ఎస్బీఐపై మొండిబకాయిల బండ
• క్యూ2లో లాభం రూ.21 కోట్లే... 99.6 శాతం డౌన్
• స్థూల మొండిబకారుులు 7.14 శాతానికి జంప్...
• భారీగా ఎగబాకిన ఎన్‌పీఏ కేటారుుంపులు...
ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు మొండి బకారుులు(ఎన్‌పీఏ) షాకిచ్చారుు. బ్యాంక్ కన్సాలిడేటెడ్(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం ఘోరంగా పడిపోరుుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో బ్యాంక్ కేవలం రూ.20.7 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,992 కోట్లతో పోలిస్తే... ఏకంగా 99.6 శాతం దిగజారడం గమనార్హం. ప్రధానంగా ఎన్‌పీఏలకు కేటారుుంపులు(ప్రొవిజనింగ్) భారీగా పెరగడం, నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) స్వల్పంగానే వృద్ధి చెందడం లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఇక క్యూ2లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.72,918 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.66,829 కోట్లతో పోలిస్తే.. 9.1 శాతం వృద్ధి నమోదైంది.
స్టాండెలోన్‌గా 35 శాతం తగ్గుదల...
ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల(స్టాండెలోన్) ప్రాతిపదికన ఎస్‌బీఐ నికర లాభం క్యూ2లో రూ.2,538 కోట్లకు తగ్గిపోరుుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,879 కోట్లతో పోలిస్తే 35 శాతం క్షీణించింది. ఆదాయం 8.2 శాతం పెరుగుదలతో రూ. 46,855 కోట్ల నుంచి రూ.50,743 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు సెప్టెంబర్ క్వార్టర్‌లో బ్యాంక్ స్టాండెలోన్ లాభం రూ.2,697 కోట్లుగా, ఆదాయం రూ.57,421 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు.
రూ. లక్ష కోట్లకు దాటిన ఎన్‌పీఏలు...
సమీక్షా కాలంలో బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు దాదాపు రెట్టింపు అయ్యారుు. మొత్తం రుణాల్లో 7.14 శాతానికి ఎగబాకారుు. గతేడాది క్యూ2లో ఇవి 4.15 శాతంగా ఉన్నారుు. నికర ఎన్‌పీఏలు కూడా 2.14 శాతం నుంచి 4.19 శాతానికి రెట్టింపయ్యారుు. విలువ పరంగా బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు రూ. లక్ష కోట్ల మార్కును దాటారుు. క్యూ2లో రూ.1.05,783 కోట్లకు పేరుకుపోయారుు. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.56,834 కోట్లు మాత్రమే. ఇక నికర ఎన్‌పీఏలు సైతం రూ.28,592 కోట్ల నుంచి రూ.60,013 కోట్లకు దూసుకెళ్లారుు. కాగా, ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 6.94 శాతం, నికర ఎన్‌పీఏలు 4.05 శాతంగా ఉన్నారుు. మొండిబకారుులకు కేటారుుంపులు క్యూ2లో రూ.6,387 కోట్ల నుంచి రూ.8,686 కోట్లకు ఎగబాకారుు. కాగా, ఎస్‌బీఐ గ్రూప్ మొత్తం స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి(జీఎన్‌పీఏ) రెట్టింపునకు పైగా ఎగసి 4.32 % నుంచి 8.49 శాతానికి చేరింది. నికర ఎన్‌పీఏలు 2.27% నుంచి 5.1 శాతానికి ఎగసింది.
తాజా ఎన్‌పీఏలు రెట్టింపు...
ఈ మూడు నెలల కాలంలో కొత్తగా రూ.10,341 కోట్ల విలువైన రుణాలు ఎన్‌పీఏలుగా మారారుు. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,875 కోట్లతో పోలిస్తే రెట్టింపయ్యారుు. మొండిబకారుులుగా మారే అవకాశం ఉన్న రుణాలకు సంబంధించి పరిశీలన జాబితా(వాచ్‌లిస్ట్) పరిమాణం రూ.25,951 కోట్లుగా నమోదైంది.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
⇔ సెప్టెంబర్ క్వార్టర్‌లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 1.3% పెరిగి రూ.14,253 కోట్ల నుంచి రూ.14,437 కోట్లకు చేరింది.
⇔ ఇతర ఆదాయం 35.9% పెరిగి రూ.8,424 కోట్లుగా నమోదైంది.
⇔ బ్యాంక్ మొత్తం రుణాలు సెప్టెంబర్ చివరినాటికి రూ.14,81,831 కోట్లకు చేరారుు. క్రితం ఏడాది ఇదే కాలంలో రుణాలు రూ.13,37,153 కోట్లతో పోలిస్తే రుణ వృద్ధి 8.1%గా నమోదైంది.
⇔ మొత్తం డిపాజిట్ల పరిమాణం రూ.16,34,114 కోట్ల నుంచి రూ.18,58,999 కోట్లకు ఎగబాకారుు. 13.7 శాతం వృద్ధి చెందారుు.
⇔ ఎస్‌బీఐ షేరు ధర బీఎస్‌ఈలో శుక్రవారం 3 శాతం దిగజారి రూ.273 వద్ద స్థిరపడింది.
ఎన్‌పీఏలకు కేటారుుంపులు 36 శాతం ఎగబాకడం లాభాలపై ప్రభావం చూపింది. ప్రధానంగా వాచ్‌లిస్ట్‌లోని రుణాల నుంచే కొత్త ఎన్‌పీఏలు జతయ్యారుు. వాచ్ లిస్ట్ పరిమాణం రానున్న కాలంలో మరో 5,000-7,000 కోట్లు తగ్గే అవకాశం ఉంది. ఇక రెండో త్రైమాసికంలో రుణవృద్ధి అనుకున్నదానికంటే చాలా నెమ్మదించింది. కొన్ని రంగాలకు రుణాల జారీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడమే దీనికి కారణం. అరుుతే, మూడో క్వార్టర్ నాటికి 11-12 శాతం రుణ వృద్ధి అంచనాలను చేరుకుంటామని భావిస్తున్నాం. ఇక టాటా గ్రూప్‌లో సైరస్ మిస్త్రీని చైర్మన్‌గా తొలగించిన తర్వాత నెలకొన్న విభేదాలపై మాకేమీ ఆందోళన లేదు(గ్రూప్ కంపెనీలకు ఎస్‌బీఐ భారీగానే రుణాలిచ్చింది). ఎందుకంటే సమర్థవంతమైన ప్రొఫె షనల్స్ ఉన్న టాటా గ్రూప్... ఈ తాత్కాలిక సమస్యలను వేగంగానే పరిష్కరించుకోగలదన్న విశ్వాసం ఉంది’. - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్