క్యూ2లో 60 శాతం మార్కెట్ వాటా
• రూ.10 వేల లోపుండే కన్జూమర్ డ్యూరబుల్స్‌లో..
• తొలిసారి 0 శాతం వడ్డీకి రుణాలు
• హోమ్ క్రెడిట్ ఇండియా సీఎంఓ థామస్ హృడికా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) హోమ్ క్రెడిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2016 రెండో త్రైమాసికంలో 60 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. హైదరాబాద్‌లో రూ.10 వేలలోపు కన్జూమర్ డ్యూరబుల్ రుణాల విభాగంలో ఈ ఘనత సాధించినట్లు హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ థామస్ హృదికా గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారి కస్టమర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై 0% వడ్డీకి రుణాలను ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
ఇందుకోసం జియోని, ఇంటెక్స్, లావా, మైక్రోమ్యాక్స్, ఒప్పో వంటి అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. రెండేళ్ల క్రితం నగరంలో కార్యకలాపాలను ప్రారంభించిన హోమ్ క్రెడిట్‌కు ప్రస్తుతం 250 పీఓఎస్‌లు ఉన్నాయని, ఈ ఏడాది చివరికి 400కు విస్తరిస్తామన్నారు. సెల్‌ఫోన్లు, గృహోపకరణాలు, ద్విచక్రవాహనాల కొనుగోలుదారులకు కేవలం 5 నిమిషాల్లోనే రుణాలు పొందేలా టెక్నాలజీని అభివృద్ధి చేశామని... ఆయా స్టోర్లలోనే ఫైనాన్సింగ్ సేవలను అందించడం తమ ప్రత్యేకతని తెలియజేశారు. మనదేశంతో పాటు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా వంటి 10 దేశాల్లో సేవలందిస్తోంది.