ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్
ఎప్పడికప్పుడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్‌తో చైనీస్ మొబైల్ తయారీ దిగ్గజం షావోమి కస్టమర్లను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం స్పెయిన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో షావోమి ఎంఐ ఏ2, ఎంఐ ఏ2 లైట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లలో ఒకదాన్ని ఎంఐ ఏ2 ను ఆగస్టు 8న భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టు షావోమి తెలిపింది. ఇక రెండో స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచింగ్ గురించి అసలు ఇసుమంతైనా ఊసు ఎత్తలేదు. ఎంఐ ఏ2 ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చినప్పటికీ, అన్ని వేరియంట్లు కూడా మన మార్కెట్‌లోకి రావట. ఎంఐ ఏ2 మోస్ట్ అఫార్డబుల్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను షావోమి భారత్‌లో లాంచ్ చేయడం లేదని తెలిసింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను మాత్రమే దేశంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందని వెల్లడైంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఆప్షన్ కూడా మన దేశంలో లాంచ్ అవుతుందట. గ్లోబల్‌గా లాంచ్ అయిన గోల్డ్, బ్లాక్, బ్లూ రంగుల్లో మాత్రమే కాకుండా.. రోజ్ గోల్డ్ రంగులో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో లభ్యం కానుంది. షావోమి ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 8న భారత్‌లో లాంచ్ చేయనున్నామనే విషయాన్ని షావోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ధృవీకరించారు.
షావోమి ఎంఐ ఏ2 ధర...
4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు భారత్‌కు రావడం లేదు.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.22,500 ఉండొచ్చు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర సుమారు రూ.28,100 ఉండొచ్చు.
స్పెషిఫికేషన్లు.. డ్యూయల్ సిమ్(నానో)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రామ్
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్ గ్లాస్
గొర్రిల్లా గ్లాస్ 5
ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌ఓసీ
వెనుక వైపు 12 ఎంపీ, 20 ఎంపీతో డ్యూయల్ కెమెరా సెటప్
20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3010 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment