బ్యాంక్ ఆఫ్ బరోడా | Bank of Baroda gains on in-line Q3 results | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఆఫ్ బరోడా

Published Mon, Feb 10 2014 1:27 AM | Last Updated on Tue, Oct 2 2018 5:42 PM

Bank of Baroda gains on in-line Q3 results

బ్రోకరేజ్ సంస్థ: నొముర
 ప్రస్తుత మార్కెట్ ధర: రూ.558
 టార్గెట్ ధర: రూ.650
 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ మార్జిన్లు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 10 బేసిస్ పాయింట్లు పెరగడం, రుణ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 18% పెరగడం తదితర కారణాల వల్ల నికర లాభం రూ.1,050 కోట్లకు పెరిగింది.  మొత్తం లోన్‌బుక్‌లో పునర్‌వ్యవస్థీకరించిన రుణాలు క్యూ2లో 7.8 శాతంగా ఉండగా, క్యూ3లో 7.5 శాతానికి తగ్గాయి.

రిటైల్ రుణాలు 21%, ఎస్‌ఎంఈ సెగ్మెంట్ రుణాలు 39% వృద్ధి సాధించడంతో బ్యాంక్ రుణాలు 18% పెరిగాయి. డిపాజిట్లు 22 శాతం పెరగ్గా,  కాసా 22.5% వృద్ధితో 26 శాతానికి చేరింది. బ్యాంక్ ఇటీవలనే 190 కోట్ల డాలర్ల ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్(ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి))డిపాజిట్లను సమీకరించింది. రెండేళ్లలో రుణాలు 14% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 14 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.  ఈ ఏడాది మార్చికల్లా ప్రభుత్వం నుంచి రూ. 550 కోట్ల పెట్టుబడులు అందే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement