‘స్మార్ట్‌ఫోన్ ‌- ఆవు’ కథనంపై షావోమి స్పందన | XiaomiIndia Helped the family who sold cow for smart phone | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌ఫోన్‌ - ఆవు’ కథనంపై షావోమి స్పందన

Published Fri, Jul 24 2020 7:59 PM | Last Updated on Fri, Jul 24 2020 8:33 PM

 XiaomiIndia Helped the family who sold cow for smart phone - Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ సంక్షోభం కారణంగా ప్రాచుర‍్యంలోకి వచ్చిన పిల్లల ఆన్‌లైన్‌ చదువుల కోసం కుటుంబ పోషణకు ఆధారణమైన ఆవును అమ్ముకున్న వైనంపై  ప్రముఖ మొబైల్‌ తయారీదారు షావోమి ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ స్పందించారు. హృదయాన్ని కదిలించే అంశమంటూ ఆ కుటుంబానికి సాయం అందించేందుకు జైన్‌ ముందుకొచ్చారు. వివరాలు షేర్‌ చేయాల్సిందిగా ట్వీట్‌ చేశారు.వారి పిల్లల విద్యాభ్యాసానికి సాయం చేస్తామని కూడా ప్రకటించారు. ఈ సందర్బంగా స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసరమైన వస్తువుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌ చదువులు, వర్క్‌ ఫ్రం హోం లాంటి వాటికి స్మార్ట్‌ఫోన్‌ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. 

ఈ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించడంతో షావోమి టీం బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించిందని జైన్‌ తెలిపారు. అలాగే బిడ్డల చదువుకు ఎలా సాయం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు  తెలిపారు.  కాగా ఈ కథనంపై బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. (ఆ కథనంపై చలించిన సోనూసూద్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement