Net interest
-
హెచ్డీఎఫ్సీ లాభం 2,862 కోట్లు
న్యూఢిల్లీ: గృహరుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ... మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. స్టాండలోన్ ప్రాతిపదికన లాభం 27 శాతం పెరిగి రూ.2,862 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం రూ.11,586 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.2,257 కోట్లు, ఆదాయం రూ.9,322 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం 2,650 కోట్ల నుంచి 3,161 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున తుది డివిడెండ్ పంపిణీకి హెచ్డీఎఫ్సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. రూ.3.50 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి చూస్తే 2018–19 ఆర్థిక సంవత్సరానికి షేరు వారీ డివిడెండ్ రూ.21 అవుతుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.20 డివిడెండ్ ఇవ్వడం గమనార్హం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిరాశ 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ స్టాండలోన్ లాభం మాత్రం 12 శాతం తగ్గి రూ.9,632 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.10,959 కోట్లు. కన్సాలిడేటెడ్‌గా చూస్తే మాత్రం లాభం గణనీయంగా మెరుగుపడింది. 2017–18లో రూ.13,111 కోట్ల కన్సాలిడేట్ లాభం రాగా, 35 శాతం వృద్ధితో 2018–19లో 17,580 కోట్లకు చేరింది. అయితే, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీవో ద్వారా వచ్చిన మొత్తం ఇందులో చేరడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఐపీవో ద్వారా వాటాలు విక్రయించినందుకు క్రితం ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చడం సరికాదని కంపెనీ అభిప్రాయపడింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.79,819 కోట్ల నుంచి రూ.96,195 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ.9,635 కోట్ల నుంచి రూ.11,403 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా నమోదైంది. స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 1.18 శాతం మేర రూ.4,777 కోట్లు కాగా నికర ఎన్పీఏలు ఇండివిడ్యువల్ (వ్యక్తులు) పోర్ట్‌ఫోలియోలో 0.7 శాతం, నాన్ ఇండివిడ్యువల్ (సంస్థలు) పోర్ట్‌ఫోలియోలో 2.34 శాతం మేర ఉన్నట్టు కంపెనీ తెలిపింది. నిధుల సమీకరణ రిడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు లేదా ఇతర హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్లను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.1.25 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని హెచ్డీఎఫ్సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే, నాసర్ ముంజీ, జేజే ఇరానీలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా జూలై 21 నుంచి మరో రెండేళ్ల కాలానికి పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. -
యస్ బ్యాంక్‌కు రూ.1,506 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్‌బ్యాంక్‌కు నాలుగో క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ4లో రూ.1,507 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యస్ బ్యాంక్ తెలిపింది. 2017–18 క్యూ4లో రూ.1,179 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు భారీగా పెరగడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. రద్దు చేసిన రూ.831 కోట్ల రుణాలను పరిగణనలోకి తీసుకుంటే నష్టాలు మరింతగా పెరిగేవి. ఇవి సీఈఓగా రాణా కపూర్ నిష్క్రమణ, కొత్త సీఈఓగా రవ్నీత్ గిల్ పగ్గాలు చేపట్టిన తర్వాత వెలువడిన తొలి ఫలితాలు. 16 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం... గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 16 శాతం పెరిగి రూ.2,506 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 63 శాతం పతనమై రూ.538 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభం 38 శాతం తగ్గి రూ.1,323 కోట్లకు పరిమితమైంది. నికర నష్టాలు వచ్చినా, మొత్తం ఆదాయం మాత్రం పెరిగిందని పేర్కొంది. 2017–18 క్యూ4లో రూ.7,164 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.8,388 కోట్లకు పెరిగింది. రూ.2,100 కోట్ల కంటింజెన్సీ రిజర్వ్‌లను కూడా కలుపుకుంటే గత క్యూ4లో కేటాయింపులు పదిరెట్లు పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.399 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,661 కోట్లకు ఎగబాకాయి. వివిధ రంగాల్లో ఒత్తిడి రుణాలు రూ.10,000 కోట్ల మేర ఉంటాయని, వీటి కోసం భారీగా కేటాయింపులు జరిపాల్సి వచ్చిందని తెలిపింది. భారీ నష్టాలు ఉన్నప్పటికీ, ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను బ్యాంక్ ఇవ్వనున్నది. క్షీణించిన రుణ నాణ్యత.... బ్యాంక్ రుణ నాణ్యత బాగా క్షీణించింది. స్థూల మొండి బకాయిలు 1.28 శాతం నుంచి దాదాపు రెట్టింపై 3.22 శాతానికి ఎగిశాయి. నికర మొండి బకాయిలు 0.64 శాతం నుంచి 1.86 శాతానికి పెరిగాయి. తాజా మొండి బకాయిలు రూ.3.481 కోట్లుగా ఉన్నాయి. వీటిల్లో జెట్ ఎయిర్వేస్ బకాయిలు రూ.552 కోట్లు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బకాయిలు రూ.529 కోట్లు. గత క్యూ4లో భారీగా నికర నష్టాలు రావడం పూర్తి ఆర్థిక సంవత్సరం బ్యాంక్ నికర లాభంపై తీవ్రంగా ప్రభావం చూపించింది. 2017–18లో రూ.4,224 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.1,720 కోట్లకే పరిమితమైంది. ఈ ఏడాది మార్చినాటికి క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.5 శాతంగా ఉంది. నికర వడ్డీ ఆదాయం రూ.5,742 కోట్ల నుంచి రూ.7,857 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చి నాటికి ముగిసిన సంవత్సరానికి రుణాలు 19 శాతం వృద్ధితో రూ.2,41,500 కోట్లకు, డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.2,27,610 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 50 శాతం నుంచి 43 శాతానికి తగ్గింది. వంద కోట్ల డాలర్ల నిధుల సమీకరణ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–18 శాతం రేంజ్లో రుణ వృద్ధి సాధించడంపైన దృష్టి కేంద్రీకరిస్తున్నామని సీఈఓ రవ్నీత్ గిల్ చెప్పారు. దీనిని క్రమంగా 22–24 శాతానికి పెంచుతామని, గతంలో సాధించిన 40 శాతం రుణ వృద్ధి కోసం పరుగులు పెట్టబోమని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ స్థాయిల్లో భారీ మార్పులు ఉండవని, బ్యాంక్‌లో గవర్నెన్స్ సమర్థంగా ఉండాలని భావిస్తున్నామని, ఈ దిశగా కొన్ని నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. రుణ మార్గంలో రూ.20,000 కోట్లు, ఈక్విటీల జారీ ద్వారా వంద కోట్ల డాలర్ల నిధులు సమీకరించడానికి బోర్డ్ ఆమోదం తెలిపింది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు సెక్యూరిటైజేషన్ దన్ను
న్యూఢిల్లీ: నిధుల లభ్యత కష్టంగా మారినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ) రుణాల పోర్ట్‌ఫోలియోను విక్రయించడం ద్వారా (సెక్యూరిటైజేషన్) దాదాపు రూ. 26,200 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమీకరించిన నిధులతో పోలిస్తే ఇది 170 శాతం అధికం. 2017–18లో సెక్యూరిటైజేషన్ ద్వారా ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐలు రూ. 9,700 కోట్లు సమీకరించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) పలు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయిన దరిమిలా గత ఆర్థిక సంవత్సరం ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణాల సంస్థలకు నిధులు లభ్యత కష్టసాధ్యంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అవి ఫండ్స్ సమీకరణ లక్ష్యాల సాధన కోసం ప్రధానంగా సెక్యూరిటైజేషన్‌పై ఆధారపడినట్లు ఇక్రా పేర్కొంది. ‘2018 ఆర్థిక సంవత్సరంలో, 2019 ప్రథమార్ధంలో మొత్తం నిధుల సమీకరణలో సెక్యూరిటైజేషన్ వాటా 18–20 శాతమే ఉంది. కానీ మూడో త్రైమాసికంలో ఇది 37 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 50 శాతానికి పెరిగింది‘ అని ఇక్రా గ్రూప్ హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ రేటింగ్స్ విభాగం) విభోర్ మిట్టల్ తెలిపారు. 2017–18లో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులు సమీకరించిన సంస్థల సంఖ్య 24గా ఉండగా.. 2018–19లో 43కి చేరిందని ఆయన పేర్కొన్నారు. -
కోటక్ బ్యాంకు లాభం 21% వృద్ధి
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంకు సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ (బ్యాంకుతో పాటు ఇతర సబ్సిడరీలు కలసి) లాభం 21.3 శాతం వృద్ధితో రూ.1,747 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.10,829 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,440 కోట్లు, ఆదాయం రూ.9,140 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం, ఫీజుల ద్వారా ఆదాయం పెరగడం కలిసొచ్చింది. కానీ, బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ మాత్రం 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 1.91 శాతానికి తగ్గాయి. క్రితం ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఇవి 2.14 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా చూస్తే స్థూల ఎన్పీఏల మొత్తం రూ.4,302 కోట్లు. నికర ఎన్పీఏలు సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 1.08 శాతం (రూ.2,036 కోట్లు) నుంచి 0.73 శాతానికి (1,617 కోట్లు) తగ్గుముఖం పట్టాయి. ఎన్పీఏలు, కంటింజెన్సీలకు చేసిన నిధుల కేటాయింపులు సైతం రూ.359 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ కేటాయింపులు రూ.252 కోట్లుగా ఉండడం గమనార్హం. అడ్వాన్స్‌లు, ఇతరత్రా వాటికి చేసిన నిధుల కేటాయింపులు రూ.221 కోట్లుగా ఉన్నట్టు కోటక్ బ్యాంకు తెలిపింది. ఆగస్ట్ 2న 8.10 శాతం పర్పెచ్యుయల్ నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను అర్హులైన ఇన్వెస్టర్లకు కేటాయించడం వల్ల బ్యాంకు పెయిడప్ క్యాపిటల్ పెరిగినట్టు పేర్కొంది. అంచనాలకు సమీపంలో... స్టాండలోన్‌గా చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంకు నికర లాభం 15 శాతం పెరిగి రూ.1,141 కోట్లకు చేరింది. కానీ, అనలిస్టులు మాత్రం రూ.1,200 కోట్ల స్థాయిల్లో ఉంటుందని అంచనా వేశారు. ఆదాయం రూ.5,714 కోట్ల నుంచి రూ.7,016 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్‌గా బ్యాంకు వద్ద మిగులు నిల్వలు, క్యాపిటల్ రూ.54,349 కోట్లకు వృద్ధి చెందాయి. సెప్టెంబర్ చివరి నాటికి కన్సాలిడేటెడ్‌గా ఇచ్చిన రుణాల మొత్తం రూ.2.22 లక్షల కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. బీఎస్ఈలో కోటక్ బ్యాంకు షేరు 1.75 శాతం తగ్గి రూ.1,157.10 వద్ద క్లోజయింది. ముఖ్యాంశాలివీ... రిటైల్ రుణాలు 27.77 శాతం పెరిగి రూ.78,167 కోట్లకు చేరాయి. రెండో త్రైమాసికంలో బ్యాంకు మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 42 శాతంగా ఉంది. కార్పొరేట్ రుణాలు 17% పెరిగి రూ.1,06,773 కోట్లకు చేరాయి. డిపాజిట్లు 24% వృద్ధితో రూ.2.06 లక్షల కోట్లు. ఇతర ఆదాయం వార్షికంగా 26 శాతం పెరిగి రూ.1,205 కోట్లకు చేరింది. -
మాగ్మా ఫిన్‌కార్ప్ నికర లాభం 22 శాతం అప్
హైదరాబాద్: మాగ్మా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 22 శాతం పెరిగి 66 కోట్లకు చేరింది. స్థూల లాభం 45 శాతం వృద్ధితో రూ.102 కోట్లకు పెరిగిందని మాగ్మా ఫిన్‌కార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 109 బేసిస్ పాయింట్ల వృద్ధితో 7.5 శాతానికి చేరిందని కంపెనీ ఎండీ, వైస్ చైర్మన్ సంజయ్ ఛామ్రియా పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే,గత ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం 37 శాతం వృద్ధితో రూ.306 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.214 కోట్లకు చేరిందని వివరించారు. నికర వడ్డీ మార్జిన్ 81 బేసిస్ పాయింట్లు పెరిగి 7 శాతానికి చేరిందని పేర్కొన్నారు. -
బ్యాంకింగ్ లాభాల్లో అద్భుతాలు లేవు!
బీఎంఐ రిసెర్చ్ నివేదిక రుణ రేట్లు తగ్గడం, మొండి బకాయిల తీవ్రతల ప్రస్తావన న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో భారీ లాభదాయకత అవకాశాలు కనిపించడంలేదని బీఎంఐ రిసెర్చ్ నివేదిక ఒకటి పేర్కొంది. ఫిచ్ గ్రూప్‌కు చెందిన ఈ పరిశోధనా విభాగం.. బుధవారం తాజా నివేదికను విడుదల చేసింది. మొండి బకాయిల భారం, అలాగే రుణ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితులు బ్యాంకింగ్ లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది వరకూ ఈ రంగం ఫండమెంటల్స్‌కు సంబంధించి అంశాలను ‘నెగిటివ్ అవుట్‌లుక్’లో ఉంచుతున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ రేటు తగ్గింపు ఒత్తిడి నేపథ్యంలో భారత బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... బేస్ రేటుకు సంబంధించి రానున్న ప్రతిపాదనలు బ్యాంకుల లాభదాయక పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. {పభుత్వ రంగ బ్యాంకులతో పోల్చిచూస్తే... ప్రైవేటు రంగం బ్యాంకుల పనితీరు బాగుంది. చక్కటి నిర్వహణా తీరు, పటిష్ట మూలధన పరిస్థితులు, అధిక ఆదాయాలు దీనికి కారణం. బ్యాంకుల మొండిబకాయిల సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యేట్లు కనిపించడం లేదు. పలు కంపెనీల ఆదాయాలు ప్రతికూలంగా ఉండడం బ్యాంకింగ్‌కు రానున్న కాలంలో ఎదురుదెబ్బే.వాణిజ్య రంగంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి ఇప్పట్లో మెరుగుపడేలా లేదు. -
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు స్వల్ప లాభాలు
న్యూఢిల్లీ: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 2014-15 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్వల్ప లాభాలను ఆర్జించింది. 2013-14 ఇదే క్వార్టర్‌తో పోల్చితే నికర లాభం స్వల్పంగా 2.2 శాతం పెరిగి, రూ.378 కోట్లుగా నమోదయ్యింది. ఇక ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,478 కోట్ల నుంచి రూ.2,861కి పెరిగింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1,317 కోట్ల నుంచి రూ.1,386కు ఎగసింది. ఆదాయం రూ.9,335 కోట్ల నుంచి రూ.10,799 కోట్లకు చేసింది. నికర వడ్డీ మార్జిన్ 2.40 శాతం నుంచి 2.47 శాతానికి పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.650 కోట్లకు చేరింది. మొత్తం రుణ పంపిణీ 23 శాతం వృద్ధితో రూ.9,938 కోట్లకు ఎగసింది. వ్యక్తిగత రుణ పంపిణీ 24% వృద్ధితో రూ.9,550 కోట్లుగా నమోదయ్యింది. కాగా ఫలితాలు మంచి ఉత్సాహాన్ని ఇచ్చినట్లు సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీతా శర్మ పేర్కొన్నారు. ప్రత్యేకించి రుణ పంపిణీలో వృద్ధి, బకాయిల వసూళ్లు సానుకూల పరిణామాలన్నారు. 2015- 16లో కూడా ఇదే విధమైన ప్రోత్సాహకర పరిస్థితి ఉంటుందన్న విశ్వాసాన్ని మేనేజింగ్ డెరైక్టర్ వ్యక్తం చేశారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత మార్కెట్ ధర: రూ.558 టార్గెట్ ధర: రూ.650 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ మార్జిన్లు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 10 బేసిస్ పాయింట్లు పెరగడం, రుణ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 18% పెరగడం తదితర కారణాల వల్ల నికర లాభం రూ.1,050 కోట్లకు పెరిగింది. మొత్తం లోన్‌బుక్‌లో పునర్వ్యవస్థీకరించిన రుణాలు క్యూ2లో 7.8 శాతంగా ఉండగా, క్యూ3లో 7.5 శాతానికి తగ్గాయి. రిటైల్ రుణాలు 21%, ఎస్ఎంఈ సెగ్మెంట్ రుణాలు 39% వృద్ధి సాధించడంతో బ్యాంక్ రుణాలు 18% పెరిగాయి. డిపాజిట్లు 22 శాతం పెరగ్గా, కాసా 22.5% వృద్ధితో 26 శాతానికి చేరింది. బ్యాంక్ ఇటీవలనే 190 కోట్ల డాలర్ల ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్(ఎఫ్సీఎన్ఆర్ (బి))డిపాజిట్లను సమీకరించింది. రెండేళ్లలో రుణాలు 14% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 14 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది మార్చికల్లా ప్రభుత్వం నుంచి రూ. 550 కోట్ల పెట్టుబడులు అందే అవకాశాలున్నాయి.