంట్లు బ్లాక్ చేస్తాం. అకౌంట్ల బ్లాక్ చేస్తే, ఇక అకౌంట్ హోల్డర్ ఎలాంటి లావాదేవీలను జరుపుకోవడానికి వీలుండదు'' అని ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ అకౌంట్లలో బ్యాంకులు, ఇన్సూరెన్స్, స్టాక్స్ అన్ని కలిసే ఉంటాయని తెలిపింది. ఈ ఎఫ్ఏటీసీఏ ప్రొవిజన్స్ కిందకు వచ్చే అకౌంట్ హోల్డర్స్ గడువులోగా ఆధార్ నెంబరు సమర్పించాల్సిందేనని పేర్కొంది. -
ఐటీసీ లాభం 2,647 కోట్లు
6 శాతం వృద్ధి • పెద్ద నోట్ల రద్దుతో మందగించిన వ్యాపారం న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీపై పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం పడింది. డిమాండ్ తగ్గి వ్యాపారం మందగించింది. మొత్తం మీద కంపెనీ ఆర్థిక ఫలితాలు ఓ మెస్తరుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నికర లాభం 6 శాతం పెరిగిందని ఐటీసీ తెలిపింది. గత క్యూ3లో రూ.2,504 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.2,647 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ వ్యాపారంలో ప్రతికూలతలు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా డిమాండ్ తగ్గడం ప్రభావం చూపాయని వివరించింది. గత క్యూ3లో రూ.12,962 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం వృద్ధితో రూ. 13,570 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇబిటా రూ.3,475 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.3,546 కోట్లకు పెరగ్గా, మార్జిన్లు 26.8 శాతం నుంచి 26.1 శాతానికి పడిపోయాయని తెలిపింది. మందకొడిగా సిగరెట్ల వ్యాపారం... పెద్ద నోట్ల రద్దు, నిబంధనలు కఠినంగా మారుతుండడం, పన్నుల భారం తదితర అంశాల కారణంగా సిగరెట్ల వ్యాపారం మందకొడిగా ఉందని ఐటీసీ పేర్కొంది. సిగరెట్ల వ్యాపారం ఆదాయం రూ.8,106 కోట్ల నుంచి 2.2 శాతం ఎగసి 8,288 కోట్లకు చేరిందని వివరించింది. సిగరెట్లతో కలుపుకొని ఎఫ్ఎంసీజీ వ్యాపారం రూ.10,591 కోట్ల నుంచి 2.5 శాతం పుంజుకొని రూ.10,857 కోట్లకు, ఇతర ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ వ్యాపారం రూ.2,485 కోట్ల నుంచి 3.3 శాతం వృద్ధితో 2,569కు పెరిగాయని వివరించింది. హోటల్ వ్యాపారం రూ.345 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.371 కోట్లకు, వ్యవసాయ వ్యాపారం ఆదాయం రూ.1,481 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.1,672 కోట్లకు పెరిగాయని, పేపర్‌బోర్డ్‌లు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారం ఆదాయం రూ.1,338 కోట్ల నుంచి రూ.1,336 కోట్లకు తగ్గిందని తెలిపింది. అన్ని సెగ్మెంట్లపై నోట్ల రద్దు ఎఫెక్ట్.. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఎఫ్ఎంసీజీ వ్యాపారం బాగా దెబ్బతిన్నదని ఐటీసీ పేర్కొంది. బిస్కెట్స్, స్నాక్స్, నూడుల్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, బ్రాండెడ్ దుస్తులు.. అన్నిరంగాలపై నోట్ల రద్దు ప్రభావం పడిందని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తట్టుకోవడానికి పలు చర్యలు తీసుకున్నామని, త్రైమాసికం చివర్లో నోట్ల కొరత సమస్య తగ్గుముఖం పట్టడంతో అమ్మకాలు పుంజుకున్నాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేర్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. డీమోనిటైజేషన్ పరిస్థితుల్లోనూ నికర లాభం పెరగడంతో ఈ షేర్ బీఎస్ఈలో ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి రూ.267ను తాకింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 6 శాతం వరకూ ఈ షేర్ పెరిగిన నేపథ్యంలో ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. చివరకు 2.7 శాతం నష్టంతో రూ.257 వద్ద ముగిసింది. -
కీలక కంపెనీల ఫలితాల ప్రభావం..
• ఈ వారమే డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు • ఒడిదుడుకులు ఉంటాయ్ • మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: పలు ప్రధాన కంపెనీలు ఈ వారంలోనే తమ తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలకు తోడు ఈ వారంలోనే అక్టోబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు అంశం కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్ సరళి, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్ గమనంపై తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ వారంలో పలు దిగ్గజ కంపెనీలు తమ తమ సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తాయని, ఈ ప్రకటనల ఆధారంగా స్టాక్ మార్కెట్ పయనిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ అభినాశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, మారుతీ సుజుకీ కంపెనీలు క్యూ2 ఫలితాలను ఈ వారంలోనే వెల్లడించనున్నాయి.అక్టోబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ నెల 27న(గురువారం) ముగియనుండడం వల్ల స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులు అంటున్నారు. నేడు (సోమవారం) యాక్సిస్ బ్యాంక్, ఐడియా సెల్యులర్, అదానీ పవర్, రిలయన్స్ క్యాపిటల్, భారతీ ఇన్ఫ్రాటెల్ కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక మంగళవారం(ఈ నెల25న) భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు, బుధవారం(ఈ నెల26న) హెచ్డీఎఫ్సీ, హీరో మోటొకార్ప్, హిందుస్తాన్ యునిలివర్, ఐటీసీలు, గురువారం(ఈ నెల27న) మారుతీ సుజుకీ, ఐఓసీ, టెక్ మహీంద్రాలు, శుక్రవారం (ఈ నెల 28న) బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, వేదాంత, నెస్లే ఇండియా కంపెనీలు తమ తమ క్యూ2 ఫలితాలు వెల్లడిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు రూ. 7,500 కోట్లు ఈ నెలలో ఇప్పటివరకూ భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. చైనా గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా పుంజుకోవలసి ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ వ్యాఖ్యానించడం దీనికి కారణాలని పుణులంటున్నారు.కాగా గత నెలలో భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.29,232 కోట్లుగా ఉన్నాయి. -
ఇన్ఫీ లాభం అప్.. గైడెన్స్ డౌన్
• క్యూ2లో అంచనాలు మించిన లాభం • రూ. 3,606 కోట్లు; 6.1 శాతం వృద్ధి • ఆదాయం రూ.17,310 కోట్లు; 10.7% వృద్ధి • ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలు 8-9 శాతానికి కుదింపు • షేరుకి రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్ బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ అన్న రీతిలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ నికర లాభం ఇన్వెస్టర్ల అంచనాలను మించినప్పటికీ.. పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పడింది. ప్రధానంగా అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిని ఇందుకు కారణంగా పేర్కొంది. క్యూ2లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,606 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,398 కోట్లతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం కూడా 10.7 శాతం ఎగసి రూ.17,310 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.15,635 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గానూ వృద్ధి... ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభం రూ.3,436 కోట్లతో పోలిస్తే(క్యూ1, సీక్వెన్షియల్ ప్రాతిపదికన) కూ2లో 4.9 శాతం వృద్ధి చెందింది. ఆదాయం కూడా రూ.16,782 కోట్ల నుంచి 3.1 శాతం పెరిగింది. ఇక డాలరు రూపంలో ఆదాయం సీక్వెన్షియల్‌గా 3.4 శాతం వృద్ధితో 2.587 బిలియన్ డాలర్లుగా నమోదైంది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ వృద్ధి 3.9 శాతంగా ఉంది. అగ్రగామి టీసీఎస్‌తో పోలిస్తే(1 శాతం, 1.3 శాతం చొప్పున ఉన్నాయి) ఇన్ఫీ మెరుగైన పనితీరునే సాధించింది. కాగా, మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో ఇన్ఫీ రూ.3,500 కోట్ల లాభాన్ని, రూ.17,150 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. డాలరు ఆదాయం 2.559 బిలియన్ డాలర్లు ఉండొచ్చని లెక్కగట్టారు. గైడెన్స్ తగ్గింపు... ప్రస్తుత పూర్తి ఏడాది(2016-17)కి ఆదాయ వృద్ధి అంచనాలను(గెడైన్స్) ఇన్ఫోసిస్ భారీగా తగ్గించి 8-9 శాతానికి పరిమితం చేసింది. అంతక్రితం గైడెన్స్ 10.5-12 శాతంగా ఉంది. ఆదాయ వృద్ధి అంచనాలను వరుసగా రెండో క్వార్టర్లోనూ తగ్గించడం గమనార్హం. ప్రధానంగా సమీపకాలంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో ద్వితీయార్ధంలో పనితీరు అంచనాలను దృష్టిలోపెట్టుకొని కంపెనీ తాజా ప్రకటన చేసింది. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ క్యూ2లో కంపెనీ మార్జిన్లు సీక్వెన్షియల్‌గా 80 బేసిస్ పాయింట్లు ఎగబాకి 24.9 శాతంగా నమోదయ్యాయి. ⇔ జూలై-సెప్టెంబర్ కాలంలో 78 కొత్త క్లయింట్లను సంపాదించింది. ⇔ ఉత్తర అమెరికా వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా 2.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. యూరప్ 3.7%, భారత్ 28.7 శాతం, మిగతా ఇతర దేశాలకు సంబంధించి వ్యాపారం 5.2% వృద్ధి చెందింది. ⇔ సెప్టెంబర్ చివరినాటికి రూ.35,640 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ⇔ రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.11 చొప్పున(220 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ⇔ క్యూ2లో కంపెనీ స్థూలంగా 12,717 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 2,779 మంది వలసపోవడంతో నికర నియామకాలు 9,938గా నమోదయ్యాయి. సెప్టెంబర్ చివరినాటికి ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,829కు చేరింది. ⇔ ఫలితాలు అంచనాలను మించినప్పటికీ.. గెడైన్స్ తగ్గింపు కారణంగా ఇన్ఫీ షేరు దిగజారింది. శుక్రవారం బీఎస్ఈలో ఒకనాకొక దశలో ఏడాది కనిష్టానికి(రూ.996) పడిపోయింది కూడా. చివరికి 2.34 శాతం నష్టంతో రూ.1,027 వద్ద ముగిసింది. ⇔ ప్రధానమైన ఐటీ సర్వీసుల కాంట్రాక్టుల సమర్థ నిర్వహణపై దృష్టిసారించడం ద్వారా క్యూ2లో మంచి పనితీరును సాధించగలిగాం. అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితిలోనే మరికొన్నాళ్లు పయనించాల్సి ఉంటుంది. దీంతో గెడైన్స్‌ను సవరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మేం ఇప్పుడు అనుసరిస్తున్న ‘సాఫ్ట్వేర్ ప్లస్ సర్వీసెస్’ విధాన వ్యూహాన్ని మరింత పటిష్టంగా అమలు చేయనున్నాం. 2020 నాటికి 20 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించాలన్న లక్ష్యానికి కట్టుబడిఉన్నాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మార్జిన్లు 24-25 శాతం మేర ఉండొచ్చని భావిస్తున్నాం. క్యూ2లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన ఆరు భారీ కాంట్రాక్టులను దక్కించుకున్నాం. రానున్న కొద్ది క్వార్టర్లపాటు బీఎఫ్ఎస్ఐ విభాగంలో ఆదాయ వృద్ధి ఉండకపోవచ్చనేది మా అంచనా. అయితే, దీర్ఘకాలానికి చూస్తే ఇబ్బందులేవీ లేనట్టే. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ నాస్కామ్ ఐటీ వృద్ధి అంచనాల్లో కోత! న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఏడాది దేశీ ఐటీ రంగం వృద్ధి అంచనాలను తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ చాంబర్ నాస్కా మ్ సంకేతాలిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశీ సాఫ్ట్వేర్ ఎగుమమతుల ఆదాయం 10-12% ఉంటుందనేది నాస్కామ్ అంచనా(గెడైన్స్). ‘ఇన్ఫీ, టీసీఎస్ మాదిరిగానే ఇతర ఐటీ కంపెనీలు కూడా అనిశ్చితిపై ఆందోళనలు వ్యక్తం చేస్తే.. ప్రస్తుత గెడైన్స్‌ను సవరించే అంశాన్ని పరిశీలించాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా తగ్గించాలా వద్దా... ఎంతకు చేర్చాలి అనేది చెప్పడం కష్టమే’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ పేర్కొన్నారు. మిగతా కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు కూడా వెలువడ్డాకే(ఈ నెల చివరికి లేదా నవంబర్‌లో) వృద్ధిపై నాస్కామ్ తాజా అభిప్రాయాలను వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. -
ఐటీ రంగానికి ‘క్యూ2’ కష్టాలు?
• నేడు టీసీఎస్ ఫలితాలతో సీజన్ షురూ.. • వృద్ధి తీవ్రంగా మందగించొచ్చంటున్న విశ్లేషకులు • బ్రెగ్జిట్, బీఎస్ఎఫ్ఐ క్లయింట్ల వ్యయాల తగ్గుదల, • కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గుల ప్రభావం ముంబై: దేశీ ఐటీ కంపెనీలకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో దిగ్గజ ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు అత్యంత నిరాశాజనకంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నేడు(గురువారం) అగ్రగామి టీసీఎస్‌తో క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడనున్నాయి. సాధారణంగా రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు సీజనల్‌గా చాలా పటిష్టమైన వృద్ధి నమోదుచేస్తుంటాయని.. అయితే, ఇప్పుడు దీనికి భిన్నంగా ఫలితాలు వెలువడవచ్చనేది విశ్లేషకుల మాట. కాగా, టీసీఎస్ ఇప్పటికే దీనికి సబంధించిన సంకేతాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్)తో పాటు బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సేవల విభాగం(బీఎస్ఎఫ్ఐ) క్లయింట్ల ఐటీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం కూడా దేశీ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. మొత్తం ఐదు టాప్ ఐటీ కంపెనీలకు సంబంధించి క్యూ2 ఆదాయం(సీక్వెన్షియల్‌గా) కేవలం 1.5 శాతం మాత్రమే వృద్ధి చెందొచ్చనేది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. గడిచిన దశాబ్ద కాలంలో ఇదే అత్యంత బలహీన క్యూ2గా నిలవనుందని కూడా అభిప్రాయపడింది. టీసీఎస్ పరిస్థితి ఏంటి? క్యూ2లో టీసీఎస్ స్థిర కరెన్సీ ప్రాతిపదికన వృద్ధి సీక్వెన్షియల్‌గా(క్యూ1తో పోలిస్తే) పెద్దగా పెరగకపోవచ్చని భావిస్తున్నారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో జూలై-సెప్టెంబర్ మధ్య బ్రిటన్ పౌండ్ డాలరుతో పోలిస్తే 8.4 శాతంమేర దిగజారింది. దీనికి తోడు ఇతర కరెన్సీల తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో క్యూ2లో డాలరు ఆదాయాలపై 40-80 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ప్రతికూల ప్రభావం ఉండొచ్చని బ్రోకరేజి కంపెనీల విశ్లేషకులు పేర్కొన్నారు. డాలరు ఆదాయంలో సీక్వెన్షియల్‌గా 1.5 శాతం వృద్ధి ఉండొచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ పేర్కొంది. సెంట్రమ్ బ్రోకింగ్ మాత్రం ఈ వృద్ధి 2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. టీసీఎస్ ఆదాయంలో బ్రిటన్ పౌండ్ల రూపంలో 13 శాతం నమోదవుతోంది. సీక్వెన్షియల్ డాలరు ఆదాయ వృద్ధికి సంబంధించి టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రోలకు కూడా ఈ క్యూ2 అత్యంత బలహీన క్వార్టర్‌గా నిలిచే అవకాశం ఉందనేది రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనా. దేశీ ఐటీ కంపెనీలకు అత్యధిక ఆదాయం లభించే అమెరికాలో బీఎస్ఎఫ్ఐ విభాగం క్లయింట్ల వ్యయాలు మందగించడం వృద్ధిపై ప్రభావం చూపుతుందని బ్రోకరేజి కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదే విషయంపై టీసీఎస్ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది కూడా. దీనికి తోడు పోటీ విపరీతంగా పెరగడంతో ప్రైసింగ్ ఒత్తిళ్లు కూడా రానున్న కొద్ది క్వార్టర్లలో దేశీ ఐటీ కంపెనీల రాబడులకు ప్రతికూలంగా నిలవనుందని అంటున్నాయి. కాగా, టీసీఎస్ ఆదాయంలో అత్యధికం (40.4%) బీఎస్ఎఫ్ఐ విభాగానిదే కావడం గమనార్హం. లాభాలు తగ్గొచ్చు... ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్, క్యూ1)లో టీసీఎస్ రూ.6,497 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ4లో రూ.6,413 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 1.31 శాతం వృద్ధి నమోదైంది. కాగా, క్యూ2లో కంపెనీ రూ.6,178 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చని మరో బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ అభిప్రాయపడింది. ప్రధానంగా ఫారెక్స్ నష్టాల ప్రభావంతో ఇతర ఆదాయాలు దిగజారడం లాభాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే, ఎడెల్ వైజ్ మాత్రం నికర లాభం సీక్వెన్షియల్‌గా 1.1 శాతం, వార్షిక ప్రాతిపదికన(గతేడాది క్యూ2తో పోలిస్తే) 5.4 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. కాగా, ఇన్ఫోసిస్ నికర లాభం సీక్వెన్షియల్‌గా క్యూ2లో 2.6 శాతం తగ్గుదలతో రూ. 3,347 కోట్లుగా నమోదు కావచ్చని మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొంది. మొత్తం ఆదాయం 1.6 శాతం వృద్ధితో(వార్షిక ప్రాతిపదికన 9 శాతం వృద్ధి) రూ.17,048 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. -
స్టాక్స్ వ్యూ
హిందాల్కో.. కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ.146 టార్గెట్ ధర: రూ.190 పుస్తక విలువ: రూ.187 ముఖ విలువ: రూ.1 ఈపీఎస్: రూ.4 ఏడాది కనిష్టం/గరిష్టం: రూ.59/152 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం క్షీణించినా, అధిక పన్ను వ్యయాలు ఉన్నప్పటికీ, నికర లాభం(స్టాండోలోన్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఐదు రెట్లు వృద్ధి చెంది రూ. 294 కోట్లకు పెరిగింది. ఉత్పత్తి నిలకడగా ఉండటం, ఇంధన ధరలు తక్కువగా ఉండటంతో వ్యయ ప్రయోజనాల కారణంగా ఇబిటా అంచనాలను మించి 1,130 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇబిటా రూ.12,400 కోట్లుగా ఉండొచ్చని భావిస్తున్నాం. కంపెనీ అనుబంధ సంస్థ నొవాలిస్ కూడా మంచి ఆర్థిక ఫలితాలనే సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హిందాల్కో కంపెనీ రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులకు పటిష్టమైన ఇబిటా తోడుకానుండటంతో కంపెనీకి రూ.2,500 కోట్ల మేర ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర రుణ భారం 2,500-3,000కోట్ల రేంజ్లో తగ్గవచ్చు. ఇటీవల జరిగిన వేలంలో 4.5 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను తక్కువ ధరలకే దక్కించుకున్నది. ఈ బొగ్గు సరఫరాలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తాయి. దీంతో బొగ్గు వ్యయాలు మరింతగా తగ్గుతాయి. నిర్వహణ అంశాల పరంగా రాగి ఉత్పత్తిని 53 రోజుల పాటు నిలిపేసింది. ఫలితంగా ఈ క్యూ1లో రాగి విభాగం లాభదాయకత తగ్గింది. ఉత్పత్తి కార్యక్రమాలు మళ్లీ ప్రారంభం కానుండటంతో ఈ విభాగం మంచి పనితీరు కనబరిచే అవకాశాలున్నాయి. వడ్డీరేట్లు తగ్గుతుండటంతో వడ్డీ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వస్తోన్న అల్యూమినియం దిగుమతులపై యాంటీ డంపింగ్ లేదా కనీస దిగుమతి ధర విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటం కంపెనీకి కలసివచ్చే అంశం. లుపిన్.. కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.1,579 టార్గెట్ ధర: రూ.1,890 పుస్తక విలువ: రూ.244 ముఖ విలువ: రూ.2 ఈపీఎస్: రూ.57 ఏడాది కనిష్టం/గరిష్టం: రూ.1,274/2,127 ఎందుకంటే: జనరిక్ ఔషధాలు ఎగుమతి చేసే అతి పెద్ద భారత కంపెనీల్లో లుపిన్ ఒకటి. స్థూల మార్జిన్లు పటిష్టంగా ఉండటం, అమెరికా వృద్ధి జోరుగా ఉండటంతో లుపిన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో 43 శాతంగా ఉన్న అమెరికా అమ్మకాలు 84 శాతం పెరగడంతో ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.4,439 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్లు 333 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 30 శాతానికి, ఇబిటా 59 శాతం వృద్ధితో రూ.1,308 కోట్లకు పెరిగాయి. నికరలాభం 55 శాతం పెరిగి రూ.882 కోట్లకు పెరిగింది. పరిశోధన. అభివృద్ధికి అధికంగా పెట్టుబడులు సమకూర్చుకోవడం, అమెరికా, జపాన్‌ల్లో ఔషధాల ధరల నిర్ణయంపై ఒత్తిడి మార్జిన్లపై ప్రభావం చూపుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే వ్యయ నియంత్రణ పద్ధతులు, కొత్త ఔషధాలను మార్కెట్లోకి తేవడం తదితర అంశాల కారణంగా ఈ ఒత్తిడిని అధిగమిస్తామని కంపెనీ ధీమాగా ఉంది. ఇటీవలనే అమెరికాకు చెందిన గావిస్ ఫార్మా కొనుగోలును పూర్తి చేసింది. దీంతో అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కోసం ప్రతి ఏటా దాఖలు చేసే కొత్త ఔషధాల ప్రతిపాదనలు 20 నుంచి 45కు పెరగనున్నాయి. వీటిల్లో ఏటా కనీసం 15 ప్రతిపాదనలకు ఆమోదం లభించగలదని కంపెనీ భావిస్తోంది. గత పదేళ్లలో ఆదాయం 24%, ఇబిటా 29 శాతం, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. రెండేళ్లలో అమెరికా అమ్మకాలు 26%, భారత విక్రయాలు 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2016-18 కాలానికి ఆదాయం 20%, ఇబిటా 21%, నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండటం, పటిష్టమైన బ్యాలెన్స్ షీట్.. కంపెనీ బలాలు. రష్యా ప్రభుత్వ షరతుల కారణంగా బయోకామ్ కొనుగోలులో జాప్యం కానుండటం ప్రతికూలమైన అంశం. -
జీఎస్టీ బిల్లుపై ఇన్వెస్టర్ల దృష్టి...
♦ కంపెనీల ఆర్థిక ఫలితాలు కీలకమే ♦ ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల ఉవాచ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుపై పురోగతి, ఈ వారం కంపెనీలు వెల్లడించే ఆర్థిక ఫలితాలపై ఈ వారం స్టాక్ మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులంటున్నారు. వీటితో పాటు నైరుతి రుతుపవనాల విస్తరణ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం.. తదితర అంశాలు తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. స్వాతంత్య్రానంతరం అతి పెద్ద పరోక్ష పన్నుల సంస్కరణగా భావించే జీఎస్టీ బిల్లుపై చర్చకోసం ఈ వారం రాజ్యసభ ఎజెండాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఇన్వెస్టర్ల కళ్లన్నీ జీఎస్టీ బిల్లుకు సంబంధించిన పార్లమెంట్ పరిణామాలపైనే ఉన్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ప్రతిపాదిత బిల్లులో ప్రభుత్వ కొన్ని మార్పులు, చేర్పులు చేయడంతో ఈ బిల్లు ఆమోదం పొందగలదన్న అంచనాలు పెరిగాయి. జూలై నెల అమ్మకాల గణాంకాలను వాహన కంపెనీలు వెల్లడిస్తాయని, ఈ కారణంగా వాహన షేర్లు వెలుగులోకి రావచ్చని సింఘానియా పేర్కొన్నారు. ఈ వారంలో వెలువడే తయారీ, సేవల రంగానికి చెందిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వివరించారు. సోమవారం మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ తయారీ రంగానికి సంబంధించి పీఎంఐ గణాంకాలను, బుధవారం(3వ తేదీన) నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను వెల్లడిస్తాయి. ఈ నెల 9న ఆర్బీఐ పాలసీని ప్రకటించనున్న నేపథ్యంలో ఈ గణాంకాలు కీలకమని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఆనంద్ జేమ్స్ వివరించారు. లాభాల స్వీకరణ అవకాశాలు.. రానున్న సెషన్లలో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగే అవకాశమున్నందున స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గడంతో విమానయాన కంపెనీలు లాభపడవచ్చని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినందున ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. 4 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ఈక్విటీ నికర పెట్టుబడులు జూలై నెలలో రూ.12,600 కోట్లను దాటాయి. ఇది 4 నెలల గరిష్ట స్థాయి. జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందగలదన్న అంచనాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉండటం, వర్షాలు కూడా సంతృప్తికరంగా కురియడం వంటి సానుకూలతల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల జోరును కొనసాగిస్తున్నారని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో స్టాక్ మార్కెట్లో రూ.12,612 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,845 కోట్లు చొప్పున నికర పెట్టుబడులు పెట్టారు. దీంతో వీరి మొత్తం పెట్టుబడులు రూ.19,457 కోట్లకు పెరిగాయి. మార్చి తర్వాత అధికంగా పెట్టుబడులు వచ్చింది గత నెలలోనే. మార్చిలో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.21,143 కోట్లుగా ఉన్నాయి. ఒక శాతం అదనపు పన్ను తొలగింపుతో సానుకూలం: నిపుణులు రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాపై అదనంగా ఒక శాతం పన్ను విధించాలన్న నిబంధన నుంచి కేంద్రం వెనక్కి తగ్గడంతో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై నెలకొన్న కారు మబ్బులు తొలగిపోయినట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని పలు వర్గాలు స్వాగతించాయి. బిల్లు ఆమోదంతో జీడీపీ 2 పాయింట్ల మేర వృద్ధి చెందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారం రాజ్యసభ ముందుకు జీఎస్టీ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కేంద్ర సర్కారు.... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్లలో ఒకటైన అంతర్రాష్ట్ర సరుకుల రవాణాపై ఒక శాతం అదనపు పన్నును తొలగించేందుకు నిర్ణయించింది. అలాగే, జీఎస్టీ కారణంగా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల పాటు సర్దుబాటు చేసేందుకు కూడా అంగీకరించింది. పన్ను రేటు రాష్ట్రం పరిధిలో ఉండరాదు.. అంతర్రాష్ట్ర సరుకుల సరఫరాపై ప్రభావం చూపే ఒక శాతం అదనపు పన్ను తొలగింపుతో జీఎస్టీ బిల్లులో పన్ను విధానం సర ళంగా మారింది. అయితే, పన్ను శ్రేణిని నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను రేటు ఉంటుంది. ఒకే పన్ను రేటుతో దేశం మొత్తం ఏకీకృత మార్కెట్‌గా ఉండాలన్న ఉద్దేశాన్ని ఇది దెబ్బతీస్తుంది. 2017 ఏప్రిల్ నుంచే బిల్లును అమలు చేయాలన్నది దూకుడుగా ఉంది. సేవా రంగం ఇంకా ఈ బిల్లును పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థవంతమైన అమలుకు తదుపరి చర్యలు అవసరం. - మహేశ్ జైసింగ్, బీఎమ్ఆర్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ ఎంపీలు బాధ్యతగా వ్యవహరిస్తారని... జీఎస్టీ బిల్లులో మార్పులు ప్రభుత్వ అంకితభావాన్ని తెలియజేస్తోంది. ప్రజాప్రతినిధులు దేశ ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. - సచిన్మీనన్, కేపీఎంజీ పార్ట్నర్ జీఎస్టీలోకి లిక్కర్, పెట్రోల్.. అదనంగా1% పన్ను విధింపుతో మొత్తం సరఫరా వ్యవస్థ వ్యయం పెరిగి పోతుంది. దీన్ని తొలగించడం మంచి నిర్ణయం. లిక్కర్, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం రాష్ట్రాల ప్రయోజనాల కోణంలో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో ఇవీ జీఎస్టీలోకి వచ్చి చేరతాయి. - అనితా రస్తోగి, పీడబ్ల్యూసీ పార్ట్నర్ -
నెల రోజులు గడువివ్వండి
♦ ఆర్థిక ఫలితాల వెల్లడికి యూబీహెచ్ఎల్ అభ్యర్థన ♦ మాల్యాపై కేసులతో అనిశ్చితి ఉందంటూ వినతి న్యూఢిల్లీ: యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్) ఆర్థిక ఫలితాల వెల్లడికి నెల రోజుల గడువు కోరింది. చైర్మన్ విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు, డెట్ రికవరీ ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున 2015-16 ఆర్థిక ఫలితాల వెల్లడికి నెల రోజుల గడవు కావాలని అభ్యర్థించింది. ఈ మేరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు యూబీహెచ్ఎల్ సమాచారం అందించింది. సెబి రెగ్యులేషన్స్, 2015 ప్రకారం ఏ కంపెనీ అయినా ఆర్థిక సంవత్సరం ముగిసిన రెండు నెలల్లోగా ఆ సంవత్సర ఫలితాలను వెల్లడించాలి. అసాధారణ పరిస్థితులున్నాయి... తమ గ్రూప్ సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పలు బ్యాంక్‌లకు రుణాలు చెల్లించాల్సి ఉందని, ఈ విషయమై ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంక్‌ల కన్సార్షియానికి తమ చైర్మన్ విజయ్ మాల్యా ఒక సెటిల్మెంట్ ఆఫర్‌ను ఇచ్చారని యూబీహెచ్ఎల్ ఆ లేఖలో పేర్కొంది. ‘‘సంస్థ ఆస్తుల్లో కొన్ని విక్రయించడం ద్వారా ఈ ఆఫర్లో కొంత మొత్తాన్ని చెల్లిస్తాం. డీఆర్టీ తొలి విచారణ వచ్చే నెల 2న జరుగుతుంది. అందుకే ఆర్థిక ఫలితాల వెల్లడికి నెలరోజుల గడువు అడుగుతున్నాం’’ అని యూబీహెచ్ఎల్ వివరించింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 14% అప్
♦ మార్చి క్వార్టర్లో రూ.1,926 కోట్లు... ♦ ఆదాయం రూ.10,698 కోట్లు; 15 శాతం వృద్ధి ♦ సీక్వెన్షియల్‌గా మాత్రం లాభంలో వృద్ధి 0.3 శాతమే ♦ షేరుకి రూ.6 చొప్పున డివిడెండ్ న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురిచేశాయి. జనవరి-మార్చి త్రైమాసికానికి(2015-16) కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,926 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.1,683 కోట్లతో పోలిస్తే 14.4 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా లైఫ్‌సెన్సైస్, ప్రజా సేవలు, టెలికం విభాగాల ఆదాయం పుంజుకోవడం లాభాలు పెరిగేందుకు దోహదం చేసింది. ఇక మొత్తం ఆదాయం కూడా మార్చి క్వార్టర్లో 15.4 శాతం వృద్ధి చెంది రూ.9,267 కోట్ల నుంచి రూ.10,698 కోట్లకు ఎగబాకింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటూవస్తోంది. అయితే, కంపెనీల చట్టం-2013 నిబంధనల మేరకు ఇకపై ఇతర కంపెనీల మాదిరిగానే ఏప్రిల్-మార్చి కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించనుంది. సీక్వెన్షియల్‌గా చూస్తే... డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో లాభం రూ.1,920 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) మార్చి త్రైమాసికంలో వృద్ధి 0.3 శాతం మాత్రమే నమోదైంది. ఆదాయం సైతం 3.4 శాతం మాత్రమే(డిసెంబర్ క్వార్టర్లో రూ.10,341 కోట్లు) పెరిగింది. పరిశ్రమ విశ్లేషకులు హెచ్‌సీఎల్ టెక్ సగటున రూ.1,963 కోట్ల నికర లాభాన్ని(సీక్వెన్షియల్‌గా 2.2 శాతం వృద్ధి), రూ.10,805 కోట్ల ఆదాయాన్ని(4.5 శాతం వృద్ధి) ఆర్జించవచ్చని అంచనా వేశారు. అయితే, కంపెనీ ఫలితాలు ఈ అంచనాలను అందుకోలేకపోయాయి. మార్చితో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ కొత్తగా 25 కాంట్రాక్టులను చేజిక్కించుకుంది. వీటి మొత్తం విలువ 4 బిలియన్ డాలర్లకుపైనే ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా పేర్కొన్నారు. ఒక్క మార్చి క్వార్టర్‌లోనే 2 బిలియన్ డాలర్ల విలువైన 7 కాంట్రాక్టులు లభించినట్లు ఆయన వెల్లడించారు. బియాండ్ డిజిటల్, ఐఓటీ, నెక్స్ట్ జెన్ ఐటీఓ వంటి పరిజ్ఞానాలపై తాము పెడుతున్న పెట్టుబడులు ఆదాయాల జోరుకు చేదోడుగా నిలుస్తున్నాయని ఆయన చెప్పారు. కాగా, మార్చి క్వార్టర్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదాయం 1.3 శాతం తగ్గగా.. లైఫ్‌సెన్సైస్, హెల్త్‌కేర్ విభాగాల నుంచి ఆదాయం 6.4 శాతం, 7.1 శాతం చొప్పున వృద్ధి చెందిందని గుప్తా వెల్లడించారు. టెక్సాస్‌లో డిజైన్ థింకింగ్, ప్రాసెస్ డిజిటైజేషన్ ల్యాబ్‌ను నెలకొల్పుతున్నామని.. అదేవిధంగా మధురై, లక్నోలలో డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా తెలిపారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుకి కంపెనీ రూ. 6 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ♦ డాలర్ల రూపంలో చూస్తే నికర లాభం మార్చి క్వార్టర్లో 5.5 శాతం ఎగబాకి 285.1 మిలియన్లుగా నమోదైంది. ఆదాయం కూడా 6.5 శాతం వృద్ధి చెంది 1.58 బిలియన్ డాలర్లకు చేరింది. ♦ 2015-16 పూర్తి ఏడాదికి లాభం 0.7 శాతం పెరిగి రూ.7,354 కోట్లుగా నమోదైంది. ఆదాయం 14.6 శాతం ఎగసి రూ.40,914 కోట్లకు చేరింది. ♦ మార్చి క్వార్టర్లో స్థూలంగా 9,280 మంది సిబ్బందిని హెచ్‌సీఎల్ టెక్ నియమించుకుంది. అయితే, 8,080 మంది వలసపోవడంతో నికరంగా 1,200 మంది జతయ్యారు. దీంతో మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,04,896కు చేరింది. ♦ ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 17.3 శాతానికి చేరింది(డిసెంబర్ క్వార్టర్లో 16.7 శాతం). ♦ కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 4.51 శాతం క్షీణించి రూ.800 వద్ద స్థిరపడింది. -
యాక్సిస్ బ్యాంక్ క్యూ4 లాభం రూ.2,154 కోట్లు
ముంబై: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చాయి. ఎన్పీఏ కేటాయింపులకు సంబంధించి కొన్ని కంపెనీలను రిజర్వుబ్యాంక్ మినహాయించడంతో ఈ దఫా బ్యాంకుల ఫలితాలు బావుంటాయన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. ఇందుకు భిన్నంగా యాక్సిస్ బ్యాంక్ నికరలాభం మార్చితో ముగిసిన క్యూ4లో క్షీణించి రూ. 2,154 కోట్లకు దిగింది. అధిక కేటాయింపులకు తోడు భవిష్యత్తులో ఏర్పడే మొండి బకాయిల కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టడంతో లాభాలు తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం బ్యాంకు నికరలాభం 12 శాతం పెరుగుదలతో 8,349 కోట్లకు చేరింది. తాజా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 20% ఎగిసి రూ. 4,553 కోట్లకు పెరిగింది. ఇతర ఆదాయం మాత్రం స్వల్ప పెరుగుదలతో రూ. 2,694 కోట్లకు చేరింది. కొత్త ఎన్పీఏలు తగ్గాయ్..: క్యూ4లో కొత్తగా రూ. 1,474 కోట్ల మొండి బకాయిలు యాడ్ అయ్యాయని, దాంతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో జతైన మొండి బకాయిలు రూ. 7,345 కోట్లకు చేరినట్లు బ్యాంక్ పేర్కొంది. క్యూ3లో 2,082 కోట్ల కొత్త ఎన్పీఏలతో పోలిస్తే, తాజా త్రైమాసికంలో తగ్గాయి. గత త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో తమ ఆస్తుల నాణ్యత స్థిరంగా వుందని, అయితే భవిష్యత్తులో సవాళ్లు ఎదురుకావొచ్చని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధర్ చెప్పారు. బీఎస్ఈలో మంగళవారం యాక్సిస్ బ్యాంక్ షేరు ధర 2.2 శాతం లాభపడి రూ.480 వద్ద ముగిసింది. -
ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి
మార్కెట్‌కు దిశా నిర్దేశం * ఇన్ఫోసిస్ శుభారంభం * నేడు టీసీఎస్ ఫలితాలు... * ఈ వారంలోనే విప్రో,హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు కూడా... న్యూఢిల్లీ: కంపెనీల గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు సోమవారం వెలువడే టోకు ధరల(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి, ముడి చమురు ధరల కదలికలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(ఏప్రిల్ 19) సెలవు కావడంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అంబేద్కర్ జయంతి సందర్బంగా గురు, శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో గత వారంలో మూడు రోజులే ట్రేడింగ్ జరిగింది. ఇన్ఫోసిస్, టీసీఎస్లపై దృష్టి అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినందున ఇన్ఫోసిస్, వ్యాపార రహస్యాల చోరీ కేసులో అమెరికా ఫెడరల్ కోర్ట్ రూ.6,000 కోట్ల జరిమానా నిర్ణయం, క్యూ4 ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో టీసీఎస్ షేర్లపై సోమవారం అందరి దృష్టి పడనున్నదని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఇక ఈ వారంలోనే విప్రో(ఏప్రిల్ 20), ఇండస్‌ఇంద్ బ్యాంక్(21న), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(22న)లు క్యూ4 ఫలితాలను ప్రకటిస్తాయి. వెలుగులో వ్యవసాయ షేర్లు రానున్న రోజుల్లో కంపెనీల ఆర్థిక ఫలితాలే మార్కెట్‌కు కీలకమని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా పేర్కొన్నారు. సగటు కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల కారణంగా వ్యవసాయ షేర్లపై దృష్టి ఉంటుందని వివరించారు. వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాలు, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రోత్సాహకర పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, చైనా గణాంకాలు ఆశావహంగా ఉండడం, రష్యా, సౌదీ అరేబియాల మధ్య చమురు ఉత్పత్తి నియంత్రణ నిమిత్తమై ఒప్పందం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడం.. గత వారంలో మార్కెట్ సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొన్నారు. మూడు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు 4 శాతం వరకూ పెరిగాయి. సెన్సెక్స్ 953 పాయింట్లు (3.86 శాతం)లాభపడి 25,627 పాయింట్లు, నిఫ్టీ 295 పాయింట్లు(3.91 శాతం) లాభపడి 7,850 పాయింట్ల వద్ద ముగిశాయి. వంద కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు... భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వరుసగా రెండో నెలలో కూడా కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు 130 కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టారు. -
స్టాక్స్ వ్యూ
టెక్ మహీంద్రా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.535 టార్గెట్ ధర: రూ.615 ఎందుకంటే: 1,690 కోట్ల డాలర్ల మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ వినూత్నమైన. వినియోగదారుడు కేంద్రంగా ఐటీ సర్వీసులను, సొల్యూషన్లను, కన్సల్టింగ్, ఎంటర్ప్రైజ్, టెలికాం సొల్యూషన్లను అందిస్తోంది. 390 కోట్ల డాలర్ల టెక్ మహీంద్రా కంపెనీ లక్షకు పైగా ఉద్యోగులతో 90 దేశాల్లో 788కి పైగా కంపెనీలకు తన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. వీటిల్లో కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం 9 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.రూ.720 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.786 కోట్లకు ఎగసింది. ఆదాయం రూ.5,488 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.6,615 కోట్లకు, ఇబిటా రూ.1,155 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,266 కోట్లకు పెరిగాయి. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.8.16గా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.3,492 కోట్లుగా ఉన్నాయి. ఈ క్యూ2లో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 788కు పెరిగింది. నార్డిస్ సర్వీసెస్, ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీ నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్(ఏసీజీఎస్) డెవలప్ చేయడానికి గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీనే ఎంపిక చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్డ్ సర్వీసెస్ భాగస్వామిగా టెక్ మహీంద్రాను ఏషియన్ టెలికాం కంపెనీ ఎంచుకుంది. డేటా సర్వీసుల టెస్టింగ్,డిజైన్, యాక్టివేట్ వంటి కార్యకలాపాలకు ఒక ఉత్తర అమెరికా టెలికాం కంపెనీ కూడా టెక్ మహీంద్రానే ఎంచుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 45 శాతం, నికర లాభం 43 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇటీలనే ఆర్బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లెసైన్స్‌ను పొందింది. సీఈఎస్ఈ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.542 టార్గెట్ ధర: రూ.668 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. విద్యుత్తు టారిఫ్‌లు 8 శాతం పెరగడంతో ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.1,757 కోట్లకు పెరిగింది. విద్యుత్తు కొనుగోలు వ్యయం 58 శాతం, ఉద్యోగుల వ్యయం 7 శాతం చొప్పున పెరగడంతో ఇబిటా మార్జిన్లు స్వల్పంగా తగ్గి 24 శాతానికి పడిపోయాయి. ఇంధన వ్యయం 20 శాతం, ఇతర వ్యయాలు 14 శాతం చొప్పున తగ్గాయి. 2,325 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి కోల్‌కత, హౌరాలకు డిస్ట్రిబ్యూషన్ లెసైన్స్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 15.5 శాతం సాధిస్తోంది. ఏడాదికి రూ.500 కోట్ల నగదు నిలకడగా ఆర్జిస్తోంది. గత ఆరేళ్లుగా తన రిటైల్ విభాగం స్పెన్సర్స్‌లో రూ.1,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఇలా పెట్టుబడులు పెట్టడం సీఈఎస్సీ నగదు స్థితిగతులపై ప్రభావం చూపినప్పటికీ, స్పెన్సర్ వ్యాపారం మెరుగుపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లోనే స్పెన్సర్స్ ఇబిటా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో స్పెన్సర్స్ ఆదాయం 23 శాతం, స్టోర్ ఏరియా 14 శాతం, స్టోర్ సేల్స్ 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2012-13లో ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీలో 57% వాటాను రూ.454 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ కంపెనీ రుణభారం తగ్గడానికి, మార్జిన్లు పెరగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. ఈ ఏడాదిమార్చి నాటికి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ స్థూల రుణం 11 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 5 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్న కంపెనీగా మారనున్నది. 600 మెగావాట్ల చంద్రపూర్ ప్రాజెక్ట్‌కు ఇటీవలనే అనుమతులు సాధించింది. హల్దియా ప్లాంట్ ఇటీవలనే కార్యకలాపాలు ప్రారంభించింది. అన్ని వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి సీఈఎస్సీ టార్గెట్ ధరను నిర్ణయించాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
తెలుగు రాష్ట్ర కంపెనీల ఆర్థిక ఫలితాలు
తగ్గిన మధుకాన్ లాభాలు మధుకాన్ ప్రాజెక్ట్స్ సెప్టెం బర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ. 140 కోట్ల ఆదాయంపై రూ. 4 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 255 కోట్ల ఆదాయంపై రూ. 10 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో వడ్డీ భారం రూ. 25 కోట్ల నుంచి 29 కోట్లకు పెరిగింది. నష్టాల్లోనే వైస్రాయ్ హోటల్స్ వైస్రాయ్ హోటల్స్ ఈ త్రైమాసికంలోనూ నష్టాలనే ప్రకటించింది. ఈ మూడు నెలల కాలానికి రూ. 19 కోట్ల ఆదాయంపై రూ. 2.44 కోట్ల నష్టాలను ప్రకటించగా, గతేడాది ఇదే కాలానికి రూ. 20 కోట్ల ఆదాయంపై రూ. 2.55 కోట్ల నష్టాల్లో ఉంది. వడ్డీభారం స్థిరంగా రూ. 6కోట్లుగా ఉంది. స్టీల్ ఎక్స్ఛేంజ్ ఆదాయం రూ. 427 కోట్లు స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇం డియా ఈ ద్వితీయ త్రైమాసికంలో రూ. 427 కోట్ల ఆదాయంపై రూ. 7 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 388 కోట్ల ఆదాయంపై నికర లాభం రూ. 7 కోట్లు. వడ్డీ భారం పెరగడం లాభాలు తగ్గడానికి కారణంగా కంపెనీ తెలిపింది. తగ్గిన అంబికా ఆదాయం అంబికా అగర్బత్తి ఆదాయంలో స్వల్ప క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 29 కోట్లుగా ఉన్న ఆదాయం ఇప్పుడు రూ. 27 కోట్లకు పరిమితమైంది. లాభాలు రూ. 30 లక్షల నుంచి రూ. 12 లక్షలకు తగ్గాయి. గాయత్రీ ప్రాజెక్ట్స్ నికర లాభం రూ. 7 కోట్లు సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీ య త్రైమాసికంలో గాయత్రీ ప్రాజెక్ట్స్ రూ. 317 కోట్ల ఆదాయంపై రూ. 7 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 306 కోట్ల ఆదాయంపై రూ. 1.13 కోట్ల లాబాలను ఆర్జించింది. వడ్డీ భారం రూ. 40 కోట్ల నుంచి రూ. 35 కోట్లకు తగ్గింది. కేఎన్ఆర్ లాభం రూ. 55 కోట్లు కేఎన్ఆర్ కనస్ట్రక్షన్స్ ఈ మూడు నెలల కాలానికి రూ. 216 కోట్ల ఆదాయంపై రూ. 55 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 170 కోట్ల ఆదాయంపై రూ. 14 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షాకాలంలో వడ్డీ భారం స్థిరంగా రూ. 3 కోట్లుగా ఉంది. స్థిరంగా లోకేష్ మెషీన్స్ లోకేష్ మెషీన్స్ ద్వితీయ త్రైమాసికంలో రూ. 30 కోట్ల ఆదాయంపై రూ. 1.33 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 31 కోట్ల ఆదాయంపై రూ. 77 లక్షల లాభాలను నమోదు చేసింది. సమీక్షా కాలంలో వడ్డీ భారం రూ. 4.47 కోట్ల నుంచి రూ. 3.89 కోట్లకు తగ్గింది. -
కొనసాగుతున్న నష్టాలు..
ఆరో రోజూ క్షీణ పథంలో స్టాక్ మార్కెట్ అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 26,559 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8,051 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు జారిపోయింది. జూన్ తర్వాత స్టాక్ మార్కెట్ వరుసగా ఇన్ని రోజులు నష్టాలపాలవడం ఇదే మొదటిసారి. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 912 పాయింట్లు నష్టపోయింది. దిగ్గజ వాహన కంపెనీల అక్టోబర్ అమ్మకాలు బాగా ఉన్నప్పటికీ, సెంటిమెంట్‌కు ఊపునివ్వడంలో విఫలమయ్యాయి. మరోవైపు అక్టోబర్‌లో భారత తయారీ రంగ వృద్ధి రెండేళ్ల కనిష్టానికి పతనమైందని ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించడం, చైనా ఫ్యాక్టరీ, సేవల గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండడం.. ఈ అంశాలన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళనను మరింత పెంచాయి. ఈ అంశాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం, బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు..ప్రతికూల ప్రభావం చూపించాయి. ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు, ఇన్ఫోసిస్ రికవరీ కారణంగా చివరి గంట ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు కోలుకున్నాయి. అక్టోబర్‌లో అమ్మకాలు 9 శాతం తగ్గడంతో బజాజ్ ఆటో షేర్ 5 శాతం క్షీణించి రూ.2,432 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. -
పడగొట్టిన ఫలితాలు
* సెన్సెక్స్ 109 పాయింట్లు పతనం * 27,362 పాయింట్ల వద్ద ముగింపు ముంబై: బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల కోత కారణంగా ఆసియా మార్కెట్లు లాభపడినా, భారతీ ఎయిర్టెల్, హెచ్‌డీఎఫ్‌సీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ రెండు నెలల గరిష్ట స్థాయి నుంచి పతనమైంది. మంగళవారం నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాటు సమావేశం కానుండడం, అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనుండడం వంటి కారణాల వల్ల బీఎస్ఈ సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో 27,362 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించి 8,261పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ, ఆయిల్, గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అయితే వాహన, లోహ షేర్లలో కొనుగోళ్ల కారణంగా నష్టాలు పరిమితయ్యాయి. -
బ్లూచిప్స్ ఫలితాలపై దృష్టి..
న్యూఢిల్లీ: పలు బ్లూచిప్ కంపెనీలు ప్రకటించే రెండో త్రైమాసికం(క్యూ2) ఆర్థిక పలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క, దసరా పండుగ నేపథ్యంలో గురువారం మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. గత వారం వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు కూడా సోమవారం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంచనాలను మించి రిలయన్స్ క్యూ2లో రికార్డు లాభాన్ని(రూ.6,720 కోట్లు) ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ప్రధాన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడియా సెల్యులార్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, హీరోమోటో కార్ప్, బజాజ్ ఆటో, విప్రో, కెయిర్న్ ఇండియా వంటివి ఉన్నాయి. మరోపక్క, బిహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ సరళిని కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని, దీంతో పాటు గ్లోబల్ మార్కెట్ల కదలికలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నట్లు ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర హెచ్చుతగ్గులు, కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు సమీప కాలంలో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఇక విదేశీ పరిణామాల విషయానికొస్తే.. నేడు(సోమవారం) చైనా ఈ ఏడాది మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలను వెల్లడించనుంది. గత వారం మార్కెట్... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా వేయొచ్చనే అంచనాలు బలపడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారంలోనూ లాభాలను కొనసాగించింది. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 27,214 వద్ద స్థిరపడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 48 పాయింట్ల లాభంతో 8,238 వద్ద ముగిసింది. మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల జోరు... విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మళ్లీ దేశీ మార్కెట్లో పెట్టుబడుల జోరును పెంచుతున్నారు. గత రెండు నెలల్లో భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో దాదాపు రూ.17,000 కోట్ల నిధులను నికరంగా వెచ్చించారు. ఈ నెల ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.3,295 కోట్లు, డెట్(బాండ్స్) మార్కెట్లో రూ.13,695 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఆర్బీఐ రేట్ల కోత, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా అంచనాలు దీనికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. విదేశీ మార్కెట్ల భారీ పతనం కారణంగా ఆగస్ట్‌లో రూ.17,524 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.5,784 కోట్లను దేశీ మార్టెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. -
టీసీఎస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్.. ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్(2015-16, క్యూ2)లో కంపెనీ రూ.6,085 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో నమోదైన రూ.5,244 కోట్లతో పోలిస్తే లాభం 16 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.23,816 కోట్ల నుంచి రూ.27,165 కోట్లకు పెరిగింది. ఇక డాలరు రూపంలో చూస్తే... ఆదాయం 3 శాతం పెరిగి 4.156 బిలియన్లుగా నమోదైంది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 3.9 శాతం వృద్ధి చెందింది. కాగా, పోటీ కంపెనీ ఇన్ఫోసిస్ డాలరు ఆదాయాల వృద్ధి(6 శాతం, స్థిర కరెన్సీ లెక్కన 6.9 శాతం)తో పోల్చుకుంటే టీసీఎస్ వెనుకబడటం గమనార్హం. ఇక మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ2లో టీసీఎస్ రూ.6,052 కోట్ల నికర లాభాన్ని, రూ.27,230 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా... ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1)లో కంపెనీ నికర లాభం రూ.5,710 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 6.5 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆదాయం కూడా క్రితం త్రైమాసికంతో(రూ.25,668 కోట్లు) పోలిస్తే 5.8 శాతం పెరిగింది. ఇతర ముఖ్యాంశాలు... * రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ.5.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. * క్యూ2లో టీసీఎస్ నిర్వహణ మార్జిన్లు 27.1 శాతంగా నమోదయ్యాయి. * జూలై-సెప్టెంబర్ కాలంలో స్థూలంగా 25,186 మంది సిబ్బందిని కంపెనీ నియమించుకుంది. అయితే, 14,501 మంది వలసపోవడంతో నికర నియామకాలు 10,685కే పరిమితమయ్యాయి. దీంతో సెప్టెంబర్ చివరినాటికి టీసీఎస్, దాని అనుబంధ సంస్థల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,35,620కి చేరింది. * కంపెనీలో ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) సెప్టెంబర్ త్రైమాసికంలో 16.2 శాతంగా నమోదైంది. * సెప్టెంబర్ క్వార్టర్లో 25 వేల మందిని కొత్తగా నియమించుకోవడం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా నిలిచిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్, హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ చెప్పారు. * {పస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ లక్ష్యాన్ని కూడా టీసీఎస్ పెంచింది. 60 వేల మందిని కొత్తగా నియమించుకోవాలని గతంలో నిర్ణయించగా.. దీన్ని తాజాగా 75 వేలకు పెంచింది. గడిచిన కొద్ది క్వార్టర్లలో వ్యాపారం పుంజుకోవడంతో పాటు వలసలను తగ్గించడంలో భాగంగా కంపెనీ ఈ చర్యలు చేపడుతోంది. * క్యూ2లో 100 మిలియన్ డాలర్లకు మించిన కాంట్రాక్టులు మూడు, 10 మిలియన్ డాలర్లకు పైబడిన ఆరు డీల్స్‌ను కంపెనీ దక్కించుకుంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో స్వల్పంగా 0.19 శాతం లాభపడి రూ.2,597 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. స్థిర కరెన్సీ ప్రాతిపదికన క్యూ2లో పటిష్టమైన వృద్ధిని నమోదుచేశాం. ముఖ్యంగా కాంట్రాక్టుల అమల్లో వేగం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, రిటైల్, లైఫ్‌సెన్సైస్ రంగాలకు చెందిన వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా మెరుగైన పనితీరు దీనికి దోహదం చేసింది. కీలకమైన ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి ఆదాయాలు పుంజుకోవడం కూడా తాజా ఫలితాల్లో ప్రతిబింబించింది. భారత్‌తో పాటు లాటిన్ అమెరికా ఇతరత్రా వర్ధమాన మార్కెట్ల వ్యాపారాల్లోనూ మంచి పురోగతి నమోదైంది. ఆదాయాల్లో డిజిటల్ విభాగం నుంచి 13 శాతం వృద్ధిని సాధించాం. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ ఎండీ, సీఈఓ -
అంచనాలు మించిన ఇన్ఫీ
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో ఆకట్టుకుంది. మరోపక్క, కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి డాలరు రూపంలో ఆదాయ అంచనా(గెడైన్స్)ను తగ్గించింది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) రాజీవ్ బన్సల్ కంపెనీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించడం ఈసారి ఫలితాల్లో ఆశ్చర్యకరమైన అంశం. క్యూ2లో రూ.3,398 కోట్ల నికర లాభం * వార్షికంగా 9.8%... త్రైమాసికంగా 12% అప్ * మొత్తం ఆదాయం రూ.15,635 కోట్లు; * వార్షికంగా 17%.. త్రైమాసికంగా 8.9% వృద్ధి * డాలర్ ఆదాయ గెడైన్స్ తగ్గింపు... * సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా... * ఒక్కో షేరుకి రూ.10 మధ్యంతర డివిడెండ్... బెంగళూరు: ఆకర్షణీయమైన ఫలితాలతో ఇన్ఫీ బోణీ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో రూ.3,398 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో నమోదైన రూ.3,090 కోట్ల లాభంతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 9.8 % వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 17% దూసుకెళ్లి రూ.13,342 కోట్ల నుంచి రూ.15,635 కోట్లకు ఎగబాకింది. ప్రధానంగా పటిష్టమైన ఆదాయ వృద్ధి, నిర్వహణ పనితీరు క్యూ2లో కంపెనీ మెరుగైన రాబడులకు దోహదం చేసింది. కాగా, డాలరు రూపంలో సెప్టెంబర్ క్వార్టర్‌కు ఇన్ఫీ ఆదాయం 6 శాతం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన 6.9 శాతం వృద్ధి) ఎగబాకి 2.392 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన 16 క్వార్టర్లలో ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. ఇక మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ2లో కంపెనీ ఆదాయం రూ.15,210 కోట్లుగా, లాభం రూ.3,244 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా ఇలా: ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1)లో రూ.3,030 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 12.1% ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా రూ.14,354 కోట్లతో పోలిస్తే 8.9% వృద్ధి చెందింది. గెడైన్స్ అటూఇటూ... డాలరు రూపంలో ప్రస్తుత 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గెడైన్స్‌ను ఇన్ఫోసిస్ తగ్గించింది. గతంలో ఆదాయ వృద్ది 7.2-9.2 శాతంగా అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 6.4%-8.4 శాతానికి పరిమితం చేసింది. ముఖ్యంగా డాలరుతో వివిధ ప్రధాన కరెన్సీల విలువల్లో తీవ్ర ఒడిదుడుకులే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. అయితే, స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ గెడైన్స్‌ను గతంలో పేర్కొన్నట్లుగానే 10-12 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. అయితే, ప్రస్తుత పూర్తి ఏడాదికి రూపాయల్లో ఆదాయ గెడైన్స్(కన్సాలిడేటెడ్)ను కంపెనీ 11.5-13.5 శాతం స్థాయి నుంచి 13.1-15.1 శాతానికి పెంచడం విశేషం. గతేడాది కంపెనీ మొత్తం ఆదాయం రూ.53,319 కోట్లుగా నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... * రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకి కంపెనీ రూ.10 చొప్పున(200 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. * క్యూ2లో కంపెనీ మార్జిన్లు 1.53 శాతం వృద్ధి చెంది 25.53 శాతంగా నమోదయ్యాయి. * సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ మొత్తం 82 కొత్త క్లయింట్లను జతచేసుకుంది. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 1,011కు చేరింది. కాగా, కొత్తవాటిలో 7.5 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు మూడు, 5 కోట్ల డాలర్ల కాంట్రాక్టు ఒకటి ఉంది. * 2015 ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్‌ను కూడా కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం కంపెనీ మొత్తం షేర్లలో 2 శాతానికి మించకుండా ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్) కింద ఉద్యోగులకు షేర్లు జారీ చేయాలని నిర్ణయించింది. * సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ వద్ద రూ.32,099 కోట్ల నగదు, తత్సంబంధ నిల్వలు ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర ఒకానొక దశలో 2.9 శాతం ఎగబాకి కొత్త గరిష్ట స్థాయి అయిన రూ.1,203ను తాకింది. అయితే, చివరకు 3.88 శాతం క్షీణించి రూ.1,123 వద్ద ముగిసింది. కంపెనీకి మరో టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై... ఇన్ఫీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా చేసినట్లు ఇన్ఫోసిస్ సోమవారం ఫలితాల సందర్భంగా వెల్లడించింది. ఆయన స్థానంలో ఎం.డి. రంగనాథ్ నేటి(మంగళవారం) నుంచి బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 2000వ సంవత్సరంలో రంగనాథ్ ఇన్ఫీలో చేరారు. అయితే, బన్సల్ ప్రస్తుత పదవి నుంచి వైదొలగుతున్నప్పటికీ.. సీఈఓ సిక్కా, డెరైక్టర్ల బోర్డుకు ఈ ఏడాది చివరివరకూ సలహాదారుగా కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘కంపెనీ వృద్ధికి విశేష సేవలందించిన రాజీవ్‌తో నేను 16 నెలల పాటు కలిసి పనిచేశా. ఆయన అపారమైన నైపుణ్యం గల వ్యక్తి. రాజీనామా చేయాలన్న రాజీవ్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. భవిష్యత్తులో ఆయన చేయబోయే విధుల్లో గొప్ప విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నా’ అని సీఈఓ విశాల్ సిక్కా వ్యాఖ్యానించారు. ఇన్ఫీలాంటి గొప్ప సంస్థలో పనిచేయడం తన అదృష్టమని.. అదేవిధంగా సిక్కా సారథ్యంలో కంపెనీ ఎంతో ప్రగతిని సాధించిందని బన్సల్ వ్యాఖ్యానించారు. 2013 తర్వాత ఇన్ఫీని వీడిన మూడో హైప్రొఫైల్ సీఎఫ్ఓ రాజీవ్ కావడం గమనార్హం. అంతక్రితం మోహన్‌దాస్ పాయ్, వి. బాలకృష్ణన్‌లు కంపెనీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. క్యూ2లో కంపెనీ మెరుగైన పనితీరును నమోదుచేయడం ఆనందంగా ఉంది. డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్ తగ్గింపునకు కరెన్సీ ఒడిదుడుకులే కారణం. ప్రస్తుతం మేం అనుసరిస్తున్న ‘న్యూ అండ్ రెన్యూ’ వ్యూహాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఏడాది 10-12 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమన్న నమ్మకం ఉంది. - విశాల్ సిక్కా,ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ ఈ ఏడాది 20 వేల క్యాంపస్ నియామకాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌ల నుంచి మొత్తం 20 వేల మంది గ్యాడ్యుయేట్లను ఫ్రెషర్స్‌గా నియమించుకోనున్నట్లు ఇన్ఫీ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు వెల్లడించారు. వారికి శిక్షణ కాలంలో రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీని చెల్లిస్తామని, నైపుణ్యాలు, అవసరాలను బట్టి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా కంపెనీలో చేర్చుకుంటామని తెలిపారు. కాగా, స్థూలంగా జూలై-సెప్టెంబర్ కాలంలో కంపెనీ 17,595 మంది ఉద్యోగులను నియమించుకుంది. 9,142 మంది సిబ్బంది వలసపోవడంతో నికరంగా 8.453 మంది ఉద్యోగులు జతయ్యారు. దీంతో సెప్టెంబర్ చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,87,976కు చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ2లో 19.9 శాతానికి పెరిగింది. క్యూ1లో ఇది 19.2 శాతంగా ఉంది. అయితే, గతేడాది క్యూ2లో 24.8 శాతం అట్రిషన్ రేటుతో పోలిస్తే భారీగా తగ్గడం విశేషం. -
తోషిబాకు 32 కోట్ల డాలర్ల నష్టం
టోక్యో: లాభాలను పెంచి చూపిన కుంభకోణంలో చిక్కుకున్న జపాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తోషిబా గత ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలను సవరించింది. ముందుగా 120 బిలియన్ యెన్ల వార్షిక లాభాలు అంచనా వేసినప్పటికీ.. సవరించిన దాని ప్రకారం 37.8 బిలియన్ యెన్ల మేర (సుమారు 31.8 కోట్ల డాలర్ల) నష్టాన్ని ప్రకటించింది. అయితే, నిర్వహణ లాభాలు మాత్రం యథాతథంగా 170 బిలియన్ యెన్ల మేర ఉన్నట్లు వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాలు ప్రకటించడం లేదని పేర్కొంది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థ లాభాలను ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల మేర పెంచి చూపించినట్లు వెల్లడి కావడంతో తోషిబా ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. పలువురు అధికారులు వైదొలిగారు. దీంతో తోషిబా ఆర్థిక పరిస్థితులను కంపెనీయేతర కమిటీ మదింపు చేసింది. -
మార్కెట్లపై ఆ మూడింటి ప్రభావం !
- ఫెడ్ రేట్ల పెంపు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, బిహార్ ఎన్నికలు - బీఓఎఫ్ఏ-ఎంఎల్ తాజా నివేదిక న్యూఢిల్లీ: ఫెడ్ రేట్ల పెంపు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, బిహార్ ఎన్నికలు భారత మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ-ఎంఎల్) తాజా నివేదిక పేర్కొంది. వచ్చే నెల 17న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అది భారత్‌కు ప్రయోజనకరమేనని. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీకి సూచనగా ఫెడ్ రేట్ల పెంపును పరిగణించాలని వివరించింది. అమెరికా వృద్ధి ఎగుమతులకు ఊతం ఇస్తుందని, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు నియంత్రణలో ఉంటాయని, రూపాయి బలపడటానికి తోడ్పడుతుందని పేర్కొంది. ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపును మార్కెట్ స్వీకరిస్తే, వచ్చే నెల 29న తన పాలసీ సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించడానికి మార్గం సుగమమవుతుందని వివరించింది. ఒక వేళ ఫెడ్ వడ్డీరేట్లను పెంచకపోతే, ద్రవ్యోల్బణ ఒత్తిడులు కారణంగా డిసెంబర్‌లోపే ఆర్బీఐ పాలసీ రేట్లను తగ్గించవచ్చని పేర్కొంది. కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు విదేశీ నిధుల ప్రవాహం భారత్‌లోకి రావడానికి తోడ్పడుతాయ ని, బిహార్ ఎన్నికల ఫలితాలు సంస్కరణల వేగం పై ప్రభావం చూపుతాయని నివేదిక పేర్కొంది. సెన్సెక్స్ 517 పాయింట్లు అప్ - 2 శాతం పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీలు - ప్రభావం చూపిన షార్ట్ కవరింగ్ - అమెరికా వడ్డీరేట్ల పెంపు లేదనే సంకేతాలు కూడా... - 517 పాయింట్ల లాభంతో 26,231కు సెన్సెక్స్ - 157 పాయింట్ల లాభంతో 7,949కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబరులో వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న వార్తలకు... ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు తోడయింది. ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టులకు గురువారం చివరిరోజు కావటంతో ట్రేడర్లంతా భారీ ఎత్తున షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునే పనిలో పడ్డారు. ఫలితం... సెన్సెక్స్ రయ్యిమంది. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఇన్ఫోసిస్ వంటి అధిక వెయిటేజీ ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగటంతో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2 శాతం పెరిగి... సెన్సెక్స్ 26,000 పాయింట్లను, నిఫ్టీ 7,900 పాయింట్లను అధిగమించాయి. చివరికి సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 26,231 పాయింట్ల వద్ద... నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 7,949 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక్క సెషన్లో సెన్సెక్స్ ఈ స్థాయిలో లాభపడటం గడిచిన రెండు వారాల్లో ఇదే తొలిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ రికవరీ ర్యాలీకి కన్సూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఫార్మా రంగాల్లోని బ్లూ చిప్ షేర్ల మద్దతు లభించింది. రేట్ల పెంపు ఇప్పుడే కాదు... బుధవారం అమెరికా స్టాక్ సూచీలు దాదాపు 4 శాతం పెరిగాయి. ఈ స్థాయిలో సూచీలు పెరగటం గడిచిన నాలుగేళ్లలో ఇదే ప్రథమం. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రెసిడెంట్ విలియం డడ్లీ సెప్టెంబర్‌లో వడ్డీరేట్ల పెంపు లేదని సూచనప్రాయంగా వెల్లడించడమే దీనికి కారణం. ముడి చమురు ధరలు తగ్గుతుండడం, చైనా భయాలు కొనసాగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో రేట్ల కోత ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో చైనా భయాలు వెనక్కివెళ్లిపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 26,303 గరిష్ట స్థాయిని తాకింది. ‘స్మార్ట్’ కంపెనీలకు లాభాలు... స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద 98 నగరాల పేర్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించడంతో వీటితో సంబంధం ఉన్న ఎన్బీసీసీ, డి లింక్, స్మార్ట్ లింక్ నెట్వర్క్, హెచ్‌సీసీ, హెచ్‌డీఐఎల్ షేర్లు 2-9 శాతం రేంజ్లో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో కెయిర్న్ ఇండియా 7.6 శాతం ఎగసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో హెచ్డీఎఫ్సీ అత్యధికంగా లాభపడింది. నెల రోజుల్లో 19 శాతం పతనం కావడం, స్టాండర్డ్ లైఫ్ పీఎల్సీతో జీవిత బీమా జాయింట్ వెంచర్‌ను నిర్వహిస్తున్న కంపెనీ అనుబంధ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు రానున్నదన్న కారణాల వల్ల హెచ్డీఎఫ్సీ 8.4 శాతం లాభంతో రూ.1,195 వద్ద ముగిసింది. వేదాంత, టాటా స్టీల్, లుపిన్, సిప్లా, ఐటీసీ, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు 2.6-6.6 శాతం రేంజ్లో పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 6 శాతం పెరిగింది. వాహన షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఆటో 2.4 శాతం క్షీణించగా, టాటా మోటార్స్, హీరోమోటొకార్ప్, మారుతీ సుజుకీ కూడా నష్టపోయాయి. కొనసాగుతున్న విదేశీ విక్రయాలు... వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) అమ్మకాలను కొనసాగించారు. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కాగా టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,015 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.26,117 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,33,805 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,347 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.2,577 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఐదు రోజుల చైనా షాంఘై స్టాక్ సూచీ నష్టాలకు బ్రేక్ పడింది. ఈ సూచీ 5% పెరిగింది. అన్ని ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ఆసియా మార్కెట్ల దన్నుతో యూరప్ మార్కెట్లు భారీ లాభాల్లోనే ముగిశాయి. అమెరికా స్టాక్ సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అధ్వాన సిరీస్... గురువారంతో ముగిసిన ఆగస్టు సిరీస్ గత రెండేళ్లలో అత్యంత అధ్వానమైనదని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఆగస్టు సిరీస్‌లో నిఫ్టీ 5.3 శాతం, సెన్సెక్స్ 5.6 శాతం, బ్యాంక్ నిఫ్టీ 6.6 శాతం, సీఎన్ఎక్స్ మిడ్‌క్యాప్ 3.4 శాతం, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 6.3 శాతం చొప్పున నష్టపోయాయి. షార్ట్ కవరింగ్ కారణంగా రోల్ఓవర్లు పెరిగాయని, సెప్టెంబర్‌లో మరో భారీ పతనం ఉందనడానికి ఇదొక సూచిక అని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. -
ఎస్బీఐ లాభం రూ.3,692 కోట్లు
క్యూ1లో 10% వృద్ధి... - మొత్తం ఆదాయం 10 శాతం అప్; రూ.44,731 కోట్లు - మొండిబకాయిలు తగ్గుముఖం... ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.3,692 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,349 కోట్లతో పోలిస్తే లాభం 10.2 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా 10 శాతం వృద్ధి చెంది రూ.44,731 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఇతర ఆదాయం జోరందుకోవడం, మొండిబకాయిల తగ్గుదలతో కేటాయింపులు కూడా దిగిరావడం వంటివి లాభాలు పుంజుకోవడానికి దోహదం చేశాయి. కాగా, జూన్ క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) స్వల్పంగా 3.6 శాతం మాత్రమే వృద్ధి చెంది రూ.13,732 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం(వడ్డీయేతర) మాత్రం 19.7 శాతం దూసుకెళ్లి రూ.5,088 కోట్లకు చేరింది. ఫీజుల ఆదాయం(రూ.3,202 కోట్లు; 13 శాతం అప్) భారీగా పెరగడమే దీనికి కారణం. అయితే, దేశీ కార్యకలాపాలపై నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) క్యూ1లో 3.29 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎన్ఐఎం 3.54 శాతంగా ఉంది. దీనికి ప్రధానంగా బేస్ రేటు 30 బేసిస్ పాయింట్లు తగ్గడమే కారణమని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, సీఎఫ్ఓ అన్షులా కాంత్ పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్‌గా చూస్తే...: ఇతర అనుబంధ సంస్థలన్నింటితో కలిపి(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ఎస్బీఐ నికర లాభం క్యూ1లో రూ.4,714 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ1లో లాభం రూ.4,448 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 4 శాతంం పెరిగి... రూ. 60,621 కోట్ల నుంచి రూ.62,927 కోట్లకు చేరింది. మొండిబకాయిల తగ్గాయ్...: జూన్ క్వార్టర్లో బ్యాంక్ మొండిబకాయిలు కాస్త శాంతించాయి. మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 4.29 శాతానికి(రూ.56,421 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది క్యూ1లో స్థూల ఎన్పీఏలు 4.9 శాతం(రూ.60,434 కోట్లు)గాా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా 2.66 శాతం(రూ.31,884 కోట్లు) నుంచి 2.24 శాతానికి(రూ.28,669 కోట్లు) దిగొచ్చాయి. దీంతో క్యూ1లో మొండిబకాయిలపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) రూ.3,359 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ మొత్తం రూ.3,903 కోట్లు. అయితే, గతేడాది మార్చి క్వార్టర్(క్యూ4)లో స్థూల ఎన్పీఏలు 4.25 శాతం, నికర ఎన్పీఏలు 2.12 శాతంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1లో మొండిబకాయిలు పెరగడం గమనార్హం. ‘మొండిబకాయిల సమస్యకు ఇక అడ్డుకట్టపడినట్లే. ఎన్పీఏల రికవరీ ఆశావహంగా కొనసాగుతోంది. దీంతో బ్యాంక్ రానున్నకాలంలో మరింత మెరుగైన పనితీరును నమోదుచేయగలదన్న విశ్వాసంతో ఉన్నాం. ఇక రుణ వృద్ధి పుంజుకుంటేనే మరింతగా వడ్డీరేట్లను తగ్గించేందుకు వీలవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,674 మంది బ్యాంక్ సిబ్బంది పదవీవిరమణ చేయనున్నారు. దీంతో కొత్తగా ఈ ఏడాదే 2,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకోవాలనేది మా ప్రణాళిక. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ -
మూడో రోజూ నష్టాలే..
28వేల దిగువకు సెన్సెక్స్, 8,500 దిగువకు నిఫ్టీ - 236 పాయింట్లు క్షీణించి 27,866కు సెన్సెక్స్ - 63 పాయింట్ల నష్టంతో 8,462కు నిఫ్టీ ఆర్థిక సంస్కరణల అనిశ్చితికి నిరాశపరచిన ఎస్బీఐ ఆర్థిక ఫలితాలు తోడవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు క్షీణపథంలోనే సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 28 వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువకు పతనమాయ్యాయి. సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 27,866 పాయింట్ల వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 8,462 పాయింట్ల వద్ద ముగిశాయి. చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడం, దీంతో ఇంట్రాడేలో రూపాయి 40 పైసలు క్షీణించడం, కొనసాగుతున్న కమోడిటీ ధరల పతనం, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశావహంగా లేకపోవడం... ప్రభావం చూపాయి. రియల్టీ, బ్యాంక్, వాహన, క్యాపిటల్ గూ డ్స్, రిఫైనరీ షేర్లు పతనమయ్యాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 432 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 8,462 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా కరెన్సీ విలువ తగ్గింపు ఎఫెక్ట్... మందగమనంలో ఉన్న తన ఆర్థిక వ్యవస్థలో జోష్ నింపడానికి చైనా ప్రభుత్వం యువాన్ కరెన్సీ విలువను 2 శాతం వరకూ తగ్గించింది. చైనా కరెన్సీ విలువను తగ్గించడంతో ఆ దేశం నుంచి టైర్ల ఉత్పత్తులు చౌక ధరలతో వెల్లువెత్తుతాయనే ఆందోళనతో టైర్ల కంపెనీల షేర్లు పతనమయ్యాయి. జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్, ఎంఆర్ఎఫ్, సియట్, గుడ్ఇయర్ ఇండియా, అపోలో టైర్స్ కంపెనీల షేర్లు 12 శాతం వరకూ నష్టపోయాయి. యువాన్ కరెన్సీ డీవాల్యూయేషన్ కారణంగా ఆ దేశానికి ఎగుమతులు ఖరీదవుతాయనే ఆందోళనతో టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత షేర్లు 3-5.5 శాతం రేంజ్లో పడిపోయాయి. రూపాయి క్షీణత కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ షేర్లు 2 శాతం వరకూ పెరిగాయి. చైనా కరెన్సీ 2% డీవాల్యూ బీజింగ్: చైనా కేంద్ర బ్యాంక్(పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా-పీబీఓసీ) యువాన్ కరెన్సీ విలువను డీవాల్యూ చేసింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం, ఇటీవల స్టాక్ మార్కెట్ భారీ పతనం నేపథ్యంలో యువాన్ విలువను 2 శాతం తగ్గించింది. ఈ మార్పు కారణంగా డాలరుతో పోలిస్తే యువాన్ కరెన్సీ సెంట్రల్ పారిటీ రేట్ 1,136 బేసిస్ పాయింట్లు తగ్గి 6.2298కు పడిపోయింది. యువాన్ విలువను తగ్గించడం వల్ల చైనా ఎగుమతులు మరింత చౌకఅవుతాయి, చైనాకు ఎగుమతుల ఆదాయం పెరుగుతుంది. పవర్‌మెక్ ఇష్యూకు అనూహ్య స్పందన ఇన్వెస్టర్ల నుంచి పవర్‌మెక్ పబ్లిక్ ఇష్యూకు అనూహ్య స్పందన వచ్చింది. మంగళవారంతో ముగిసిన ఈ ఇష్యూ 38.06 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. -
క్యూ2లో అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం
వాషింగ్టన్ : అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది 2వ క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో సానుకూల రీతిలో 2.3 శాతంగా నమోదయ్యింది. వినియోగ వ్యయం పెరగడం(అమెరికా ఆర్థిక క్రియాశీలతలో ఈ విభాగం వాటా దాదాపు 70%), ఎగుమతుల్లో వృద్ధి వంటి అంశాలు దీనికి కారణమని వాణిజ్య శాఖ గురువారం పేర్కొంది. విశేషమేమిటంటే.. మొదటి క్వార్టర్ తొలి అంచనాలు సైతం మెరుగుపడ్డం. తొలి అంచనా ప్రకారం క్యూ1లో అసలు వృద్ధిలేకపోగా 0.2% వృద్ధి క్షీణత నమోదయ్యింది. అయితే సవరించిన అంచనాల ప్రకారం క్యూ1లో 0.6% వృద్ధి నమోదయ్యింది. మొదటి త్రైమాసికంలో వినియోగ వ్యయంలో 1.8% వృద్ధి నమోదయితే, ఇది క్యూ2లో 2.9 శాతానికి ఎగసింది. మొత్తానికి తాజా ఆర్థిక ఫలితాలు అమెరికన్లను ఉత్సాహపరుస్తున్నాయి. -
భలే బోనస్..కొంచెం బోగస్..!
- ఈ ఏడాది 21 కంపెనీల బోనస్ బొనాంజా - వీటిలో చాలావరకూ టాప్ కంపెనీలే - బోనస్ చూసి షేర్లు కొనొద్దంటున్న నిపుణులు - ఏ కంపెనీకైనా ఫండమెంటల్సే ముఖ్యం ఈసారి కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలేమీ అంత బాగులేవు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ముగిసిన ఆఖరి త్రైమాసికం ఫలితాలు ఆకర్షణీయంగా లేవంటూ అంతా వాపోతుండగా... పలు కంపెనీలు షేర్హోల్డర్లకు ఆకర్షణీయమైన బోనస్ షేర్లను ప్రకటించాయి. తద్వారా తమ దగ్గర నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చాటాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 21 కంపెనీలు బోనస్ ఇష్యూల్ని ప్రతిపాదించాయి. వాటిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ తదితర పెద్ద కార్పొరేట్లూ ఉన్నాయి. అయితే ఇటీవల బోనస్ ఇష్యూల్ని ప్రకటించిన 21 కంపెనీల్లో 9 కంపెనీల లాభాల వృద్ధి 2015 మార్చి త్రైమాసికంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యింది. ఆయా కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నా, భవిష్యత్‌లో వ్యాపారం వృద్ధి చెందుతుందన్న భరోసాతో బోనస్ షేర్లను ప్రకటించాయి. బోనస్ షేర్లు అంటే... ఒక్క ముక్కలో చెప్పాలంటే... కంపెనీల వద్దనున్న మిగులు రిజర్వుల్ని (నగదుతో సహా) వాటాదార్లకు నగదు రూపంలో పంచకుండా షేర్ల రూపంలో పంచటమే!! ఇలా చేయటం వల్ల కంపెనీల ఈక్విటీ (మూలధనం) పెరుగుతుంది. అంటే నగదుతో సహా తమ దగ్గరున్న రిజర్వుల్ని మూలధనంగా మారుస్తాయన్న మాట. నిజానికి ఇది కంపెనీ ఖాతా పుస్తకాల్లో జరిగే మార్పే. అయితే మూలధనం పెరగడం వల్ల షేర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల ప్రతి షేరుకూ వచ్చే రాబడి (ఈపీఎస్) తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినపుడు కంపెనీ సరైన వృద్ధి కనపరచటం లేదనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే భవిష్యత్తులో మరింత వృద్ధి కనబరుస్తామనే ధీమా ఉన్న సంస్థలే బోనస్ ప్రకటిస్తుంటాయి. అలా చేస్తేనేబోనస్ షేర్ల వల్ల ఇన్వెస్టర్లకు లాభం కూడా. భవిష్యత్ బాగుంటుం దని, వ్యాపారాన్ని మరింత విస్తరించే చాన్స్ వుందన్న విశ్వాసం ఆ కంపెనీ యాజమాన్యానికి ఉందనే సంకేతం బోనస్ ఇష్యూ ద్వారా వెలువడుతుంది. ఇన్వెస్టర్లకూ ఇదో అవకాశమే... అధిక ధరలో షేర్లు కొనలేని ఇన్వెస్టర్లకు బోనస్ ఇష్యూ ఒక అవకాశం. ఎందుకంటే బోనస్ షేర్లు జారీ అయ్యాక స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఆ షేరు ధర బోనస్ నిష్పత్తి ప్రకారం తగ్గుతుంది. ఉదాహరణకు ఇన్ఫోసిస్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. బోనస్ జారీకి నిర్ణయించిన రికార్డు తేదీ నాటికి ఆ కంపెనీ షేర్లు ఎవరి దగ్గర ఉంటాయో వారికి బోనస్ షేర్లు లభిస్తాయి. నిర్ణీత తేదీ తర్వాత ఆ షేరు ధర కూడా సగానికి తగ్గిపోతుంది. దాంతో ఇన్ఫోసిస్ షేరును రూ.2000కు బదు లు రూ.1000 ధరతో కొనవచ్చు. కానీ బోనస్ ఇష్యూ తర్వాత కంపెనీ షేరు పుస్తక విలువ, ఈపీఎస్ తదితరాలు కూడా సగమైపోతాయన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అంటే షేరు ధర తగ్గినంత మాత్రాన, కంపెనీ ఫండమెంటల్స్‌తో పోలిస్తే షేరు చౌక అయినట్లు కాదు. షేర్లు కొనొచ్చా బోనస్ ఇస్తామన్న కంపెనీల షేర్లను కొనడానికి రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉత్సాహపడతారు. కానీ బోనస్ ఇచ్చినంత మాత్రాన ప్రతి కంపెనీ షేరును కొనడం సరికాదని, ఆయా కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు వ్యాపారాన్ని అవగాహన చేసుకునే కొనడం మంచిదనేది విశ్లేషకుల సూచన. ప్రముఖ ఫైనాన్షియల్ మేగజైన్ వెల్లడించిన సర్వే ప్రకారం 2001-2010 మధ్యకాలంలో బోనస్ ప్రకటించిన టాప్ 30 కంపెనీల్లో 24 కంపెనీల షేర్లు రికార్డు తేదీ తర్వాత ఏడాదికాలంలో ర్యాలీ జరిపాయి. ఆ సర్వే ప్రకారం అప్పట్లో బోనస్ ప్రకటించిన కంపెనీల్లో టీసీఎస్, ఎల్ అండ్ టీ, ర్యాన్‌బాక్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు రికార్డు తేదీ తర్వాత ఏడాది కాలంలో 82 శాతం వరకూ పెరిగాయి. అదే సమయంలో స్టెరిటైల్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సీమెన్స్ షేర్లు బోనస్ జారీ తర్వాత ఏడాది కాలంలో 16-72% మధ్య నష్టపోయాయి. చాలావరకూ ఆరోగ్యకరమైన కంపెనీలే బోనస్ షేర్లను జారీచేస్తాయని, అందువల్ల అవి పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు అంటుం టారు. కానీ రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వృద్ధి అవకాశం లేని కంపెనీలు కూడా బోనస్‌లను ప్రకటిస్తాయని, వాటి పట్ల ఆప్రమత్తంగా వుండాలన్నది వారి హెచ్చరిక. షేరు ధర పెరుగుతుందా.. కంపెనీ రిజర్వుల్ని మూలధనంగా మార్చి బోనస్ ఇచ్చినంత మాత్రాన షేరు ధర పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఏప్రిల్ 24న బోనస్ ప్రకటించింది. తరవాత రెండ్రోజుల్లో 10 శాతంపైగా పతనమైంది. ఆ ప్రకటనకు ముందునాటి ధర రూ. 2,150తో పోలిస్తే ఇప్పటికీ దాని ధర 5 శాతం తక్కు వే ఉంది. అయితే గత రెండు దశాబ్దాలుగా పలు బోనస్ ఇష్యూల్ని ఇన్ఫోసిస్ ప్రకటించింది. అటు తర్వాత కొద్ది త్రైమాసికాలకు ఆ షేరు పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుదలకు అనుగుణంగానే కంపెనీ లాభాలు ఎప్పటికప్పుడు వృద్ధి చెందడం ఇందుకు కారణం. అదే కోటక్ బ్యాంక్ మే 5న బోనస్ ప్రతిపాదించాక వెనువెంటనే 8% ర్యాలీ జరిపింది. మధ్యలో క్షీణించినా, ఇప్పటి ధర బోనస్ ప్రకటనకు ముందునాటి ధరతో పోలిస్తే 5 శాతం ఎక్కువగానే వుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ 2009 అక్టోబర్‌లో 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. అప్పటి ధరతో పోలిస్తే ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ 25 శాతం తక్కువగానే వుంది. రిలయన్స్ గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కంపెనీ ఆశించిన ఫలితాల్ని ఇవ్వక ధర తగ్గిందనేది గమనించాలి. -
సెన్సెక్స్‌కు 148 పాయింట్లు లాభం
- 27,958 పాయింట్ల వద్ద ముగింపు - 38 పాయింట్ల లాభంతో 8,459కు నిఫ్టీ ఎస్బీఐ, కొన్ని ఇతర కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. గురువారం అమెరికా మార్కెట్లు, ఈ జోరుతో శుక్రవారం ఆసియా మార్కెట్లు పెరగడం కూడా కలసి వచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 28 వేల పాయింట్లను దాటింది. మొత్తం మీద సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 27,958 పాయింట్ల వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 8,459 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, రిఫైనరీ, టెక్నాలజీ షేర్లు కళకళలాడాయి. కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. పూర్తిగా టెక్నికల్స్: విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడంతో సెంటిమెంట్ ఊపందుకుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అయితే ఈ పెరుగుదల పూర్తిగా టెక్నికల్స్ మీద ఆధారపడి ఉందని, ఆర్థిక వృద్ధి, కంపెనీల ఆర్థిక ఫలితాల వంటి ఫండమెంటల్స్ విషయాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. బ్లూచిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో కొనుగోళ్లు భారీగా జరిగాయని వెరాసిటి బ్రోకింగ్ హెడ్ (రీసెర్చ్) జిగ్నేశ్ చౌధురి చెప్పారు. -
రూ. 2 లక్షల కోట్లకు చేరువలో ఫేస్బుక్ జకర్బర్గ్ సంపద
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించడం ఆ కంపెనీ సీఈవో మార్క్ జకర్బర్గ్కి మరింతగా లాభించింది. కంపెనీ షేర్లు గురువారం కొత్త గరిష్టస్థాయికి ఎగియడంతో జకర్బర్గ్ సంపద విలువ కూడా మరో 160 కోట్ల డాలర్లు పెరిగి 3,330 కోట్ల డాలర్లకు(రూ.1,98,000 కోట్లు) చేరింది. దీంతో సంపదలో గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్.. అమెజాన్‌డాట్‌కామ్ సీఈవో జెఫ్ బెజోస్‌ని కూడా జకర్బర్గ్ అధిగమించినట్లయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో ఆయన 16వ స్థానంలో నిల్చారు. జకర్బర్గ్ వయసు 30 ఏళ్లే. గూగుల్ వ్యవస్థాపకులు వరుసగా 17,18 స్థానాల్లో ఉండగా.. బెజోస్ 20వ ర్యాంకులో ఉన్నారు. 8,470 కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
క్షీణించిన సెంట్రల్ బ్యాంక్ లాభం
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 4% క్షీణించి రూ. 162 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, తాజా క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 6,404 కోట్ల నుంచి రూ. 6,972 కోట్లకు పెరిగింది. 2013-14లో ఆదాయం రూ. 23,528 కోట్ల నుంచి రూ. 26,350 కోట్లకు పెరగ్గా, బ్యాంకు రూ. 1,263 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఎన్పీఏలు 4.8% నుంచి 6.27%కి, నికర ఎన్పీఏలు 2.9% నుంచి 3.75 శాతానికి పెరిగాయి. దేనా బ్యాంక్ లాభం 49% జంప్: క్యూ4లో దేనా బ్యాంక్ లాభం 49 శాతం ఎగిసి రూ. 187 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో ఇది రూ. 126 కోట్లు. ఇక ఆదాయం రూ. 2,540 కోట్ల నుంచి రూ. 2,867 కోట్లకు పెరిగింది. -
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 145 టార్గెట్ ధర: రూ. 225 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. మార్క్ టు మార్కెట్ కేటాయింపులు తక్కువగా ఉండడం, ఇతర కారణాల వల్ల కంపెనీ నికర లాభం 37 శాతం వృద్ధితో రూ.1,530 కోట్లకు పెరిగింది. విద్యుదుత్పత్తి సెగ్మెంట్ రుణ మంజూరీ రూ.24,600 కోట్లకు, రుణ పంపిణి రూ.12,300 కోట్లకు పెరిగాయి. ప్రైవేట్ రంగానికి రుణ మంజూరీ రూ.3,500 కోట్లకు, పంపిణి రూ.2,100 కోట్లకు చేరాయి. మొత్తం మీద సంస్థ మొత్తం రుణ మంజూరీ రూ.1.72 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిలు 0.65%కాగా, నికర మొండి బకాయిలు 0.52%. రెండేళ్లలో కంపెనీ రుణ వృద్ధి 17%గా ఉంటుందని భావిస్తున్నాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) ఆరోగ్యకరంగా(20%) ఉండడం వంటి కారణాల వల్ల ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉందని చెప్పవచ్చు. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇటీవల విద్యుత్ చార్జీలను తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత మార్కెట్ ధర: రూ.558 టార్గెట్ ధర: రూ.650 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ మార్జిన్లు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 10 బేసిస్ పాయింట్లు పెరగడం, రుణ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 18% పెరగడం తదితర కారణాల వల్ల నికర లాభం రూ.1,050 కోట్లకు పెరిగింది. మొత్తం లోన్‌బుక్‌లో పునర్వ్యవస్థీకరించిన రుణాలు క్యూ2లో 7.8 శాతంగా ఉండగా, క్యూ3లో 7.5 శాతానికి తగ్గాయి. రిటైల్ రుణాలు 21%, ఎస్ఎంఈ సెగ్మెంట్ రుణాలు 39% వృద్ధి సాధించడంతో బ్యాంక్ రుణాలు 18% పెరిగాయి. డిపాజిట్లు 22 శాతం పెరగ్గా, కాసా 22.5% వృద్ధితో 26 శాతానికి చేరింది. బ్యాంక్ ఇటీవలనే 190 కోట్ల డాలర్ల ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్(ఎఫ్సీఎన్ఆర్ (బి))డిపాజిట్లను సమీకరించింది. రెండేళ్లలో రుణాలు 14% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 14 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది మార్చికల్లా ప్రభుత్వం నుంచి రూ. 550 కోట్ల పెట్టుబడులు అందే అవకాశాలున్నాయి. -
టెక్ మహీంద్రా లాభం 3 రెట్ల వృద్ధి
చెన్నై: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 1,010 కోట్లకు చేరింది. టెలికం, ఫైనాన్షియల్, తయారీ రంగ విభాగాలలో సాధించిన వృద్ధి ఇందుకు దోహదపడినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు.గతేడాది(2012-13) ఇదే కాల ంలో కేవలం రూ. 322 కోట్ల లాభాన్ని ఆర్జి ంచింది. ఇక ఈ కాలంలో ఆదాయం సైతం దాదాపు 34% పుంజుకుని రూ. 4,898 కోట్లను అధిగమించింది. అంతక్రితం రూ. 3,668 కోట్ల ఆదాయం నమోదైంది. డాలర్లలోనూ...: డాలర్ల ప్రాతిపదికన కూడా కంపెనీ ఆదాయం 17%పైగా వృద్ధితో 79.1 కోట్ల డాలర్లను తాకింది. నికర లాభం 16.31 కోట్ల డాలర్ల నుంచి 17.57 కోట్ల డాలర్లకు చేరింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వ్యూహాలను, పెట్టుబడులను వినియోగిస్తున్నట్లు కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ చెప్పారు. డిజిటల్ ఎంటర్ప్రెజెస్కు అవసరమైన సొల్యూషన్లు అందించడంపై దృష్టిపెట్టడం ద్వారా వృద్ధిని సాధిస్తున్నట్లు వివరించారు. మరిన్ని విశేషాలివీ... క్యూ3లో నికరంగా 2,165 మందికి ఉద్యోగాలిచ్చింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 87,399కు చేరింది. ఉద్యోగుల్లో 57,601 మంది సాఫ్ట్వేర్ సేవల్లోనూ, 23,213 మంది బీపీవో కార్యకలాపాల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.