షావోమికు ఝలక్‌ : నకిలీ ఎంఐ స్టోర్లు | XiaomiIndia Head Cheated by Fake Franchises | Sakshi
Sakshi News home page

షావోమికు ఝలక్‌ : నకిలీ ఎంఐ స్టోర్లు

Published Tue, Feb 12 2019 2:23 PM | Last Updated on Tue, Feb 12 2019 3:06 PM

XiaomiIndia Head Cheated by Fake Franchises - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : షావోమి ఇండియాకు నకిలీల బెడద తప్పలేదు. ఏకంగా షావోమి ఇండియా హెడ్‌ మనుకుమార్‌ జైన్‌కు దేశీయంగా అక్రమార్కులు భారీ ఝలక్‌ ఇచ్చింది. తప్పుడు సంతకాలతో, నకిలీ పత్రాలతో ఫ్రాంచైజీలను ఓపెన్‌ చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని స్వయంగా మనుకుమార్‌ జైన్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఈ స్కాం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీనికి సంబంధించి  పత్రాలను కూడా ట్విటర్‌లో  పోస్ట్‌ చేశారు.  ఈ నకిలీలు స్టోర్లు, మోసాలపై  అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. 

కొంతమంది రీటైలర్లు తమను మోసం చేశారని  స్వయంగా మనుకుమార్‌ జైన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఎంఐ స్టోర్లు కొనుగోలుకు సంబంధించిన ఈ స్కాంలో కొంతమంది రీటైలర్ల అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు.  దీనిపై  సైబర్‌  క్రైమ్‌  పోలీసులకు  ఫిర్యాదు చేశామని ట్వీట్‌  చేశారు. దీనిపై విచారణ సాగుతోందని వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement