Manu Kumar Jain
-
షావొమీకి మను జైన్ గుడ్‌బై
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న చైనా కంపెనీ షావొమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, భారత విభాగం మాజీ అధిపతి మను కుమార్ జైన్ రాజీనామా చేశారు. తొమ్మిదేళ్లపాటు ఆయన భారత వ్యవహారాలను నిర్వహించారు. ఫెమా నిబంధనలను షావొమీ ఉల్ల -
షావోమి ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. హార్డ్‌షిప్ బోనస్‌కింద ఉద్యోగులకు15 రోజుల జీతాన్ని బోనస్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంలో ఇబ్బందులను ఎదుర్కొన్న కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ఇతరలకు వార్షిక బిజినెస్ బోనస్‌కు అదనంగా ఈ బోనస్‌ను అందించనుంది. అలాగే తన ఉద్యోగులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులతోపాటు, ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ ఖర్చులను తామే భరిస్తామని షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. వీరందరికీ అర్హత ప్రమాణాల ప్రకారం కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ 60వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ తరువాత దేశీయ డిమాండ్ పెరగడంతో, ఎగుమతులను నిలిపివేయాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. స్థానిక డిమాండ్‌కే తమ తొలి ప్రాధాన్యమని జైన్ తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకంలో భాగంగా తన భాగస్వాములతో కలిసి దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. కాగా సీఎంఆర్ ఇండియా డేటా ప్రకారం 2020 మూడవ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో ఉంది షావోమి. 27 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. దేశంలో స్మార్ట్ఫోన్లతో పాటు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వీఆర్ హెడ్సెట్లు వర్ బ్యాంక్‌లను షావోమి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
సోనూ సూద్ నెక్ట్స్ మిషన్ ఇదే!
సాక్షి, ముంబై: నటుడు సోనూ సూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా, లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా నిలిచిన తన మిషన్‌ను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఆపన్నులను ఆదుకోవడంతోపాటు, అనేకమంది పేద విద్యార్థుల చదువులు నిలిచిపోకుండా విశేష కృషి చేశారు. ఈక్రమంలో తాజాగా స్టార్ట్‌ఫోన్ తయారీదారు షావోమితో జత కలిసారు. ఈ విషయాన్ని సోనూ సూద్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘మనమంతా ఐక్యంగా పోరాడి మార్గం ఎంత కఠినమైనా.. ఓటమిని అంగీకరించేది లేదంటూ కలల సాకారాన్ని నిరూపించి చూపాం. ఈ క్రమంలో మరో మార్గాన్ని చేపట్టాం. మీ అందరి సాయంతో ఈ పరంపరను ఇకపై కూడా కొనసాగిద్దాం..’’ ఈ రోజునుంచి ఏ విద్యార్థి తన ఆన్లైన్ క్లాస్‌లను మిస్‌కాకూడదు అంటూ మరోసారి పునరుద్ఘాటించిన ఆయన ఒక కొత్త మిషన్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను కూడా సోనూ షేర్ చేశారు. సౌకర్యాల లేమి ఎంత కృంగదీస్తుందో తెలుసు.. అందుకే షావోమితో జతకలిసానని ఆయన వెల్లడించారు. అందరి సహాకారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేల స్మార్ట్ఫోన్లను విద్యార్థులకు అందిద్దామంటూ పిలుపు ఇచ్చారు. ఇందుకోసం ఎంఐ ఇండియా ఆధ్వర్యంలో తాను చేపట్టిన ‘శిక్షా హర్ హాత్’కోసం ప్రతిజ్ఞ పూనాలని సూచించారు. మీలో ఎవరిదగ్గరైనా, పూర్తిగా పనిచేస్తూ ఉండి.. మీకు ఉపయోగపడకుండా ఉన్న ఏదైనా స్మార్ట్‌ఫోన్ ఉంటే మాకు తెలపండి..మేం దాన్ని అర్హులైన విద్యార్థులకు అందజేస్తా మంటూ ఆయన తన వీడియో సందేశంలో వెల్లడించారు. ఈ వీడియోలో షావోమి గ్లోబల్ వైస్‌ప్రెసిడెంట్ మనోజ్‌కుమార్ జైన్ కూడా ఉన్నారు. పూర్తి కండిషన్లో ఉండి, డొనేట్ చేయాలనుకుంటున్న తమ పాత స్మార్ట్‌ఫోన్ సమాచారాన్ని యూజర్లు సమీపంలోని ఎంఐ కేంద్రంలో అందించాలని మనుకుమార్ విజ్ఞప్తి చేశారు. Aaj se koi bhi bacha apna online class nahi miss karega. This is our next mission... #ShikshaHarHaath Take the pledge with me here: https://t.co/f4Ev7vMc28@XiaomiIndia, @ManuKumarJain & @PrateikDas pic.twitter.com/w4XlMBqoMX — sonu sood (@SonuSood) January 25, 2021 -
‘స్మార్ట్‌ఫోన్ - ఆవు’ కథనంపై షావోమి స్పందన
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చిన పిల్లల ఆన్లైన్ చదువుల కోసం కుటుంబ పోషణకు ఆధారణమైన ఆవును అమ్ముకున్న వైనంపై ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా ఎండీ మను కుమార్ జైన్ స్పందించారు. హృదయాన్ని కదిలించే అంశమంటూ ఆ కుటుంబానికి సాయం అందించేందుకు జైన్ ముందుకొచ్చారు. వివరాలు షేర్ చేయాల్సిందిగా ట్వీట్ చేశారు.వారి పిల్లల విద్యాభ్యాసానికి సాయం చేస్తామని కూడా ప్రకటించారు. ఈ సందర్బంగా స్మార్ట్‌ఫోన్ నిత్యావసరమైన వస్తువుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ చదువులు, వర్క్ ఫ్రం హోం లాంటి వాటికి స్మార్ట్‌ఫోన్ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించడంతో షావోమి టీం బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించిందని జైన్ తెలిపారు. అలాగే బిడ్డల చదువుకు ఎలా సాయం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు తెలిపారు. కాగా ఈ కథనంపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) After my morning tweet, many people helped us with the contact details of the man who sold his cow to buy a #smartphone. Happy to share that @XiaomiIndia team met him & we've donated ration for his family. We're discussing how best to support his kids' education. 🙏#Xiaomi ❤️ https://t.co/xzBXAuTAyw pic.twitter.com/7woqATnD1h — Manu Kumar Jain (@manukumarjain) July 24, 2020 -
షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి ఇక ల్యాప్ ట్యాప్ మార్కెట్లో దూసుకపోయేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలను అందబాటు ధరల్లో తీసుకొచ్చి వినియోగదారులను విపరీతంగా ఆకర్షించిన షావోమి నోట్‌బుక్‌ను భారతదేశంలో లాంచ్ చేయనుంది. షావోమి రెడ్‌మిబుక్ పేరుతో దీన్ని ఈ నెల 11 వతేదీన ఆవిష్కరించనుంది. (రెడ్మీ 10 ఎక్స్ వచ్చేసింది..) ఎంఐ నోట్‌బుక్ జూన్ 11న భారతదేశంలో ప్రత్యేకంగా ప్రారంభించబోతున్నట్లు షావోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ సోమవారం ధృవీకరించారు. భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, ఇండియాలోనే తయారు చేసిన వీటిని తీసుకొస్తున్నట్లు ట్వీట్ చేశారు. తద్వారా ల్యాప్‌టాప్ మార్కెట్లో హెచ్‌పీ ఆపిల్, డెల్, లెనోవా వంటి టాప్ బ్రాండ్లతో కంపెనీ పోటీ పడాలని షావోమి చూస్తోంది. (మరో సంచలనం దిశగా షావోమి) ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ రాబోయే షావోమి ల్యాప్‌టాప్ 1సీ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్కు మద్దతుతో, 35 నిమిషాల్లో 0-50 శాతం వరకూ రీఛార్జ్ చేయగలదని అంచనా. షావోమి రెడ్మి బుక్ ప్రత్యేకతలు 13.3-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే (యాంటీ గ్లేర్ ) 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ 5, 7, ప్రాసెసర్లు ప్రధానంగా ఉండనున్నాయి. ఇక ధరల విషయానికి వస్తే.. రూ. 47,490, రూ. 54,800 ధర వద్ద ప్రారంభం కానున్నాయి. 📢 The brand new #MiNotebook will make its #Global #Debut in #India and will be: 🇮🇳 India 1st 🇮🇳 India exclusive 🇮🇳 Made for India Block the date: 𝐉𝐔𝐍𝐄 𝟏𝟏. No, it's not exactly what you're thinking 😇. RT 🔁 if you can't wait to see it.#Xiaomi ❤️️ pic.twitter.com/IKYkHnSQAk — Manu Kumar Jain (@manukumarjain) June 1, 2020 -
షాకింగ్ న్యూస్; షావోమి వివరణ
సాక్షి, హైదరాబాద్: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి సేకరిస్తున్నట్టు వస్తున్న వార్తలను షావోమి ఇండియా తోసిపుచ్చింది. డేటా గోప్యత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. షావోమి ఇండియా మొత్తం డేటాను రెండేళ్ల క్రితం స్థానిక సర్వర్లకు తరలించినట్టు వెల్లడించింది. వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండా డేటాను తాము సేకరించడం లేదని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ ట్విటర్ ద్వారా తెలిపారు. తమ దగ్గరున్న సమాచారాన్ని సురక్షితంగా ఉంటుందని, బయటకు వెల్లడించే అవకాశం లేదన్నారు. ఇండియా డేటా ఇండియాలోనే ఉంటుందని స్పష్టం చేశారు. షావోమి తన కంపెనీ ఫోన్ల ద్వారా ఎక్కువగా యూజర్ డేటాను సేకరిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు మనుకుమార్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. (మొబైల్ డేటాతో ‘కరోనా’ గుర్తింపు!) ‘ఇంటర్నెట్ సంస్థగా షావోమి వినియోగదారుల సమాచార రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. డేటా గోప్యతలో ప్రపంచంలోని ఇతర ప్రముఖ బ్రౌజర్ల మాదిరిగానే ఎంఐ బ్రౌజర్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తుంది. ఇది వినియోగదారుల నుంచి స్పష్టమైన అనుమతి లేదా సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించదు. మా దగ్గరున్న సమాచారాన్ని పూర్తి సురక్షితంగా ఉంటుంది. రహస్య మోడ్‌లో బ్రౌజ్ చేసిన వాటిని ఎంఐ బ్రౌజర్ ఎప్పటికీ గుర్తించలేదు. లాగిన్ అయిన వినియోగ డేటా మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఏదైనా వెబ్సైట్ పని చేయకపోతే లేదా నెమ్మదిగా ఉంటే మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగ్గా, వేగంగా చేయడానికి రహస్య డేటా ఉపయోగించబడుతుంది. ఇది ఇతర బ్రౌజర్ చేసే మాదిరిగానే ఉంటుంది. ఎంఐ బ్రౌజర్‌తో సహా షావోమి స్మార్ట్ఫోన్లు, వాటిలోని డీఫాల్ట్ యాప్‌లు.. భద్రత, గోప్యతపరంగా సురక్షితమైనవని ప్రఖ్యాత అంతర్జాతీయ థర్డ్ పార్టీ కంపెనీలు ట్రస్ట్ఆర్క్, బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ (బిఎస్ఐ) ధ్రువీకరించాయి. ఎంఐ బ్రౌజర్, ఎంఐ క్లౌడ్‌లోని భారత వినియోగదారుల డేటా అంతా ఇండియాలోని ఏఎస్‌డబ్ల్యూ సర్వర్లలో స్థానికంగా నిల్వ చేయబడుతుంద’ని మనుకుమార్ జైన్ వివరించారు. -
జగన్! మీరు యువతకు స్ఫూర్తి
‘‘జగన్ గారూ!! నేటి యువతకు మీరో స్ఫూర్తి. రాష్ట్రానికి సంబంధించి మీ విజన్‌ను పూర్తిగా విన్నాక నాలో చాలా ఉత్తేజం కలిగింది. ఇదో అద్భుతమైన సమావేశం’’ అంటూ మొబైల్ దిగ్గజం షావొమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, కంపెనీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ మంగళవారం ట్వీట్ చేశారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి ఏపీలో మరో ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచిన మను జైన్... ఆ భేటీ తాలూకు వివరాలు, ఫొటోలతో మంగళవారం కొన్ని ట్వీట్లు చేశారు. ‘‘ఆయన చాలా సింపుల్‌గా, సాదాసీదాగా కనిపిస్తారు. కానీ అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన్నుంచి మేం చాలా నేర్చుకున్నాం. ఉత్తేజం పొందాం’’ అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. సోమవారం నాటి చర్చల్లో మేకిన్ ఇండియాలో భాగంగా పలు ఉపకరణాలు ఇక్కడే తయారు చెయ్యడానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రితో షావొమి బృందం చర్చించింది. It was great meeting you Jagan @YSJagan Garu. 🙏 You are an inspiration for today's youth. I am feeling motivated after listening to your vision for the state! #Xiaomi ❤️ #AndhraPradesh @AndhraPradeshCM https://t.co/3ea2y7OeNT — #MiFan Manu Kumar Jain (@manukumarjain) July 23, 2019 -
‘సీఎం జగన్ చాలా సాదాసీదాగా ఉన్నారు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సాదాసీదాగా ఉన్నారని, ఆయన్ని కలవటం చాలా సంతోషంగా ఉందని షావోమి సంస్థ ఎండీ మనుకుమార్ జైన్ అన్నారు. సోమవారం సీఎం జగన్‌తో భేటీ అయిన జైన్ ఏపీలో తమ కంపెనీ ప్రణాళికలను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ట్విటర్ వేదికగా జైన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ సీఎం వైఎస్ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది. మేకిన్ ఇండియా గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దీనిపై మా అభిప్రాయం సీఎంతో పంచుకున్నాం. వైఎస్ జగన్ కూడా రాష్ట్ర అభివృద్ధిపై తనకున్న దార్శనికతను తెలిపారు. ఆయన ద్వారా మేం ఎంతో ప్రేరణ పొందాము’’ అని పోస్ట్ చేశారు. Great meeting h'ble @AndhraPradeshCM, Shri @YSJagan Garu. 🙂 He is very simple & down-to-earth, yet so confident. Felt inspired & motivated. 🙏 We spoke about #MakeInIndia plans. Most of our phones are manufactured in AP. 🏭 He also shared his vision for the state.#Xiaomi ❤️ pic.twitter.com/GUF1pdp9Ws — #MiFan Manu Kumar Jain (@manukumarjain) July 23, 2019 -
స్మార్ట్దేశ్ కా స్మార్ట్‌ఫోన్.. కమింగ్ సూన్
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. రెడ్ మి సిరీస్‌లో రెడ్మి 7ఏ పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని షావోమి ఇండియా ప్రెసిడెంట్ మనుకుమార్జైన్ ట్విటర్‌ద్వారా వెల్లడించారు. జూలై 4న స్మార్ట్ దేశకా స్మార్ట్‌ఫోన్ వస్తోందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ డివైస్‌లో చైనాలో అందుబాటులో లేని పీచర్‌ను జోడిస్తున్నామంటూ ఊరిస్తున్నారు. రెడ్మి 6ఏ తరువాత ఆ పరంపరలో రెడ్మి7ఏ ను లాంచ్ చేస్తోంది. ఇప్పటికై చైనాలో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఇండియాలో రూ.6 వేల వద్ద నిర్ణయించ వచ్చని అంచనా. ఇక ఫీచర్లు ఇలా ఉండనున్నాయట. రెడ్మి 7ఏ ఫీచర్లు 5.4 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 పై 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్పీ కెమెరా 4000 బ్యాటరీ Mi fans, here’s something exciting 😉. We are set to launch the #Redmi7A on 4th July. Let’s welcome #SmartDeshKaSmartphone and get ready to see it conquer the world. Can’t wait! 😎 How long will it take for 7A to become #1? 😉Any guesses? 😍#Xiaomi #Redmi pic.twitter.com/NNg9lfppmS — Manu Kumar Jain (@manukumarjain) July 1, 2019 -
షావోమికు ఝలక్ : నకిలీ ఎంఐ స్టోర్లు
సాక్షి, న్యూఢిల్లీ : షావోమి ఇండియాకు నకిలీల బెడద తప్పలేదు. ఏకంగా షావోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్‌కు దేశీయంగా అక్రమార్కులు భారీ ఝలక్ ఇచ్చింది. తప్పుడు సంతకాలతో, నకిలీ పత్రాలతో ఫ్రాంచైజీలను ఓపెన్ చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని స్వయంగా మనుకుమార్ జైన్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఈ స్కాం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీనికి సంబంధించి పత్రాలను కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ నకిలీలు స్టోర్లు, మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది రీటైలర్లు తమను మోసం చేశారని స్వయంగా మనుకుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎంఐ స్టోర్లు కొనుగోలుకు సంబంధించిన ఈ స్కాంలో కొంతమంది రీటైలర్ల అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ట్వీట్ చేశారు. దీనిపై విచారణ సాగుతోందని వెల్లడించారు. FRAUD ALERT! I have come across a scam where few retailers have been cheated into buying fake franchises of @XiaomiIndia Mi Stores! Shocking to see forged documents, with my fake signatures. We have filed a case with cyber crime department & police is investigating this matter. pic.twitter.com/AbK6Pvfbei — Manu Kumar Jain (@manukumarjain) February 12, 2019 -
పరిశ్రమ తలకిందులే..
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమి నోట్ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారతమార్కెట్లో త్వరలోనే లాంచ్ చేయనుంది. రెడ్మీ నోట్7 పేరుతో ఇప్పటికే చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనున్నామని ట్విటర్ ద్వారా షావోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ వెల్లడించారు. 48 మెగా పిక్సల్ కెపాసిటీతో..అద్భుతమైన డివైస్ వస్తోందని ట్వీట్ చేశారు. అంతేకాదు పరిశ్రమను తలకిందులు చేయనున్నామంటూ కంపెనీ సీఈవో లీ జూన్‌తో ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. అయితే కచ్చితమైన సమయాన్ని జైన్ ప్రస్తావించకపోయినప్పటికీ ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని అంచనా. బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్స్ ఆప్షన్లలో, మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.10,390గా, 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 12,459, 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 14,537గా ఉండనుందని అంచనా. రెడ్మీ నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 48+ 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0. ˙sᴉ sᴉɥʇ ʇɐɥʍ ʍouʞ noʎ ɟᴉ ┴R ¡ƃuᴉɯoɔ sᴉ #ԀW8ᔭ ƃuᴉzɐɯ∀ ˙uʍop ǝpᴉsdn ʎɹʇsnpuᴉ sᴉɥʇ uɹnʇ ɐuuoƃ ǝɹ,ǝM pic.twitter.com/ojvMXWPTUt — Manu Kumar Jain (@manukumarjain) January 24, 2019 -
రెండున్నర రోజుల్లో 25 లక్షల డివైజ్‌లు అమ్మకం
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమి రికార్డులు బ్రేక్ చేసింది. కేవలం రెండున్నర రోజుల్లో 25 లక్షలకు పైగా ఎంఐ డివైజ్‌లను విక్రయించింది. ఈ డివైజ్‌ల్లో ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ పవర్ బ్యాంక్‌లు, ఎంఐ ఇయర్ఫోన్లు, ఎంఐ రూటర్లు, ఎంఐ ఎకో సిస్టమ్ డివైజ్‌లు, యాక్ససరీ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఎంఐ సూపర్ సేల్ల్లో భాగంగా షావోమి ఈ రికార్డులను బ్రేక్ చేసింది. ఫెస్టివల్ కానుకగా నిర్వహిస్తున్న ఈ మూడు సేల్స్‌లో అమేజింగ్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. షావోమి ఈ రికార్డును అక్టోబర్ 9వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7 గంటల మధ్యలో సాధించినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ వీపీ మను కుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ అనూహ్యమైన స్పందనకు, ప్రేమకు ఎంఐ అభిమానులందరికీ మను కుమార్ జైన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫెస్టివల్ సేల్స్‌లో భాగంగా షావోమి ప్రొడక్ట్‌లపై అందిస్తున్న ఆఫర్లు.... రెడ్మి నోట్ 5 ప్రొ రూ.2000 డిస్కౌంట్లో లభ్యమవుతుంది. హెచ్డీఎఫ్సీ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో మొత్తంగా ఈ ఫోన్ రూ.11,699కే అందుబాటులోకి వస్తోంది. రెడ్మి వై2(3జీబీ+32జీబీ) ఫోన్, రెడ్మి వై2(4జీబీ+64జీబీ) స్టోరేజ్ ఫోన్ రూ.1000, రూ.2000 డిస్కౌంట్లో విక్రయానికి వచ్చింది. ఎంఐ మిక్స్ 2 ధర రూ.7000 తగ్గింది. దీంతో ఇది రూ.22,999కే లభ్యమవుతుంది. ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43) ధరలు రూ.500, రూ.2000 మేర తగ్గాయి. డిస్కౌంట్ అనంతరం ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43)లు రూ.13,499కు, రూ.20,999కు విక్రయానికి వచ్చాయి. 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.699కే విక్రయిస్తున్నాయి. 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.1399కు లభ్యమవుతోంది. -
భారత్‌లోకి షావోమి ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్
ఎప్పడికప్పుడు బడ్జెట్ స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో చైనీస్ మొబైల్ తయారీ దిగ్గజం షావోమి కస్టమర్లను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం స్పెయిన్‌లో జరిగిన ఓ ఈవెంట్లో షావోమి ఎంఐ ఏ2, ఎంఐ ఏ2 లైట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్ఫోన్లలో ఒకదాన్ని ఎంఐ ఏ2 ను ఆగస్టు 8న భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్టు షావోమి తెలిపింది. ఇక రెండో స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచింగ్ గురించి అసలు ఇసుమంతైనా ఊసు ఎత్తలేదు. ఎంఐ ఏ2 ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చినప్పటికీ, అన్ని వేరియంట్లు కూడా మన మార్కెట్లోకి రావట. ఎంఐ ఏ2 మోస్ట్ అఫార్డబుల్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను షావోమి భారత్‌లో లాంచ్ చేయడం లేదని తెలిసింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను మాత్రమే దేశంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందని వెల్లడైంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఆప్షన్ కూడా మన దేశంలో లాంచ్ అవుతుందట. గ్లోబల్‌గా లాంచ్ అయిన గోల్డ్, బ్లాక్, బ్లూ రంగుల్లో మాత్రమే కాకుండా.. రోజ్ గోల్డ్ రంగులో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లభ్యం కానుంది. షావోమి ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 8న భారత్‌లో లాంచ్ చేయనున్నామనే విషయాన్ని షావోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ధృవీకరించారు. షావోమి ఎంఐ ఏ2 ధర... 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు భారత్‌కు రావడం లేదు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.22,500 ఉండొచ్చు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర సుమారు రూ.28,100 ఉండొచ్చు. స్పెషిఫికేషన్లు.. డ్యూయల్ సిమ్(నానో) ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రామ్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గ్లాస్ గొర్రిల్లా గ్లాస్ 5 ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్ఓసీ వెనుక వైపు 12 ఎంపీ, 20 ఎంపీతో డ్యూయల్ కెమెరా సెటప్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3010 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారత్‌లోకి ‘చైనా యాపిల్’!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు భారత్‌లో అందిస్తోంది. వచ్చేవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమవుతాయని షియోమి వెబ్సైట్ పేర్కొంది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ల విక్రయాలు జరిగే అవకాశాలున్నాయి. 86 సెకన్లలో లక్ష ఫోన్ల విక్రయాలు ఈ కంపెనీ ఎంఐయూఐ వీ5 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ను కస్టమైజ్ చేసింది. ఎంఐయూఐ వీ5 ఓఎస్‌పై పనిచేసే ఈ ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080పి ఎల్సీడీ టచ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 800 2.3 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రెనో 330 450 మెగా హెర్ట్జ్ జీపీయూ, 2 జీబీ ర్యామ్, ఈఎంఎంసీ 4.5 ఫ్లాష్ మెమరీ, 16 జీబీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3050 ఎంఏహెచ్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులకు చైనాలో ఎంత క్రేజ్ ఉందంటే, ఆన్లైన్లో ఎంఐ 3 ఫోన్లు 86 సెకన్లలోనే లక్ష అమ్ముడు కావడం విశేషం. ఆన్లైన్లోనే అమ్మకాలు షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. బీజింగ్ కేం ద్రంగా పనిచేసే ఈ కంపెనీ అనతికాలంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఈ సంస్థ ఇప్పటికే 1.7 కోట్ల హ్యాండ్సెట్లను విక్రయించింది. ఎంఐ 3, రెడ్మి, ఎంఐ వై-ఫై, ఎంఐ బాక్స్ తదితర హ్యాండ్సెట్లను అందిస్తోంది. ఈ కంపెనీ ఆన్లైన్లోనే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిటైల్ స్టోర్స్‌లో ఎక్కడా తన ఫోన్లను విక్రయించదు. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో 1 శాతమే మార్కెటింగ్‌కు కేటాయిస్తోంది(శామ్సంగ్ కేటాయింపు 5.1%). ఇలా ఆదా చేసిన సొమ్ములతో నాణ్యమైన విడిభాగాలను కొనుగోలు చేసి అత్యంత ఆధునిక ఫీచర్లున్న ఫోన్లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమి కంపెనీ భారత కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ చూస్తారు. ఈ మేరకు షియోమి కం పెనీ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. హువాయి, జెడ్‌టీఈ, లెనొవొ, జియోని, అప్పో వంటి ఇతర చైనా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయి.