క్యూ2లో అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం | US GDP growth to 2.3 per cent in quarter 2 | Sakshi
Sakshi News home page

క్యూ2లో అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం

Published Fri, Jul 31 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

క్యూ2లో అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం

క్యూ2లో అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం

వాషింగ్టన్ : అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది 2వ క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో సానుకూల రీతిలో 2.3 శాతంగా నమోదయ్యింది. వినియోగ వ్యయం పెరగడం(అమెరికా ఆర్థిక క్రియాశీలతలో ఈ విభాగం వాటా దాదాపు 70%), ఎగుమతుల్లో వృద్ధి వంటి అంశాలు దీనికి కారణమని వాణిజ్య శాఖ గురువారం పేర్కొంది. విశేషమేమిటంటే.. మొదటి క్వార్టర్ తొలి అంచనాలు సైతం మెరుగుపడ్డం. తొలి అంచనా ప్రకారం క్యూ1లో అసలు వృద్ధిలేకపోగా 0.2% వృద్ధి క్షీణత నమోదయ్యింది.

అయితే సవరించిన అంచనాల ప్రకారం క్యూ1లో 0.6% వృద్ధి నమోదయ్యింది. మొదటి త్రైమాసికంలో వినియోగ వ్యయంలో 1.8% వృద్ధి నమోదయితే, ఇది క్యూ2లో 2.9 శాతానికి ఎగసింది. మొత్తానికి తాజా ఆర్థిక ఫలితాలు అమెరికన్లను ఉత్సాహపరుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement