కోల్‌కతాపై షారుక్ ఆసక్తి
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు యజమానిగా ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ దృష్టి ఇప్పుడు ఫుట్‌బాల్‌పై పడింది. ఐఎంజీ-
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు యజమానిగా ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ దృష్టి ఇప్పుడు ఫుట్‌బాల్‌పై పడింది. ఐఎంజీ-రిలయన్స్ ఆధ్వర్యంలో జరుగబోయే లీగ్‌లో కోల్‌కతా ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు షారుక్ ఆసక్తి చూపుతున్నాడు. ‘గతంలో గోవా ఐ లీగ్ క్లబ్ డెంపోలో వాటాలను తీసుకుందామని అనుకున్నాను. అయితే ఇప్పుడు కొత్తగా ఫ్రాంచైజీల ఆధారంగా లీగ్ రాబోతోంది. ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టి ఓ ఫ్రాంచైజీని తీసుకుందామని భావిస్తున్నాను. ముఖ్యంగా కోల్‌కతా ఫుట్‌బాల్ క్లబ్‌ను తీసుకుంటే ఇంకా బావుంటుంది’ అని షారుక్ తన మనసులో మాట బయటపెట్టాడు.
ముంబైలో తొలి మ్యాచ్
ఐపీఎల్ తరహా ఫుట్‌బాల్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 18న జరిగే తొలి మ్యాచ్‌కు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఎనిమిది ఫ్రాంచైజీల వేలం, నవంబర్‌లో ఆటగాళ్ల వేలం జరుగనుంది. అన్ని ఫ్రాంచైజీలు క్లబ్స్‌గా రిజిష్టర్ అవుతాయి. జట్లను కొనుగోలు చేసిన వారు పదేళ్లు యజమానులుగా ఉంటారు. ప్రతీ జట్టులో పది మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిపి 22 మంది ఆటగాళ్లు ఉంటారు.