photo credits:HINDUSTAN TIMES
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలోగ్నా, రిమినీ స్టేషన్ల మధ్య ఒక హై స్పీడ్ రైలును మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.
అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు. దేశ డిప్యూటీ పీఎం, రవాణా మంత్రి కూడా అయిన మాట్టే సాల్వినీ ఈ ప్రమాదంపై స్పందించారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు చిన్న గాయాలే అయ్యాయని తెలిపారు.
ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment