2020కి ముందు వరకు కరోనా అనేది మార్కెట్లో లభించే ఒక బీర్ పేరు. కరోనాని మనం కోవిడ్ అని కూడా వ్యవహరిస్తున్నాం. అయితే ఈ కోవిడ్ అనే పేరును మనుషులు పెట్టుకుంటారని, పైగా ఆ పేరుతో ఒక మనిషి ఉన్నాడని కూడా మనం ఊహించి ఉండం.
(చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?)
అసలు విషయంలోకెళ్లితే.....హోలిడిఫై అనే ఆన్‌లైన్ టూర్ ట్రావెల్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడి పేరు కోవిడ్ కపూర్. అయితే ఎప్పుడైతే ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడించడం మెదలైందో అప్పటి నుంచి ఈ కోవిడ్ కపూర్‌కి తన పేరుతో సమస్యలు మొదలయ్యాయి. దీంతో ట్విట్టర్‌లో అతను "నా పేరు కోవిడ్ నేను వైరస్ కాదు" అని పెట్టుకున్నాడు.
ఇటీవల అతను విదేశాలకు వెళ్లినప్పుడు తన పేరు విని ఆశ్చర్యపోవడమే కాక రకరకాలు జోక్‌లు వేసుకుంటున్నారు. దీంతో ఇక తాను భవిష్యత్తులో విదేశాలకు వెళ్లినపుడల్లా తన పేరు తనకి ఒక ఎంటెర్‌టైన్మంట్ మారి పర్యాటన మొత్తం సరదా సరదాగా సాగిపోతుందని అంటున్నాడు. అయితే తన పేరుకి అర్థం "పండితుడు" లేదా "ప్రావీణ్యం ఉన్న వ్యక్తి" అని హనుమాన్ చాలీసాలో ఉంటుందని వివరించాడు.
అఖరికి అతని పుట్టిన రోజుకి తన స్నేహితులు కేక్‌ని ఆర్డర్ చేశారు. పాపం ఆ కేకు మీద కోవిడ్(kovid) అని కాకుండా covid అని బేకరి వాళ్లు తప్పుగా రాశారని చెప్పాడు. దీంతో మిస్టర్ కపూర్ కొన్ని సామాజిక మాధ్యమాల్లో కబీర్ కపూర్ అనే పేరుని కూడా మార్చుకున్నాడు. ఎవరైన ఒక్కసారో రెండోసార్లో మనపై జోక్‌లు వేస్తే సహించగలం. ఇలా ప్రతిసారి అందరూ మూకుమ్మడిగా వ్యంగ్యంగా జోక్‌లు వేస్తుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేం కదా.!
(చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..!)
Now that you mention it.... pic.twitter.com/90FutdBcnF
— Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022
For my 30th bday, my friends ordered a cake - and Amintiri automatically assumed that it's some kinda joke, and it should be spelled with a C not a K. 🎂 pic.twitter.com/3jrySteSbC
— Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022
Comments
Please login to add a commentAdd a comment