అంతర్జాతీయ టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్ నమోదైంది. ఏషియన్ గేమ్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో భాగంగా జపాన్‌తో ఇవాళ (మే 8) జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 12 పరుగులకే ఆలౌటైంది.
పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ గతేడాది ఫిబ్రవరి 26న నమోదైంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు 10 పరుగులకే చాపచుట్టేసి చెత్త రికార్డు మూటగట్టుకుంది.
మంగోలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. జపాన్ ఇన్నింగ్స్‌లో శబరీష్ రవిచంద్రన్ (69) అర్దసెంచరీతో రాణించాడు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన మంగోలియా.. జపాన్ బౌలర్ల ధాటికి 8.2 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా జపాన్ 205 పరుగుల అతి భారీ తేడాతో విజయం సాధించింది.
పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో భారీ విజయంగా నమోదైంది. 2023లో నేపాల్ ఇదే మంగోలియాపై సాధించిన 273 పరుగుల విజయం పొట్టి క్రికెట్ చరిత్రలోనే అతి భారీ విజయంగా నమోదైంది.
ఈ మ్యాచ్‌లో జపాన్ బౌలర్ కజుమా కటో స్టాఫోర్డ్ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డౌట్లయ్యారు. 4 పరుగులు చేసిన సుమియా టాప్ స్కోరర్ కాగా.. ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment