జేమ్స్‌బాండ్‌-007 భాగస్వామ్యంతో స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌..!  | Triumph Tiger 900 Bond Edition Announced | Sakshi
Sakshi News home page

Triumph Tiger 900 Bond Edition: జేమ్స్‌బాండ్‌-007 భాగస్వామ్యంతో స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌..! 

Published Wed, Sep 22 2021 7:52 PM | Last Updated on Wed, Sep 22 2021 7:54 PM

Triumph Tiger 900 Bond Edition Announced - Sakshi

Triumph Tiger 900 Bond Edition: ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు క్రేజ్‌ మామూలుగా ఉండదు. నిర్మాణ సంస్థలు అదే స్థాయిలో విలువలను పాటిస్తూ బాండ్‌ సినిమాలను రూపొందిస్తాయి. సినిమా అయ్యే ఖర్చు గురించి అసలు పట్టించుకోరు. త్వరలోనే జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లోని 25వ చిత్రం‘నో టైం టూ డై’ ప్రేక్షకులకు ముందు రానుంది.
చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!


జేమ్స్‌ బాండ్‌ 007  ప్రాంఛైజీ భాగస్వామ్యంతో ట్రయంఫ్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌ను ప్రకటించింది. ట్రయంఫ్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ అనే కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ని మార్కెట్లలోకి కంపెనీ  టీజ్‌ చేసింది. ట్రయంఫ్‌ మోటార్స్‌ కేవలం 250 బైకులను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. గతంలో ట్రయంఫ్‌ మోటార్స్‌ జేమ్స్‌ బాండ్‌ ప్రాంఛైజీ భాగస్వామ్యంతో ట్రయంప్‌ స్క్రాంబ్లర్‌ 1200 బాండ్‌ ఎడిషన్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. 

టైగర్ 900 బాండ్ ఎడిషన్ బైక్‌ విషయానికి వస్తే..ప్రత్యేకమైన మాట్ సఫైర్ బ్లాక్ పెయింట్‌తో 007 గ్రాఫిక్స్‌తో ఈ బైక్‌ రానుంది. బిల్లెట్ మెషిన్డ్ హ్యాండిల్ బార్ క్లాంప్‌తో పాటు బైక్‌ ప్రత్యేకమైన లిమిటెడ్-ఎడిషన్ నంబర్‌తో వస్తుంది. బైక్‌లో ఫ్రేమ్, హెడ్‌లైట్ ఫినిషర్లు, సైడ్ ప్యానెల్‌లు, సంప్ గార్డ్, పిలియన్ ఫుట్‌రెస్ట్ హ్యాంగర్లు, ఇంజిన్ గార్డ్‌లు అన్నీ ప్రీమియం బ్లాక్ ఫినిషింగ్‌తో రానున్నాయి.


బైక్‌ స్పీడో మీటర్‌ 007బాండ్‌ సిగ్నేచర్‌ను ఏర్పాటుచేశారు. అదనపు పెర్ఫార్మెన్స్ కోసం  మిచెలిన్ అనకీ వైల్డ్ ఆఫ్-రోడ్ టైర్స్‌ను అమర్చారు. కాగా ఈ బైక్‌ ప్రస్తుతం  భారత్‌లో  అందుబాటులో లేదు, టైగర్ 900 బాండ్ ఎడిషన్ బైక్‌ యూరోప్, యుఎస్ఏ, కెనడాలోని కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 
చదవండి: No Time Time To Die: గన్నులున్న జేమ్స్‌బాండ్‌ కారు.. అమ్మకానికి రెడీ !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement