సాక్షి,హైదరాబాద్: మెట్రోరైలులో సోమవారం(నవంబర్ 4) ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. కీలకమైన ఐటీ కారిడార్‌ను కనెక్ట్ చేసే నాగోల్-రాయదుర్గం లైన్‌లోని బేగంపేట-రాయదుర్గం మధ్య సాంకేతిక సమస్య కారణంగా రైళ్లు 13 నిమిషాల పాటు ఆగిపోయాయి. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
విద్యుత్ ఫీడర్‌లో సమస్య కారణంగా మెట్రో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయని ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసు సమయం మించిపోతోందని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైళ్లు యథావిథిగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
కాగా, గతంలోనూ పలుమార్లు మెట్రో రైలుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురై గంటలకొద్దీ నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ సందర్భాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి: సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్‌జామ్
Comments
Please login to add a commentAdd a comment