ముంబై: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) లోనూ ఓ జట్టును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్‌లో కోల్‌కతా నైట్‌రెడర్స్ యజమాని అయిన షారుక్ ఫుట్‌బాల్‌లోనూ కోల్‌కతాకు చెందిన ప్రాంచైజీనే కోరుకుంటున్నారు. ప్రస్తుతం 8 జట్లతో ఉన్న ఐఎస్‌ఎల్ వచ్చే ఏడాది 10 జట్లకు విస్తరించనుంది.