Q 2
-
క్యూ2లో ప్రైవేటు కంపెనీలకు లాభాల పంట
16 శాతం వృద్ధి: ఆర్బీఐ ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల లాభాలు 16 శాతం మేర వృద్ధి చెందాయని ఆర్బీఐ తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 11.2 శాతమేనని పేర్కొంది. తయారీ రంగంలోని కంపెనీలు అధిక నికర లాభాల ఆర్జనలో ముందున్నాయి. వడ్డీ వ్యయాల్లో ఎటువంటి మార్పు లేకపోవడం లాభాల పెరుగుదలకు దోహదం చేసింది. వరుసగా ఏడు త్రైమాసికాల క్షీణత తర్వాత ముడి సరుకుల వ్యయాలు రెండో త్రైమాసికంలో పెరిగినప్పటికీ, ఉద్యోగుల వ్యయాలు పెరిగినా కానీ లాభాలు వృద్ధి చెందడం విశేషం. తయారీ రంగ కంపెనీల విక్రయాలు సైతం రెండో త్రైమాసికంలో 3.7 శాతం వృద్ధి చెందాయి. ఇక సేవల రంగం (నాన్ ఐటీ)లోని కంపెనీల లాభాలు ఈ కాలంలో తగ్గిపోయాయి. ప్రభుత్వేతర నాన్ ఫైనాన్షియల్ కంపెనీల లాభాల వృద్ధి 1.9 శాతంగానే ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తగ్గుదలకు బ్రేక్ పడడంతో ముడి సరుకు వ్యయాలు పెరిగాయని, లాభాలు తగ్గిపోవడానికి ఇదే కారణమని ఆర్బీఐ తెలిపింది. స్టాక్ ఎక్సేంజ్‌లలో లిస్ట్ అయిన 2,702 ప్రభుత్వేతర, నాన్ ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీల సమాచారాన్ని సంక్షిప్తం చేసి ఆర్బీఐ ఈ వివరాలు వెల్లడించింది. -
అనిశ్చితిలో మార్కెట్..!
• అంతర్జాతీయ సంకేతాలతో కదలికలు • కంపెనీల క్యూ 2 ఫలితాల ప్రభావం • గురు నానక్ జయంతి సందర్భంగా నేడు సెలవు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం తదనంతర అంతర్జాతీయ సంకేతాల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ2 ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతరం ప్రభుత్వ చర్యలు కూడా స్టాక్ సూచీలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపారుు మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. గురు నానక్ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. నేడు వెలువడే టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. సమీప భవిష్యత్తులో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు, కంపెనీల క్యూ2 ఫలితాలు ప్రభావం చూపుతాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. అనిశ్చిత పరిస్థితుల్లోకి మార్కెట్ కదులుతోందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఐటీ, ఫార్మా, తదితర రంగాల పట్ల జనవరి దాకా అమెరికా కొత్త అధ్యక్షుడి విధానాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదని, అప్పటిదాకా అనిశ్చితి తప్పదని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు... స్వల్ప కాలంలో వినియోగదారుల కొనుగోళ్ల తీరును ప్రభావితం చేయనున్నదని వివరించారు. ⇔ ఇక నేడు టాటా మోటార్స్, అరబిందో ఫార్మా కంపెనీలు, రేపు(మంగళవారం)గెరుుల్ ఇండియాలు సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2 )ఫలితాలను వెల్లడించనున్నారుు. ⇔ గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 455 పారుుంట్లు నష్టపోరుు 26,819 పారుుంట్ల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడులు రెట్టింపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు రెట్టింపుకు మించి 450 కోట్ల డాలర్లకు పెరిగాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే క్వార్టర్లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర అమ్మకందార్లుగా నిలిచారని ఈ నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఏడు నెలల తర్వాత ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని, ఇదే ధోరణి మూడో క్వార్టర్లో కూడా కొనసాగనున్నదని పేర్కొంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 170 కోట్ల డాలర్లు, రెండో త్రైమాసిక కాలంలో 450 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టారని వివరించింది. ఇక దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ క్యూ1లో 40 లక్షల డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టారని, కానీ, క్యూ2లో 150 కోట్ల డాలర్ల నికర అమ్మకాలు జరిపారని వివరించింది. క్యూ2లో మ్యూచువల్ ఫండ్స 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది. పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు..: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయని ఐసీఐసీఐ డెరైక్ట్ నివేదిక వివరించింది. యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, టాటా మోటార్స్, రిలయన్స, ఎల్ఐసీ హౌసింగ్ కంపెనీల్లో అధికంగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెరుుంట్స్ల్లో విదేశీ నిధుల ఉపసంహరణ జరిగిందని వెల్లడించింది. వాహన, లోహ, ఆర్థిక, ఇంధన తదితర దేశీయ ఆర్థిక కేంద్రీకృత రంగాల్లోని షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారని, ఫార్మా, ఐటీ వంటి విదేశీ సంబంధిత రంగాల్లోని షేర్లలో అమ్మకాలు జరిపారని నివేదిక పేర్కొంది. -
ఎస్బీఐపై మొండిబకాయిల బండ
• క్యూ2లో లాభం రూ.21 కోట్లే... 99.6 శాతం డౌన్ • స్థూల మొండిబకారుులు 7.14 శాతానికి జంప్... • భారీగా ఎగబాకిన ఎన్పీఏ కేటారుుంపులు... ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు మొండి బకారుులు(ఎన్పీఏ) షాకిచ్చారుు. బ్యాంక్ కన్సాలిడేటెడ్(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం ఘోరంగా పడిపోరుుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో బ్యాంక్ కేవలం రూ.20.7 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,992 కోట్లతో పోలిస్తే... ఏకంగా 99.6 శాతం దిగజారడం గమనార్హం. ప్రధానంగా ఎన్పీఏలకు కేటారుుంపులు(ప్రొవిజనింగ్) భారీగా పెరగడం, నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) స్వల్పంగానే వృద్ధి చెందడం లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఇక క్యూ2లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.72,918 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.66,829 కోట్లతో పోలిస్తే.. 9.1 శాతం వృద్ధి నమోదైంది. స్టాండెలోన్‌గా 35 శాతం తగ్గుదల... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల(స్టాండెలోన్) ప్రాతిపదికన ఎస్బీఐ నికర లాభం క్యూ2లో రూ.2,538 కోట్లకు తగ్గిపోరుుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,879 కోట్లతో పోలిస్తే 35 శాతం క్షీణించింది. ఆదాయం 8.2 శాతం పెరుగుదలతో రూ. 46,855 కోట్ల నుంచి రూ.50,743 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంక్ స్టాండెలోన్ లాభం రూ.2,697 కోట్లుగా, ఆదాయం రూ.57,421 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. రూ. లక్ష కోట్లకు దాటిన ఎన్పీఏలు... సమీక్షా కాలంలో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు దాదాపు రెట్టింపు అయ్యారుు. మొత్తం రుణాల్లో 7.14 శాతానికి ఎగబాకారుు. గతేడాది క్యూ2లో ఇవి 4.15 శాతంగా ఉన్నారుు. నికర ఎన్పీఏలు కూడా 2.14 శాతం నుంచి 4.19 శాతానికి రెట్టింపయ్యారుు. విలువ పరంగా బ్యాంక్ స్థూల ఎన్పీఏలు రూ. లక్ష కోట్ల మార్కును దాటారుు. క్యూ2లో రూ.1.05,783 కోట్లకు పేరుకుపోయారుు. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.56,834 కోట్లు మాత్రమే. ఇక నికర ఎన్పీఏలు సైతం రూ.28,592 కోట్ల నుంచి రూ.60,013 కోట్లకు దూసుకెళ్లారుు. కాగా, ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 6.94 శాతం, నికర ఎన్పీఏలు 4.05 శాతంగా ఉన్నారుు. మొండిబకారుులకు కేటారుుంపులు క్యూ2లో రూ.6,387 కోట్ల నుంచి రూ.8,686 కోట్లకు ఎగబాకారుు. కాగా, ఎస్బీఐ గ్రూప్ మొత్తం స్థూల ఎన్పీఏల నిష్పత్తి(జీఎన్‌పీఏ) రెట్టింపునకు పైగా ఎగసి 4.32 % నుంచి 8.49 శాతానికి చేరింది. నికర ఎన్పీఏలు 2.27% నుంచి 5.1 శాతానికి ఎగసింది. తాజా ఎన్పీఏలు రెట్టింపు... ఈ మూడు నెలల కాలంలో కొత్తగా రూ.10,341 కోట్ల విలువైన రుణాలు ఎన్పీఏలుగా మారారుు. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,875 కోట్లతో పోలిస్తే రెట్టింపయ్యారుు. మొండిబకారుులుగా మారే అవకాశం ఉన్న రుణాలకు సంబంధించి పరిశీలన జాబితా(వాచ్‌లిస్ట్) పరిమాణం రూ.25,951 కోట్లుగా నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 1.3% పెరిగి రూ.14,253 కోట్ల నుంచి రూ.14,437 కోట్లకు చేరింది. ⇔ ఇతర ఆదాయం 35.9% పెరిగి రూ.8,424 కోట్లుగా నమోదైంది. ⇔ బ్యాంక్ మొత్తం రుణాలు సెప్టెంబర్ చివరినాటికి రూ.14,81,831 కోట్లకు చేరారుు. క్రితం ఏడాది ఇదే కాలంలో రుణాలు రూ.13,37,153 కోట్లతో పోలిస్తే రుణ వృద్ధి 8.1%గా నమోదైంది. ⇔ మొత్తం డిపాజిట్ల పరిమాణం రూ.16,34,114 కోట్ల నుంచి రూ.18,58,999 కోట్లకు ఎగబాకారుు. 13.7 శాతం వృద్ధి చెందారుు. ⇔ ఎస్బీఐ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 3 శాతం దిగజారి రూ.273 వద్ద స్థిరపడింది. ఎన్పీఏలకు కేటారుుంపులు 36 శాతం ఎగబాకడం లాభాలపై ప్రభావం చూపింది. ప్రధానంగా వాచ్లిస్ట్లోని రుణాల నుంచే కొత్త ఎన్పీఏలు జతయ్యారుు. వాచ్ లిస్ట్ పరిమాణం రానున్న కాలంలో మరో 5,000-7,000 కోట్లు తగ్గే అవకాశం ఉంది. ఇక రెండో త్రైమాసికంలో రుణవృద్ధి అనుకున్నదానికంటే చాలా నెమ్మదించింది. కొన్ని రంగాలకు రుణాల జారీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడమే దీనికి కారణం. అరుుతే, మూడో క్వార్టర్ నాటికి 11-12 శాతం రుణ వృద్ధి అంచనాలను చేరుకుంటామని భావిస్తున్నాం. ఇక టాటా గ్రూప్‌లో సైరస్ మిస్త్రీని చైర్మన్‌గా తొలగించిన తర్వాత నెలకొన్న విభేదాలపై మాకేమీ ఆందోళన లేదు(గ్రూప్ కంపెనీలకు ఎస్బీఐ భారీగానే రుణాలిచ్చింది). ఎందుకంటే సమర్థవంతమైన ప్రొఫె షనల్స్ ఉన్న టాటా గ్రూప్... ఈ తాత్కాలిక సమస్యలను వేగంగానే పరిష్కరించుకోగలదన్న విశ్వాసం ఉంది’. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ -
వేదాంత లాభం17 శాతం వృద్ధి
• క్యూ2లో రూ.1,251 కోట్లుఆదాయంలో తగ్గుదల • స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమని ప్రకటన న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 1,251 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,069 కోట్లతో పోలిస్తే లాభంలో 17 శాతం వృద్ధి నమోదైంది. నిర్వహణ పనితీరు మెరుగుపడడం లాభాల వృద్ధికి కారణమైంది. ఆదాయం మాత్రం రూ.18,898 కోట్ల నుంచి రూ.18,029 కోట్లకు పడిపోయింది. భవిష్యత్తులో స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమని కంపెనీ ప్రకటించింది. నిర్వహణ పనితీరు కారణంగానే అధిక లాభం వచ్చినట్టు వేదాంత ప్రెసిడెంట్ (ఫైనాన్స్), గ్రూపు సీఎఫ్‌వో జీఆర్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. అధిక ఇబిటా, మంచి ధరలు కూడా కలసివచ్చినట్టు చెప్పారు. కాగా, భారత్‌లో భవిష్యత్తులో స్టీల్ డిమాండ్ పెరిగితే తమ వ్యాపారానికి అదనపు విలువ చేకూర్చేందుకు వీలుగా ఆ అవకాశాలను పరిశీలిస్తామని వేదాంత లిమిటెడ్ సీఈవో టామ్ ఆల్బనీస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం తమ ఐరన్‌వోర్ వ్యాపారం చాలా బలంగా ఉందని, ఈ దృష్ట్యా ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు. భారత్ 8-9 శాతం వృద్ధిని పదేళ్లపాటు నమోదుచేస్తే పెద్దఎత్తున స్టీల్‌ను వినియోగించే దేశంగా మారుతుందని వివరించారు. -
క్యూ2లో 10 శాతం పెరిగిన ఐటీసీ లాభం
• క్యూ2లో రూ.2,500 కోట్లు • కలసివచ్చిన సిగరెట్ల అమ్మకాలు న్యూఢిల్లీ: సిగరెట్ల అమ్మకాలు అధిక స్థాయిలో ఉండడంతో ఐటీసీ లిమిటెడ్ స్టాండలోన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 10% వృద్ధి చెంది రూ.2,500 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.2,262 కోట్లుగా ఉంది. ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.13,616 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.12,611 కోట్లు. ఈ మేరకు ఐటీసీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచ్చింది. కేవలం సిగరెట్లు, ఎఫ్ఎంసీజీ ద్వారా ఆదాయం 8.51 శాతం వృద్ది చెంది రూ.11,200గా నమోదైంది. కేవలం సిగరెట్ల విక్రయాల ద్వారా ఆదాయం 7 శాతం పెరిగి రూ.8,528 కోట్లుగా నమోదైంది. ఇన్పుట్ వ్యయం పెరిగిపోవడం, అమ్మకాలపై ఒత్తిళ్లు, ఎఫ్ఎంసీజీ రంగంలో డిమాండ్ మందగించడం వంటి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్టు ఐటీసీ తెలిపింది. రెండో త్రైమాసికంలో ఇబిటా 7.3 శాతం వృద్ధి చెందింది. మార్జిన్ల శాతం 26.8 శాతం నుంచి 26.7 శాతానికి తగ్గింది. ఐటీసీ హోటల్స్ వ్యాపారం 2.50 శాతం వృద్ధి సాధించింది. హోటల్స్ ద్వారా రూ.297 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అగ్రి వ్యాపారం ద్వారా ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.1,880కోట్లుగా నమోదైంది. పేపర్ బోర్డ్, పేపర్, ప్యాకేజింగ్ ద్వారా వచ్చిన ఆదాయం పెద్దగా మార్పు ఏమీ లేకుండా రూ.1,331 కోట్లుగా నమోదైంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 309 కోట్లు
• క్యూ2లో 60 శాతం డౌన్ • అమెరికా, వర్ధమాన మార్కెట్లలో తగ్గిన అమ్మకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం సుమారు 60 శాతం క్షీణించి రూ. 309 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 775 కోట్లు. ఈసారి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం సైతం 10 శాతం క్షీణతతో సుమారు రూ. 4,021 కోట్ల నుంచి రూ. 3,616 కోట్లకు తగ్గింది. ఉత్తర అమెరికా మార్కెట్లో కొన్ని కీలక ఔషధాలకు సంబంధించి ధరలపరమైన ఒత్తిళ్లతో అమ్మకాలు తగ్గడం కారణంగా స్థూల లాభాల మార్జిన్ 56 శాతం మేర క్షీణించినట్లు కంపెనీ తెలిపింది. వెనిజులాలో ప్రతికూల పరిస్థితులు, వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు క్షీణించడం.. ఆదాయం తగ్గుదలకు మరో కారణమని పేర్కొంది. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు కొనసాగవచ్చని, అయితే మరిన్ని కొత్త ఉత్పత్తుల ఆవిష్కరించడం ద్వారా వృద్ధి మెరుగుపర్చుకోగలమని డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వెనిజులా నుంచి రావాల్సిన ఫార్మా బకాయిల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. క్యూ2లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై దాదాపు రూ. 520 కోట్లు వెచ్చించినట్లు చక్రవర్తి తెలిపారు. ఔషధాల ధరలను నియంత్రించేలా నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ జారీ చేసిన కొన్ని నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ ఇండియన్ ఫార్మా అలయెన్స్ 2014 జులైలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో భవిష్యత్‌లో ఎదురయ్యే రూ. 34.4 కోట్ల ఖర్చులను విక్రయ వ్యయాల కింద చూపాల్సి వచ్చినట్లు వివరించారు. మరోవైపు, సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనపర్చడంతో కంపెనీ ఆదాయం 11 శాతం, స్థూల లాభం 61 శాతం మేర పెరిగింది. వృద్ధి ప్రణాళికలు .. అధిక వృద్ధి సాధించే క్రమంలో కొంగ్రొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు, త్వరలో బ్రెజిల్‌లోనూ అడుగుపెట్టనున్నట్లు ముఖర్జీ తెలిపారు. ఇకనుంచి ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు కొత్త దేశాల మార్కెట్లలో ప్రవేశించాలని భావిస్తున్నట్లు సంస్థ సీవోవో అభిజిత్ ముఖర్జీ చెప్పారు. అలాగే ప్రతీ సంవత్సరం తరహాలోనే ఈసారీ రూ. 1,000-రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రూ. 632 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం, మిర్యాలగూడ, దువ్వాడ ప్లాంట్లలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఈ ఏడాది జనవరి, మార్చి, మే, ఆగస్టుల్లో అమెరికా ఎఫ్‌డీఏకి నివేదికలు పంపామని, మరోసారి ప్లాంట్లను పరిశీలించాలని కోరినట్లు ముఖర్జీ వివరించారు. ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 40 మిలియన్ డాలర్లు వ్యయమైనట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్లాంటును ఇటీవలే కెనడాకు చెందిన ఔషధ రంగ నియంత్రణ సంస్థ పరిశీలించినట్లు ముఖర్జీ వివరించారు. రెండో త్రైమాసికంలో డీఆర్ఎల్ గ్లోబల్ జెనరిక్ విభాగం ఆదాయం 12% తగ్గి 2,900 కోట్లకు పరిమితమైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 13%, యూరప్‌లో 16%, వర్ధమాన మార్కెట్లలో 27 శాతం తగ్గాయి. అయితే భారత్‌లో మాత్రం 14 శాతం మేర వృద్ధి చెందాయి. ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు భారత్‌లో 21 శాతం క్షీణించగా.. అమెరికాలో 64 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2 శాతం క్షీణతతో రూ. 578 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ షేరు సుమారు 3.5 శాతం పెరిగి రూ. 3,200 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభం 20% వృద్ధి
• క్యూ2లో రూ.3,455 కోట్లు • కలసి వచ్చిన రిటైల్ రుణాలు • 19% పెరిగిన నికర వడ్డీ ఆదాయం ముంబై: రిటైల్ రుణాలు కలసి రావడంతో ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 20.4 శాతం వృద్ధి చెంది రూ.3,455 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభం రూ.2,869 కోట్లుగా ఉంది. ఆదా యం రూ.19,970 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.17,324 కోట్లతో పోలిస్తే 15 శాతానికిపైగా వృద్ధి సాధించినట్టు తెలుస్తోంది. అధిక మార్జిన్లతో కూడిన రిటైల్ రుణాలు 22 శాతం వృద్ధి చెందడంతో నికర వడ్డీ ఆదాయం భారీగా పెరిగింది. నికర వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో 19.6 శాతం పెరిగి రూ.7,993 కోట్లకు చేరింది. బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ 4.2 శాతంగా ఉంది. రిటైల్ రుణాల కారణంగా బ్యాంకు మొత్తం రుణాలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 18.1 శాతం వృద్ధి చెందినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. బ్యాంకు ఇతర ఆదాయం సైతం 13.7 శాతం పెరిగి రూ.2,901 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 0.90 శాతం నుంచి రూ.1.02 శాతానికి పెరిగాయి. వీటికి చేసిన కేటాయింపులు రూ.749 కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి చూసుకుంటే బ్యాంకు నికర లాభం 20.3 శాతం పెరిగి రూ.6,694 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.5,565 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా రూ.33,827 కోట్ల నుంచి రూ.39,293 కోట్లకు చేరుకుంది. -
‘యాక్సిస్’కు మొండి బకాయిల దెబ్బ..
• క్యూ2లో లాభం 83% తగ్గుదల • రూ.319 కోట్లుగా నమోదు ముంబై: మొండి బకాయిలకు అధిక కేటాయింపులతో యాక్సిక్ బ్యాంకు లాభం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 83 శాతం క్షీణించింది. రూ.319 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసిక కాలంలో బ్యాంకు రూ.1,915 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. తాజా త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు 5 రెట్లు పెరిగి రూ. 3,623 కోట్లకు చేరడం...బ్యాంకు లాభాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం మాత్రం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.12,001 కోట్ల నుంచి రూ.13,698 కోట్లకు పెరిగింది. స్థూల ఎన్పీఏలు 4.17 శాతం, నికర ఎన్పీఏలు 2.02 శాతానికి పెరిగిపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.4,514 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ.4,062 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.64 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలోనూ బ్యాంకు లాభం 52 శాతం క్షీణించి రూ.1,875 కోట్లకు పరిమితం అయింది. ఈ మేరకు యాక్సిక్ బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకు ‘వాచ్‌లిస్ట్’లో ఉన్న వసూలు కాని రుణాలు 32 శాతానికి తగ్గాయి. ఇవి రూ.13,789 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు త్రైమాసికంలో వాచ్‌లిస్ట్‌లో వున్న రుణాల్లో రూ. 7,288 కోట్లు ఎన్పీఏలుగా మారిపోవడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో వాచ్‌లిస్ట్‌లో వున్న రుణాల మొత్తం తగ్గింది. -
విప్రో ఫలితాలు.. ప్చ్..!
• క్యూ2లో లాభం రూ.2,070 కోట్లు.. 7.6 శాతం డౌన్ • 10.5 శాతం పెరిగిన ఆదాయం.. రూ.13,897 కోట్లు • నిరుత్సాహపరిచిన క్యూ3 గెడైన్స్... బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో... నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 7.6 శాతం దిగజారి రూ.2,070 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 2,241 కోట్లుగా ఉంది. కాగా, ఒక్క ఐటీ సేవలకు సంబంధించి క్యూ2లో కంపెనీ 1.916 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే, ఈ ఏడాది ఆరంభంలో కంపెనీ అంచనా(గెడైన్స్) వేసిన 1.931-1.950 బిలియన్ డాలర్లతో పోలిస్తే తగ్గడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం 10.5 శాతం పెరుగుదలతో రూ.13,897 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.12,567 కోట్లు. సీక్వెన్షియల్‌గా ఇలా... ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,052 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ2లో లాభం స్వల్పంగా 0.9 శాతమే పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ.13,698 కోట్లతో పోలిస్తే 1.5 శాతం వృద్ధి చెందింది. ఇక ఐటీ సేవల ఆదాయం కూడా సీక్వెన్షియల్‌గా 0.2 శాతమే(రూ.13,136 కోట్లు) పెరిగింది. విశ్లేషకులు క్యూ2లో ఐటీ సేవలకు సంబంధించి ఆదాయం సీక్వెన్షియల్‌గా డాలర్లలో 0.4 శాతం, రూపాయిల్లో 1.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. కాగా, స్థిర కరెన్సీ ప్రాపతిపదికన ఆదాయాలు గెడైన్స్‌కు అనుగుణంగానే నమోదయ్యాయని కంపెనీ సీఈఓ అబిదాలి నీముచ్వాలా పేర్కొన్నారు. గెడైన్స్ తగ్గింది... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయ అంచనా(గెడైన్స్)ను కూడా విప్రో తగ్గించింది. 1.916-1.955 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. ప్రధానంగా ఐటీ సేవలకు మిశ్రమ డిమాండ్ పరిస్థితులు, సీజనల్‌గా బలహీన క్వార్టర్(పనిదినాలు తక్కువగా ఉండటం కారణంగా) నేపథ్యంలో గెడైన్స్‌ను తగ్గించాల్సి వచ్చిందని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాాగా, పరిశ్రమ విశ్లేషకులు క్యూ3లో 1-3 శాతం ఆదాయ వృద్ధి ఉండొచ్చని అంచనా వేయగా.. విప్రో గెడైన్స్ 0-2 శాతానికే పరిమితం కావడం గమనార్హం. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ ఐటీ ఉత్పత్తుల ఆదాయం క్యూ2లో రూ.544 కోట్ల నుంచి రూ.770 కోట్లకు ఎగబాకింది. ⇔ సెప్టెంబర్ చివరినాటికి ఐటీ సేవల విభాగం మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,74,238కి చేరింది. ⇔ ఇక అమెరికా వ్యాపారం ఆదాయం క్యూ2లో 1.8 శాతం, యూరప్ ఆదాయం 0.3 శాతం చొప్పున సీక్వెన్షియల్‌గా వృద్ధి చెందింది. ⇔ కాగా, అమెరికా క్లౌడ్ సేవల కంపెనీ అపిరియోను 50 కోట్ల డాలర్ల(దాదాపు రూ.3,350 కోట్లు) మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు విప్రో గురువారం(20న) ప్రకటించిన సంగతి తెలిసిందే. ⇔ విప్రో షేరు శుక్రవారం బీఎస్ఈలో 0.75% లాభంతో రూ.499 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను వెల్లడించింది. -
టీసీఎస్ లాభం 6,586 కోట్లు
• క్యూ2లో 8.4 శాతం వృద్ధి • ఆదాయం రూ. 29,284 కోట్లు; 8 శాతం అప్ • రూ. 6.5 మధ్యంతర డివిడెండ్ ముంబై: దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్ మార్కెట్ విశ్లేషకుల అంచనాలతో పోలిస్తే మిశ్రమంగా ఫలితాల సీజన్‌ను ఆరంభించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ రూ.6,586 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.6,073 కోట్లతో పోలిస్తే 8.4 శాతం వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో క్లయింట్లు ఐటీ వ్యయాల విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారని టీసీఎస్ పేర్కొంది. అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధం చాలా మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక కన్సాలిడేట్ ఆదాయం కూడా దాదాపు 8 శాతం పెరుగుదలతో రూ.29,284 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ. 27,165 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా ఇలా... ♦ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభం రూ.6,317 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) క్యూ2లో 4.3 శాతం వృద్ధి సాధించింది. అయితే, ఆదాయం మాత్రం క్యూ1లో రూ.29,305 కోట్లతో పోలిస్తే స్వల్పంగా (0.1%) తగ్గింది. ఐటీ కంపెనీలకు సీజనల్‌గా ఆదాయాల పరంగా పటిష్టమైన క్వార్టర్‌గా క్యూ2ను పరిగణిస్తారు. డాలర్ల రూపంలో ఆదాయం 0.3 శాతం మాత్రమే వృద్ధి చెంది 4.362 బిలియన్ డాలర్ల నుంచి 4.374 బిలియన్ డాలర్లకు చేరింది. మార్జిన్లు స్థిరంగానే కొనసాగినప్పటికీ.. ఇతర అంశాల్లో మార్కెట్ వర్గాల అంచనాలను టీసీఎస్ అందుకోలేకపోయింది. లాభం సీక్వెన్షియల్‌గా 0.9 శాతం తగ్గి రూ.6,290 కోట్లుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇక ఆదాయం 1.5 శాతం వృద్ధితో రూ. 29,738 కోట్లుగా అంచనా వేశారు. డాలర్లలో ఆదాయం 1.8 శాతం వృద్ధి చెంది 4.44 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని లెక్కగట్టారు. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ క్యూ1లో నిర్వహణ మార్జిన్ 0.94 శాతం పెరిగి 26 శాతానికి చేరింది. ♦ యూరప్ వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా పటిష్టమైన 3.7 శాతం వృద్ధి నమోదైంది. ఆసియా-పసిఫిక్ 3.5 శాతం, ఉత్తర అమెరికా 1.4 శాతం చొప్పున వృద్ధి చెందాయి. బ్రిటన్‌కు సంబంధించి వృద్ధి నామమాత్రంగానే ఉంది. ఇక భారత్ వ్యాపారం 7.6 శాతం తగ్గడం గమనార్హం. ♦ లైఫ్ సెన్సైస్-హెల్త్‌కేర్ విభాగంలో ఆదాయం సీక్వెన్షియల్ ప్రాతిపదికన 4.7 శాతం వృద్ధి చెందింది. ఇంధనం, యుటిలిటీ విభాగాల్లో ఆదాయం 3.6 శాతం పెరిగింది. ♦ జూలై-సెప్టెంబర్ కాలంలో కంపెనీ స్థూలంగా 22,665 మంది సిబ్బందిని జతచేసుకుంది. అయితే, 13,225 మంది ఉద్యోగులు వలసపోవడం(అట్రిషన్)తో నికరంగా 9,440 మంది మాత్రమే జతయ్యారు. ఇక సెప్టెంబర్ చివరినాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.71 లక్షలకు చేరింది. అట్రిషన్ రేటు 11.9 శాతానికి పరిమితమైంది. ♦ రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుపై కంపెనీ రూ.6.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ♦ గురువారం టీసీఎస్ షేరు ధర బీఎస్ఈలో 2.17 శాతం నష్టపోయి రూ.2,329 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.10,167 కోట్లు దిగజారి రూ.4,58,814 కోట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. ♦ రెండో త్రైమాసికం పనితీరు చాలా అసాధారణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతుండటంతో క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో క్యూ2లో ఐటీ వ్యయాలు తగ్గేందుకు దారితీసింది. మరోపక్క భారత్, లాటిన్ అమెరికా మార్కెట్లలో ఒడిదుడుకులు కూడా ఆదాయ వృద్ధి మందకొడిగా ఉండేందుకు కారణమైంది. అయితే, అనేక సమస్యలు నెలకొన్నప్పటికీ.. లాభాల విషయంలో క్యూ2లో మంచి పనితీరును నమోదుచేయగలిగాం. ♦ కార్యకలాపాల నిర్వహణలో మేం అనుసరిస్తున్న క్రమశిక్షణ కారణంగా మార్జిన్లను కూడా పటిష్టంగానే కొనసాగించగలిగాం. వచ్చే రెండు క్వార్టర్లలో పనితీరు గడిచిన కొన్నేళ్లలో ఇవే క్వార్టర్లతో పోలిస్తే అత్యంత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాం. క్యూ2లో జాప్యమైన పలు ప్రాజెక్టులు ద్వితీయార్ధంలో కార్యరూపం దాల్చనున్నాయి. కొత్తతరం డిజిటల్ టెక్నాలజీల్లో సుమారు 1.8 లక్షల మంది కంపెనీ ఉద్యోగులు శిక్షణను పూర్తిచేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, బ్రెగ్జిట్ ప్రభావం మా వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని భావించడం లేదు. అయితే, కొంతమంది క్లయింట్ల ఐటీ పెట్టుబడులు జాప్యం కావడానికి ఆస్కారం ఉంది. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ -
క్యూ2లో 60 శాతం మార్కెట్ వాటా
• రూ.10 వేల లోపుండే కన్జూమర్ డ్యూరబుల్స్‌లో.. • తొలిసారి 0 శాతం వడ్డీకి రుణాలు • హోమ్ క్రెడిట్ ఇండియా సీఎంఓ థామస్ హృడికా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) హోమ్ క్రెడిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2016 రెండో త్రైమాసికంలో 60 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. హైదరాబాద్‌లో రూ.10 వేలలోపు కన్జూమర్ డ్యూరబుల్ రుణాల విభాగంలో ఈ ఘనత సాధించినట్లు హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ థామస్ హృదికా గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారి కస్టమర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై 0% వడ్డీకి రుణాలను ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఇందుకోసం జియోని, ఇంటెక్స్, లావా, మైక్రోమ్యాక్స్, ఒప్పో వంటి అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. రెండేళ్ల క్రితం నగరంలో కార్యకలాపాలను ప్రారంభించిన హోమ్ క్రెడిట్‌కు ప్రస్తుతం 250 పీఓఎస్‌లు ఉన్నాయని, ఈ ఏడాది చివరికి 400కు విస్తరిస్తామన్నారు. సెల్ఫోన్లు, గృహోపకరణాలు, ద్విచక్రవాహనాల కొనుగోలుదారులకు కేవలం 5 నిమిషాల్లోనే రుణాలు పొందేలా టెక్నాలజీని అభివృద్ధి చేశామని... ఆయా స్టోర్లలోనే ఫైనాన్సింగ్ సేవలను అందించడం తమ ప్రత్యేకతని తెలియజేశారు. మనదేశంతో పాటు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా వంటి 10 దేశాల్లో సేవలందిస్తోంది. -
ఐటీ రంగానికి ‘క్యూ2’ కష్టాలు?
• నేడు టీసీఎస్ ఫలితాలతో సీజన్ షురూ.. • వృద్ధి తీవ్రంగా మందగించొచ్చంటున్న విశ్లేషకులు • బ్రెగ్జిట్, బీఎస్ఎఫ్ఐ క్లయింట్ల వ్యయాల తగ్గుదల, • కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గుల ప్రభావం ముంబై: దేశీ ఐటీ కంపెనీలకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో దిగ్గజ ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు అత్యంత నిరాశాజనకంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నేడు(గురువారం) అగ్రగామి టీసీఎస్‌తో క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడనున్నాయి. సాధారణంగా రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు సీజనల్‌గా చాలా పటిష్టమైన వృద్ధి నమోదుచేస్తుంటాయని.. అయితే, ఇప్పుడు దీనికి భిన్నంగా ఫలితాలు వెలువడవచ్చనేది విశ్లేషకుల మాట. కాగా, టీసీఎస్ ఇప్పటికే దీనికి సబంధించిన సంకేతాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్)తో పాటు బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సేవల విభాగం(బీఎస్ఎఫ్ఐ) క్లయింట్ల ఐటీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం కూడా దేశీ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. మొత్తం ఐదు టాప్ ఐటీ కంపెనీలకు సంబంధించి క్యూ2 ఆదాయం(సీక్వెన్షియల్‌గా) కేవలం 1.5 శాతం మాత్రమే వృద్ధి చెందొచ్చనేది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. గడిచిన దశాబ్ద కాలంలో ఇదే అత్యంత బలహీన క్యూ2గా నిలవనుందని కూడా అభిప్రాయపడింది. టీసీఎస్ పరిస్థితి ఏంటి? క్యూ2లో టీసీఎస్ స్థిర కరెన్సీ ప్రాతిపదికన వృద్ధి సీక్వెన్షియల్‌గా(క్యూ1తో పోలిస్తే) పెద్దగా పెరగకపోవచ్చని భావిస్తున్నారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో జూలై-సెప్టెంబర్ మధ్య బ్రిటన్ పౌండ్ డాలరుతో పోలిస్తే 8.4 శాతంమేర దిగజారింది. దీనికి తోడు ఇతర కరెన్సీల తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో క్యూ2లో డాలరు ఆదాయాలపై 40-80 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ప్రతికూల ప్రభావం ఉండొచ్చని బ్రోకరేజి కంపెనీల విశ్లేషకులు పేర్కొన్నారు. డాలరు ఆదాయంలో సీక్వెన్షియల్‌గా 1.5 శాతం వృద్ధి ఉండొచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ పేర్కొంది. సెంట్రమ్ బ్రోకింగ్ మాత్రం ఈ వృద్ధి 2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. టీసీఎస్ ఆదాయంలో బ్రిటన్ పౌండ్ల రూపంలో 13 శాతం నమోదవుతోంది. సీక్వెన్షియల్ డాలరు ఆదాయ వృద్ధికి సంబంధించి టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రోలకు కూడా ఈ క్యూ2 అత్యంత బలహీన క్వార్టర్‌గా నిలిచే అవకాశం ఉందనేది రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనా. దేశీ ఐటీ కంపెనీలకు అత్యధిక ఆదాయం లభించే అమెరికాలో బీఎస్ఎఫ్ఐ విభాగం క్లయింట్ల వ్యయాలు మందగించడం వృద్ధిపై ప్రభావం చూపుతుందని బ్రోకరేజి కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదే విషయంపై టీసీఎస్ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది కూడా. దీనికి తోడు పోటీ విపరీతంగా పెరగడంతో ప్రైసింగ్ ఒత్తిళ్లు కూడా రానున్న కొద్ది క్వార్టర్లలో దేశీ ఐటీ కంపెనీల రాబడులకు ప్రతికూలంగా నిలవనుందని అంటున్నాయి. కాగా, టీసీఎస్ ఆదాయంలో అత్యధికం (40.4%) బీఎస్ఎఫ్ఐ విభాగానిదే కావడం గమనార్హం. లాభాలు తగ్గొచ్చు... ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్, క్యూ1)లో టీసీఎస్ రూ.6,497 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ4లో రూ.6,413 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 1.31 శాతం వృద్ధి నమోదైంది. కాగా, క్యూ2లో కంపెనీ రూ.6,178 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చని మరో బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ అభిప్రాయపడింది. ప్రధానంగా ఫారెక్స్ నష్టాల ప్రభావంతో ఇతర ఆదాయాలు దిగజారడం లాభాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే, ఎడెల్ వైజ్ మాత్రం నికర లాభం సీక్వెన్షియల్‌గా 1.1 శాతం, వార్షిక ప్రాతిపదికన(గతేడాది క్యూ2తో పోలిస్తే) 5.4 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. కాగా, ఇన్ఫోసిస్ నికర లాభం సీక్వెన్షియల్‌గా క్యూ2లో 2.6 శాతం తగ్గుదలతో రూ. 3,347 కోట్లుగా నమోదు కావచ్చని మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొంది. మొత్తం ఆదాయం 1.6 శాతం వృద్ధితో(వార్షిక ప్రాతిపదికన 9 శాతం వృద్ధి) రూ.17,048 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. -
చైనా బ్రాండ్లతో స్మార్ట్ ఫోన్ విక్రయాల జోష్..
♦ క్యూ2లో 17 శాతం వృద్ధి ♦ 2.75 కోట్లకు అమ్మకాలు న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో 2.75 కోట్ల యూనిట్లకు చేరాయి. చైనా కంపెనీలైన లెనొవొ, షావోమి, వివో వంటి కంపెనీలే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి. స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో గత త్రైమాసికంతో పోలిస్తే 17% వృద్ధి, గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 3.7% వృద్ధి నమోదయ్యింది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొబైల్ కంపెనీలు 2.35 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే క్యూ2లో పలు ఇతర దేశాలు సహా దేశీ మొబైల్ కంపెనీల స్మార్ట్‌ఫోన్ విక్రయాలు తగ్గితే.. చైనా కంపెనీల అమ్మకాలు మాత్రం 75 శాతం ఎగశాయి. జనవరి-మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లెనొవొ సహా షావోమి, వివో, జియోనీ, ఒప్పొ కంపెనీల విక్రయాలు 28 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రిటైల్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి నిలపడంతో ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 35 శాతం నుంచి 28 శాతానికి పడ్డాయి. గతేడాదితో క్యూ2తో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో ఫీచర్ ఫోన్ల విక్రయాలు 2.6 శాతం వృద్ధితో 3.37 కోట్ల యూనిట్లకు చేరాయి. కాగా శాంసంగ్ 25 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. ఇక దీని తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్ (12 శాతం), లెనొవొ గ్రూప్ (8%), ఇంటెక్స్ (7%), రిలయన్స్ జియో (6.8 %) ఉన్నాయి. -
బ్లూచిప్స్ ఫలితాలపై దృష్టి..
న్యూఢిల్లీ: పలు బ్లూచిప్ కంపెనీలు ప్రకటించే రెండో త్రైమాసికం(క్యూ2) ఆర్థిక పలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క, దసరా పండుగ నేపథ్యంలో గురువారం మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. గత వారం వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు కూడా సోమవారం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంచనాలను మించి రిలయన్స్ క్యూ2లో రికార్డు లాభాన్ని(రూ.6,720 కోట్లు) ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ప్రధాన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడియా సెల్యులార్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, హీరోమోటో కార్ప్, బజాజ్ ఆటో, విప్రో, కెయిర్న్ ఇండియా వంటివి ఉన్నాయి. మరోపక్క, బిహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ సరళిని కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని, దీంతో పాటు గ్లోబల్ మార్కెట్ల కదలికలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నట్లు ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర హెచ్చుతగ్గులు, కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు సమీప కాలంలో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఇక విదేశీ పరిణామాల విషయానికొస్తే.. నేడు(సోమవారం) చైనా ఈ ఏడాది మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలను వెల్లడించనుంది. గత వారం మార్కెట్... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా వేయొచ్చనే అంచనాలు బలపడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారంలోనూ లాభాలను కొనసాగించింది. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 27,214 వద్ద స్థిరపడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 48 పాయింట్ల లాభంతో 8,238 వద్ద ముగిసింది. మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల జోరు... విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మళ్లీ దేశీ మార్కెట్లో పెట్టుబడుల జోరును పెంచుతున్నారు. గత రెండు నెలల్లో భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో దాదాపు రూ.17,000 కోట్ల నిధులను నికరంగా వెచ్చించారు. ఈ నెల ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.3,295 కోట్లు, డెట్(బాండ్స్) మార్కెట్లో రూ.13,695 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఆర్బీఐ రేట్ల కోత, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా అంచనాలు దీనికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. విదేశీ మార్కెట్ల భారీ పతనం కారణంగా ఆగస్ట్‌లో రూ.17,524 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.5,784 కోట్లను దేశీ మార్టెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. -
ఆర్‌ఐఐఎల్ లాభం 30% డౌన్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఐఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 30 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.5.4 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.4.1 కోట్లకు తగ్గిందని ఆర్‌ఐఐఎల్ పేర్కొంది. నిర్వహణ ఆదాయం రూ.23.79 కోట్ల నుంచి రూ.21.48 కోట్లకు తగ్గిందని వివరించింది. -
అంచనాలు మించిన ఇన్ఫీ
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో ఆకట్టుకుంది. మరోపక్క, కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి డాలరు రూపంలో ఆదాయ అంచనా(గెడైన్స్)ను తగ్గించింది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) రాజీవ్ బన్సల్ కంపెనీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించడం ఈసారి ఫలితాల్లో ఆశ్చర్యకరమైన అంశం. క్యూ2లో రూ.3,398 కోట్ల నికర లాభం * వార్షికంగా 9.8%... త్రైమాసికంగా 12% అప్ * మొత్తం ఆదాయం రూ.15,635 కోట్లు; * వార్షికంగా 17%.. త్రైమాసికంగా 8.9% వృద్ధి * డాలర్ ఆదాయ గెడైన్స్ తగ్గింపు... * సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా... * ఒక్కో షేరుకి రూ.10 మధ్యంతర డివిడెండ్... బెంగళూరు: ఆకర్షణీయమైన ఫలితాలతో ఇన్ఫీ బోణీ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో రూ.3,398 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో నమోదైన రూ.3,090 కోట్ల లాభంతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 9.8 % వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 17% దూసుకెళ్లి రూ.13,342 కోట్ల నుంచి రూ.15,635 కోట్లకు ఎగబాకింది. ప్రధానంగా పటిష్టమైన ఆదాయ వృద్ధి, నిర్వహణ పనితీరు క్యూ2లో కంపెనీ మెరుగైన రాబడులకు దోహదం చేసింది. కాగా, డాలరు రూపంలో సెప్టెంబర్ క్వార్టర్‌కు ఇన్ఫీ ఆదాయం 6 శాతం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన 6.9 శాతం వృద్ధి) ఎగబాకి 2.392 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన 16 క్వార్టర్లలో ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. ఇక మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ2లో కంపెనీ ఆదాయం రూ.15,210 కోట్లుగా, లాభం రూ.3,244 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా ఇలా: ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1)లో రూ.3,030 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 12.1% ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా రూ.14,354 కోట్లతో పోలిస్తే 8.9% వృద్ధి చెందింది. గెడైన్స్ అటూఇటూ... డాలరు రూపంలో ప్రస్తుత 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గెడైన్స్‌ను ఇన్ఫోసిస్ తగ్గించింది. గతంలో ఆదాయ వృద్ది 7.2-9.2 శాతంగా అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 6.4%-8.4 శాతానికి పరిమితం చేసింది. ముఖ్యంగా డాలరుతో వివిధ ప్రధాన కరెన్సీల విలువల్లో తీవ్ర ఒడిదుడుకులే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. అయితే, స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ గెడైన్స్‌ను గతంలో పేర్కొన్నట్లుగానే 10-12 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. అయితే, ప్రస్తుత పూర్తి ఏడాదికి రూపాయల్లో ఆదాయ గెడైన్స్(కన్సాలిడేటెడ్)ను కంపెనీ 11.5-13.5 శాతం స్థాయి నుంచి 13.1-15.1 శాతానికి పెంచడం విశేషం. గతేడాది కంపెనీ మొత్తం ఆదాయం రూ.53,319 కోట్లుగా నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... * రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకి కంపెనీ రూ.10 చొప్పున(200 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. * క్యూ2లో కంపెనీ మార్జిన్లు 1.53 శాతం వృద్ధి చెంది 25.53 శాతంగా నమోదయ్యాయి. * సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ మొత్తం 82 కొత్త క్లయింట్లను జతచేసుకుంది. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 1,011కు చేరింది. కాగా, కొత్తవాటిలో 7.5 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు మూడు, 5 కోట్ల డాలర్ల కాంట్రాక్టు ఒకటి ఉంది. * 2015 ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్‌ను కూడా కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం కంపెనీ మొత్తం షేర్లలో 2 శాతానికి మించకుండా ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్) కింద ఉద్యోగులకు షేర్లు జారీ చేయాలని నిర్ణయించింది. * సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ వద్ద రూ.32,099 కోట్ల నగదు, తత్సంబంధ నిల్వలు ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర ఒకానొక దశలో 2.9 శాతం ఎగబాకి కొత్త గరిష్ట స్థాయి అయిన రూ.1,203ను తాకింది. అయితే, చివరకు 3.88 శాతం క్షీణించి రూ.1,123 వద్ద ముగిసింది. కంపెనీకి మరో టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై... ఇన్ఫీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా చేసినట్లు ఇన్ఫోసిస్ సోమవారం ఫలితాల సందర్భంగా వెల్లడించింది. ఆయన స్థానంలో ఎం.డి. రంగనాథ్ నేటి(మంగళవారం) నుంచి బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 2000వ సంవత్సరంలో రంగనాథ్ ఇన్ఫీలో చేరారు. అయితే, బన్సల్ ప్రస్తుత పదవి నుంచి వైదొలగుతున్నప్పటికీ.. సీఈఓ సిక్కా, డెరైక్టర్ల బోర్డుకు ఈ ఏడాది చివరివరకూ సలహాదారుగా కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘కంపెనీ వృద్ధికి విశేష సేవలందించిన రాజీవ్‌తో నేను 16 నెలల పాటు కలిసి పనిచేశా. ఆయన అపారమైన నైపుణ్యం గల వ్యక్తి. రాజీనామా చేయాలన్న రాజీవ్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. భవిష్యత్తులో ఆయన చేయబోయే విధుల్లో గొప్ప విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నా’ అని సీఈఓ విశాల్ సిక్కా వ్యాఖ్యానించారు. ఇన్ఫీలాంటి గొప్ప సంస్థలో పనిచేయడం తన అదృష్టమని.. అదేవిధంగా సిక్కా సారథ్యంలో కంపెనీ ఎంతో ప్రగతిని సాధించిందని బన్సల్ వ్యాఖ్యానించారు. 2013 తర్వాత ఇన్ఫీని వీడిన మూడో హైప్రొఫైల్ సీఎఫ్ఓ రాజీవ్ కావడం గమనార్హం. అంతక్రితం మోహన్‌దాస్ పాయ్, వి. బాలకృష్ణన్‌లు కంపెనీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. క్యూ2లో కంపెనీ మెరుగైన పనితీరును నమోదుచేయడం ఆనందంగా ఉంది. డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్ తగ్గింపునకు కరెన్సీ ఒడిదుడుకులే కారణం. ప్రస్తుతం మేం అనుసరిస్తున్న ‘న్యూ అండ్ రెన్యూ’ వ్యూహాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఏడాది 10-12 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమన్న నమ్మకం ఉంది. - విశాల్ సిక్కా,ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ ఈ ఏడాది 20 వేల క్యాంపస్ నియామకాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌ల నుంచి మొత్తం 20 వేల మంది గ్యాడ్యుయేట్లను ఫ్రెషర్స్‌గా నియమించుకోనున్నట్లు ఇన్ఫీ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు వెల్లడించారు. వారికి శిక్షణ కాలంలో రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీని చెల్లిస్తామని, నైపుణ్యాలు, అవసరాలను బట్టి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా కంపెనీలో చేర్చుకుంటామని తెలిపారు. కాగా, స్థూలంగా జూలై-సెప్టెంబర్ కాలంలో కంపెనీ 17,595 మంది ఉద్యోగులను నియమించుకుంది. 9,142 మంది సిబ్బంది వలసపోవడంతో నికరంగా 8.453 మంది ఉద్యోగులు జతయ్యారు. దీంతో సెప్టెంబర్ చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,87,976కు చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ2లో 19.9 శాతానికి పెరిగింది. క్యూ1లో ఇది 19.2 శాతంగా ఉంది. అయితే, గతేడాది క్యూ2లో 24.8 శాతం అట్రిషన్ రేటుతో పోలిస్తే భారీగా తగ్గడం విశేషం. -
క్యూ2లో అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం
వాషింగ్టన్ : అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది 2వ క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో సానుకూల రీతిలో 2.3 శాతంగా నమోదయ్యింది. వినియోగ వ్యయం పెరగడం(అమెరికా ఆర్థిక క్రియాశీలతలో ఈ విభాగం వాటా దాదాపు 70%), ఎగుమతుల్లో వృద్ధి వంటి అంశాలు దీనికి కారణమని వాణిజ్య శాఖ గురువారం పేర్కొంది. విశేషమేమిటంటే.. మొదటి క్వార్టర్ తొలి అంచనాలు సైతం మెరుగుపడ్డం. తొలి అంచనా ప్రకారం క్యూ1లో అసలు వృద్ధిలేకపోగా 0.2% వృద్ధి క్షీణత నమోదయ్యింది. అయితే సవరించిన అంచనాల ప్రకారం క్యూ1లో 0.6% వృద్ధి నమోదయ్యింది. మొదటి త్రైమాసికంలో వినియోగ వ్యయంలో 1.8% వృద్ధి నమోదయితే, ఇది క్యూ2లో 2.9 శాతానికి ఎగసింది. మొత్తానికి తాజా ఆర్థిక ఫలితాలు అమెరికన్లను ఉత్సాహపరుస్తున్నాయి. -
క్యూ2 జీడీపీ.. అంచనాలు మించిన చైనా
బీజింగ్: ఆర్థికాభివృద్ధికి సంబంధించి రెండవ త్రైమాసికంలో (క్యూ2, ఏప్రిల్-జూన్) చైనా అంచనాలను మించిన ఫలితాన్ని నమోదు చేసుకుంది. ఈ కాలంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. అయితే 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత ఇంత బలహీన వృద్ధి రేటు ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో చూస్తే జీడీపీ వృద్ధి రేటు 7 శాతం పెరుగుదలతో 29.7 ట్రిలియన్ యువాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు)లుగా నమోదయినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) తెలిపింది. మొదటి ఆరు నెలల కాలంలో జాతీయ ఆర్థికాభివృద్ధి తగిన స్థాయిలో ఉందని ఎన్బీఎస్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ సూచీలు రికవరీ, స్థిరత్వం, మెరుగుదల సంకేతాలను ఇస్తున్నట్లు వివరించింది. ఉద్దీపనలు...: 2014లో దేశ వృద్ధి రేటు 7.4%. 2013లో ఈ రేటు 7.7%గా ఉంది. ఈ ఏడాది 7% వృద్ధి ప్రభుత్వ లక్ష్యం. అయితే షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ భారీ పతనం ఈ లక్ష్య సాధనపై సందేహాలు లేవనెత్తుతోంది. బీజింగ్ మాత్రం ఇన్వెస్టర్ విశ్వాసం వృద్ధికి పలు ఆర్థిక ఉద్దీపన చర్యలను చేపడుతోంది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభంలో 28% వృద్ధి
1:1 నిష్పత్తిలో బోనస్ న్యూఢిల్లీ: దేశీయంగా నాలుగో అతి పెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 28 శాతం పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 1,915 కోట్లుగా నమోదైంది. క్రితం సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 1,496 కోట్లు. ఇంజనీరింగ్ సర్వీసులు వృద్ధి చెందడం, డిజిటల్ సేవలపై కస్టమర్లలో ఆసక్తి పెరుగుతుండటం ఇందుకు దోహదపడిందని హెచ్‌సీఎల్ తెలిపింది. రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు కూడా జారీ చేయాలని నిర్ణయించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. తాజా క్యూ2లో ఆదాయాలు 13.4 శాతం వృద్ధి చెంది రూ. 9,283 కోట్లకు పెరిగినట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఐటీ సేవల పరిధి మరింతగా పెరుగుతోందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివ నాడార్ తెలిపారు. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వీసులు అందిస్తున్న తమ సంస్థ వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయన్నారు. క్యూ2లో హెచ్‌సీఎల్ ఉద్యోగుల సంఖ్య నికరంగా 4,718 పెరిగి 1,00,240కి చేరింది. బంపర్ ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 9% ఎగబాకి రూ.1,794 వద్ద ముగిసింది. -
మారుతి లాభం జూమ్..
క్యూ2లో రూ. 863 కోట్లు; 29% వృద్ధి న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడం, వ్యయ నియంత్రణ చర్యల ఆసరాతో వాహన దిగ్గజం మారుతి సుజుకీ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో కంపెనీ నికర లాభం 28.69 శాతం దూసుకెళ్లి రూ.863 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.670 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.11,996 కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.10,212 కోట్లతో పోలిస్తే 17.47 శాతం వృద్ధి చెందింది. వాటాదార్లకు ఉత్సాహాన్నిచ్చే చర్యల్లో బాగంగా డివిడెండ్ చెల్లింపు నిష్పత్తిని పెంచేందుకు కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈమేరకు నిబంధనల్లో మార్పులకు ఓకే చెప్పింది. ఇప్పటిదాకా నికర లాభంలో సగటున 10-15 శాతాన్ని డివిడెండ్ చెల్లింపునకు ప్రామాణికంగా తీసుకుంటుండగా.. దీన్ని ఇప్పుడు 18-30 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) పెట్టుబడి పరిమితిని ఇప్పుడున్న 24 శాతం నుంచి 40 శాతానికి పెంచే ప్రతిపాదనను కూడా కంపెనీ ఆమోదించింది. వాటాదారులు, రిజర్వ్ బ్యాంకు అనుమతులకు లోబడి ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. అయితే, గుజరాత్ ప్లాంట్‌ను పూర్తిగా మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధీనంలో ఉంచే అంశానికి సంబంధించి మైనారిటీ షేర్‌హోల్డర్ల ఓటింగ్‌కు తుది తేదీని మాత్రం కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. -
ఓరియంటల్ బ్యాంక్ లాభం 16% అప్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ (క్యూ2) కాలానికి రూ. 291 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 251 కోట్లతో పోలిస్తే ఇది 16% వృద్ధి. వడ్డీయేతర ఆదాయంతోపాటు, రికవరీలు పెరగడం ప్రధానంగా లాభాల్లో వృద్ధికి దోహదపడినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ భూపిందర్ నయ్యర్ చెప్పారు. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.77% నుంచి 4.74%కు ఎగశాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 2.69% నుంచి 3.29%కు పెరగడంతో బీఎస్ఈలో షేరు 4.3% పతనమై రూ. 267 వద్ద ముగిసింది. కాగా, రుణాల నాణ్యత సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ, సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలనూ చేపట్టినట్లు నయ్యర్ చెప్పారు. ఈ కాలంలో వడ్డీయేతర ఆదాయం 26% జంప్‌చేసి రూ. 393 కోట్లకు చేరింది. గతంలో రూ. 312 కోట్లుగా ఉంది. ఇక రికవరీలు సైతం రూ. 314 కోట్ల నుంచి రూ. 339 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం దాదాపు 7% పుంజుకుని రూ. 5,328 కోట్లను అధిగమించింది. గతంలో రూ. 4,988 కోట్ల ఆదాయం నమోదైంది. తాజా బకాయిలు ప్రస్తుత సమీక్షా కాలంలో ఎన్పీఏలలో భాగమైన తాజా బకాయిలు(స్లిప్పేజెస్) రూ. 978 కోట్లకు చేరాయి. గతంలో ఇవి రూ. 1,041 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు, కంటింజెన్సీలు రూ. 550 కోట్ల నుంచి రూ. 641 కోట్లకు ఎగశాయి. కాగా, నిర్వహణ లాభం రూ. 825 కోట్ల నుంచి నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. ఇక 2.6% నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) సాధించగా, కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 10.88%గా నమోదైంది.