పరిశ్రమ తలకిందులే.. | Xiaomi  Redmi Note 7 to launch soon to India, confirms company | Sakshi
Sakshi News home page

పరిశ్రమ తలకిందులే..

Published Thu, Jan 24 2019 8:52 PM | Last Updated on Thu, Jan 24 2019 9:00 PM

Xiaomi  Redmi Note 7 to launch soon to India, confirms company - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ దిగ్గజం షావోమి నోట్‌ సిరీస్‌లో నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను భారతమార్కెట్లో త్వరలోనే లాంచ్‌ చేయనుంది. రెడ్‌మీ నోట్7 పేరుతో ఇప్పటికే చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేయ‌నున్నామని ట్విటర్‌ ద్వారా షావోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ వెల్లడించారు. 48 మెగా పిక్స‌ల్‌ కెపాసిటీతో..అద్భుతమైన డివైస్‌ వస్తోందని ట్వీట్‌ చేశారు. అంతేకాదు పరిశ్రమను తలకిందులు చేయనున్నామంటూ  కంపెనీ సీఈవో లీ జూన్‌తో ఉన్న ఒక ఫోటోను కూడా షేర్‌ చేశారు. అయితే కచ్చితమైన సమయాన్ని జైన్‌ ప్రస్తావించకపోయినప్పటికీ ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఈ ఫోన్‌ లాంచ్‌ కావచ్చని అంచనా.

బ్లాక్‌, బ్లూ, ప‌ర్పుల్ కలర్స్‌ ఆప్షన‍్లలో, మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ‍్యం కానుంది. 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.10,390గా, 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 12,459, 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 14,537గా ఉండనుందని అంచనా. 

రెడ్‌మీ నోట్ 7 ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
48+ 5 ఎంపీ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా
13  ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement