చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. రెడ్ మి సిరీస్‌లో రెడ్‌మి 7ఏ పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని షావోమి ఇండియా ప్రెసిడెంట్ మనుకుమార్‌జైన్ ట్విటర్‌ద్వారా వెల్లడించారు. జూలై 4న స్మార్ట్ దేశకా స్మార్ట్‌ఫోన్ వస్తోందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ డివైస్‌లో చైనాలో అందుబాటులో లేని పీచర్‌ను జోడిస్తున్నామంటూ ఊరిస్తున్నారు.
రెడ్‌మి 6ఏ తరువాత ఆ పరంపరలో రెడ్‌మి7ఏ ను లాంచ్ చేస్తోంది. ఇప్పటికై చైనాలో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఇండియాలో రూ.6 వేల వద్ద నిర్ణయించ వచ్చని అంచనా. ఇక ఫీచర్లు ఇలా ఉండనున్నాయట.
రెడ్‌మి 7ఏ ఫీచర్లు
5.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9 పై
3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్
13ఎంపీ రియర్ కెమెరా
5ఎంపీ సెల్పీ కెమెరా
4000 బ్యాటరీ
Mi fans, here’s something exciting 😉. We are set to launch the #Redmi7A on 4th July.
— Manu Kumar Jain (@manukumarjain) July 1, 2019
Let’s welcome #SmartDeshKaSmartphone and get ready to see it conquer the world. Can’t wait! 😎
How long will it take for 7A to become #1? 😉Any guesses? 😍#Xiaomi #Redmi pic.twitter.com/NNg9lfppmS
Comments
Please login to add a commentAdd a comment