మాగ్మా ఫిన్‌కార్ప్ నికర లాభం 22 శాతం అప్
హైదరాబాద్: మాగ్మా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 22 శాతం పెరిగి 66 కోట్లకు చేరింది. స్థూల లాభం 45 శాతం వృద్ధితో రూ.102 కోట్లకు పెరిగిందని మాగ్మా ఫిన్‌కార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 109 బేసిస్ పాయింట్ల వృద్ధితో 7.5 శాతానికి చేరిందని కంపెనీ ఎండీ, వైస్ చైర్మన్ సంజయ్ ఛామ్రియా పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే,గత ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం 37 శాతం వృద్ధితో రూ.306 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.214 కోట్లకు చేరిందని వివరించారు. నికర వడ్డీ మార్జిన్ 81 బేసిస్ పాయింట్లు పెరిగి 7 శాతానికి చేరిందని పేర్కొన్నారు.