భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో ఆక్సిమీటర్లు, కరోనా టెస్ట్ కిట్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. వీటితో పాటు ఇమ్యూనిటీ బూస్టర్‌లు, మినరల్ సప్లిమెంట్‌ల ఆర్డర్‌లు ప్రతి వారం దాదాపు 50 శాతం పెరుగుతున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
►ఈ-కామర్స్ దిగ్గగం ఫ్లిప్‌కార్ట్, హెల్త్ కేర్ ఫ్లాట్ ఫామ్ 1ఎంజీ లెక్కల ప్రకారం...మనదేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభంతో ఆక్సిమీటర్ల అమ్మకం దాని సాధారణ డిమాండ్ కంటే 4.4 రెట్లు పెరిగిందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అదే సమయంలో దేశంలోని పలు మెట్రో నగరాల్లో కోవిడ్-19 టెస్ట్ కిట్‌లకు డిమాండ్ 12 రెట్లు పెరిగింది.
►సెల్ఫ్ కరోనా టెస్ట్ కిట్ తయారీ సంస్థ మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ ప్రతినిధులు సైతం కొత్త కేసులు ప్రారంభం కావడంతో కోవిసెల్ఫ్ అమ్మకం 500 శాతం పెరిగిందని తెలిపారు. ఈ అమ్మకాలలో ఎక్కువ భాగం ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపింది.
►ఫ్లిప్‌కార్ట్, మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వివరాల ప్రకారం..సెల్ఫ్ కరోనా కిట్‌లను పంపిణీ చేసే పిరమల్ సంస్థ జనవరి మొదటి తొమ్మిది రోజుల్లో దేశ మొత్తం 4 లక్షల కిట్‌లపై అమ్మకాలు జరిపింది. గత డిసెంబర్ నెల మొత్తంలో 1.39 లక్షల సెల్ఫ్ టెస్టింగ్ కిట్‌లను మాత్రమే అమ్మింది.
దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా టెస్ట్‌లతో పాటు రోగనిరోధక శక్తిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కాబట్టే డాక్టర్ల సాయం లేకుండా ప్రజలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి రోగనిరోధక శక్తిని పెంచే ప్రొడక్ట్‌లు, విటమిన్ సప్లిమెంట్‌లు,కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తున్నారు. జనవరి రెండో వారం ముగిసే సమయానికి ప్రతి వారంతో 50 శాతం వృద్ధిని చూస్తుండగా, ఈ కాలంలో కిరాణా సామాగ్రి డిమాండ్ కూడా దాదాపు రెట్టింపు అయింది. భారతీయ నగరాల్లో అనేక లాక్‌డౌన్‌లు మరియు కదలిక ఆంక్షలు కనిపించడం ద్వారా కూడా ఇది ఊపందుకుంది.
చదవండి: వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!
Comments
Please login to add a commentAdd a comment