అనిశ్చితిలో మార్కెట్..! | Trump fears prompt market nosedive | Sakshi
Sakshi News home page

అనిశ్చితిలో మార్కెట్..!

Published Mon, Nov 14 2016 2:09 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

అనిశ్చితిలో మార్కెట్..! - Sakshi

అనిశ్చితిలో మార్కెట్..!

అంతర్జాతీయ సంకేతాలతో కదలికలు
కంపెనీల క్యూ 2 ఫలితాల ప్రభావం
గురు నానక్ జయంతి సందర్భంగా నేడు సెలవు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం తదనంతర  అంతర్జాతీయ సంకేతాల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ2 ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతరం ప్రభుత్వ చర్యలు కూడా స్టాక్ సూచీలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపారుు మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

గురు నానక్ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. నేడు వెలువడే టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. సమీప భవిష్యత్తులో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు, కంపెనీల క్యూ2 ఫలితాలు ప్రభావం చూపుతాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. అనిశ్చిత పరిస్థితుల్లోకి మార్కెట్ కదులుతోందని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఐటీ, ఫార్మా, తదితర రంగాల పట్ల జనవరి దాకా అమెరికా కొత్త అధ్యక్షుడి విధానాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదని, అప్పటిదాకా అనిశ్చితి తప్పదని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు... స్వల్ప కాలంలో వినియోగదారుల కొనుగోళ్ల తీరును  ప్రభావితం చేయనున్నదని వివరించారు. 

ఇక  నేడు  టాటా మోటార్స్, అరబిందో ఫార్మా కంపెనీలు, రేపు(మంగళవారం)గెరుుల్ ఇండియాలు సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2 )ఫలితాలను వెల్లడించనున్నారుు.

గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 455 పారుుంట్లు నష్టపోరుు 26,819 పారుుంట్ల వద్ద ముగిసింది.

విదేశీ పెట్టుబడులు రెట్టింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు రెట్టింపుకు మించి 450 కోట్ల డాలర్లకు పెరిగాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే క్వార్టర్‌లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర అమ్మకందార్లుగా నిలిచారని ఈ నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఏడు నెలల తర్వాత ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని, ఇదే ధోరణి మూడో క్వార్టర్‌లో కూడా కొనసాగనున్నదని పేర్కొంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 170 కోట్ల డాలర్లు, రెండో త్రైమాసిక కాలంలో 450 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టారని వివరించింది. ఇక దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ క్యూ1లో 40 లక్షల డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టారని, కానీ, క్యూ2లో 150 కోట్ల డాలర్ల నికర అమ్మకాలు జరిపారని వివరించింది. క్యూ2లో మ్యూచువల్ ఫండ్‌‌స 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది.

 పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు..: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయని ఐసీఐసీఐ డెరైక్ట్ నివేదిక వివరించింది. యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, టాటా మోటార్స్, రిలయన్‌‌స, ఎల్‌ఐసీ హౌసింగ్ కంపెనీల్లో అధికంగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్,  అదానీ పోర్ట్స్, ఏషియన్ పెరుుంట్స్‌ల్లో విదేశీ నిధుల ఉపసంహరణ జరిగిందని వెల్లడించింది.  వాహన, లోహ, ఆర్థిక, ఇంధన తదితర దేశీయ ఆర్థిక కేంద్రీకృత రంగాల్లోని షేర్లలో  విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారని, ఫార్మా, ఐటీ వంటి విదేశీ సంబంధిత రంగాల్లోని షేర్లలో అమ్మకాలు జరిపారని నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement