బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 145
టార్గెట్ ధర: రూ. 225
ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. మార్క్ టు మార్కెట్ కేటాయింపులు తక్కువగా ఉండడం, ఇతర కారణాల వల్ల కంపెనీ నికర లాభం 37 శాతం వృద్ధితో రూ.1,530 కోట్లకు పెరిగింది. విద్యుదుత్పత్తి సెగ్మెంట్ రుణ మంజూరీ రూ.24,600 కోట్లకు, రుణ పంపిణి రూ.12,300 కోట్లకు పెరిగాయి. ప్రైవేట్ రంగానికి రుణ మంజూరీ రూ.3,500 కోట్లకు, పంపిణి రూ.2,100 కోట్లకు చేరాయి.
మొత్తం మీద సంస్థ మొత్తం రుణ మంజూరీ రూ.1.72 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిలు 0.65%కాగా, నికర మొండి బకాయిలు 0.52%. రెండేళ్లలో కంపెనీ రుణ వృద్ధి 17%గా ఉంటుందని భావిస్తున్నాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) ఆరోగ్యకరంగా(20%) ఉండడం వంటి కారణాల వల్ల ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉందని చెప్పవచ్చు. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇటీవల విద్యుత్ చార్జీలను తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
Published Mon, Feb 10 2014 1:28 AM | Last Updated on Tue, Oct 2 2018 5:42 PM
Advertisement
Advertisement